మీ వ్యూస్

అంతా ప్రచారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమాన హీరోల చిత్రాల కలెక్షన్లు తెలుసుకోవాలని అభిమానులకు ఆత్రంగా వుంటుంది. వాళ్లను సంతృప్తిపర్చడానికి నిర్మాతలు గాలిలోకి అంకెలు వదులుతుంటారు. కానీ వాటిని ఎంతవరకు నమ్మాలో ఎవరికీ తెలియదు. అతి కొద్దికాలంలో వంద కోట్లు సాధించిన చిత్రం ఖైదీ నెం 150 తాలూకు టోటల్ కలెక్షన్లు ఎంతో చెప్పలేదు. శాతకర్ణి వందకు చేరుకుంటుందని చెప్పినా అది 70 కోట్లే సాధించింది. నాగార్జున చిత్రాలు వరుసగా నాలుగు హిట్లు అన్నారు కానీ ఊపిరికి నష్టం వచ్చింది. ఓం నమో వెంకటేశాయ కొన్ని థియేటర్లలో బాగా ఆడినా, పేరుకోసం ఖాళీ థియేటర్లను కూడా రన్ చేశారు. మొత్తంగా ఈ సినిమా యావరేజ్‌గా పోయింది. కనుక ప్రచార ఆర్భాటాలను నమ్మరాదు.
-బి.స్నేహమాధురి, పెద్దాపురం

ఆపాట మధుర ధార
మల్లాది రామకృష్ణ కవి జయభేరి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘రసిక రాజా తగువారము కామా’ అన్న పాటను రాశారు. ఆ పాటను ఘంటసాలవారు వెయ్యి రిహార్సిల్స్ చేసి పాటను రికార్డు చేశారు. అది వారి జీవితకాలంలో అన్ని సార్లు రిహార్సల్స్ ఏ పాటకు చేయలేదట. ఈ చిత్రంలో మల్లాదివారి ‘మది శారదాదేవి మందిరమే, రాగమయి రావే’ పాటలు అతి మధురమైన అమృతధారలు. ఆనాడువారు అంత నిష్టగా పాటను పాడారు కనుకనే ఇప్పటికీ అవి అమృతం తాగిన విధంగా చిరంజీవుల్లా తెలుగు ప్రేక్షకుల పెదవులపై నాట్యం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి పాటలు సినిమా చూసి బయటికి వచ్చాక గుర్తు కూడా వుండవు. అదీ అప్పటికీ ఇప్పటికీ తేడా!
-కెవి ప్రసాదరావు, కందుకూరు

సావిత్రి సినిమా
సావిత్రి జీవిత కథతో ఓ సినిమా తెలుగులో రావడం చాలా సంతోషదాయకం. ఆ మహానటిని ఈ విధంగానైనా స్మరించుకోవచ్చు. కీర్తి సురేష్ కథానాయికగా నటించనుందని తెలిసింది. అయితే ఆ పాత్రకు ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో అన్న అనుమానమూ వుంది. ఇలానే శ్రీశ్రీపై కూడా ఓ చిత్రం వస్తే బాగుండు. ఓ మహానటి సావిత్రి, ఓ మహాకవి శ్రీశ్రీ- ఎవరు వీరికి సాటి? భారతీయులు గర్వించదగ్గ వీరికి పద్మ పురస్కారాలు రాకపోవడం ప్రభుత్వ డొల్లతనం తెలుస్తుంది.
-వై.సుధాత్రి, తణుకు

తమిళ తెలుగు
వెనె్నల్లో ఉత్తరం చదివాక ఈ జాబు రాయాలనిపించింది. తెలుగులో ఇప్పటికి యముడిమీద బోల్డన్ని సినిమాలు వచ్చేశాయి. అందువలన యమన్ అని వాళ్లు వాళ్ల సినిమాకు పేరు పెట్టుకున్నారు. సరే.. యమన్‌కు పర్యాయపదం ఆ లెటర్ రాసినవారు కనుక్కుని రాస్తే బాగుండేది. తెలుగులో వ్యాకరణం రాసినంత మాత్రాన నీ బుద్ధి తక్కువ మాటలు చదవడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి. తమిళంలో కొన్ని అక్షరాలకి ఒకటి రెండు అర్థాలుండవచ్చు. క, గ, అలాగే ప, బ- త,ద- అన్నీ ఒకేలా ఉండవు. పన్రి అంటారు. బంతి అనరు. సదరు ఉత్తర రచయిత తమిళం అర్జంటుగా నేర్చుకుంటే అజ్ఞానం పోతుంది. ప్రేక్షకుల్లో ఎవరూ అజ్ఞానులు లేరు. అందరూ విజ్ఞానులే. తెలుగులో వ్యాకరణం రాయడం కాదు, తమిళంలో కూడా కాస్తంత ప్రాథమిక విజ్ఞానం అలవర్చుకుంటే అసలు ఆ ఉత్తరమే రాసేవారు కాదు. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్లకు ఎంత భయం ఉంటుంది, ఆలోచించండి. 50 పైసల కార్డుపైన ఏదైనా రాసుకోవచ్చు అనుకుంటే తప్పు!
-ఎస్.దీపిక, పుంగనూరు

అగ్రనటుల ఆదర్శం
తెలుగు చిత్రాలలో అగ్రనటులైన అక్కినేని, ఎన్టీఆర్‌లు హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం స్వంత స్టూడియోలు నిర్మించి తరువాతి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఆనాటి వారి కృషివల్ల తెలుగు సినీ పరిశ్రమ శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియో ప్రారంభ చిత్రంలో 1976లో ‘దాన వీర శూర కర్ణ’ నిర్మిస్తే, అది సంచలనాలకు మారుపేరు అయింది. ఆనాటి సినీ పత్రికలు, వెండితెర, సినీ హెరాల్డ్‌లలో ఆనాటి డి.వి.ఎస్.కర్ణ షూటింగ్ విశేషాలు, వర్కింగ్ స్టిల్స్ అభిమానులకు కనువిందు చేశాయి. వారి వారసులుగా నాగార్జున, బాలకృష్ణ అమరావతిలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేయాలని కోరుకుంటున్నాం. నాలుగు దశాబ్దాల నాటి సినీ విశేషాలను అందిస్తున్న శరత్కాలం నిజంగా వెనె్నలలాంటిదే.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి

నాకో తంబూరా వుంది
అలనాటి మహానటుడు చిత్తూరు నాగయ్య అనేక ఆటుపోట్లతో రూపొందించిన ‘్భక్తరామదాసు’ చిత్రానికి ఒక్క అవార్డు రాలేదు. రామదాసుకు రాగిచెంబు అయినా ఇవ్వలేదని ఒకాయన చమత్కరించారు. నాగయ్య మాత్రమే కాక అందరూ సర్వమంగళనామ సర్వవినుత అని పాడుతారు. కానీ శర్వమంగళనామ, శర్వవినుత అని పాడాలని ఒక పండితుడు చెప్పాడు. శర్వుడు అంటే ఈశ్వరుడు. రామేశ్వరం, రామలింగేశ్వరుడు అనే పేర్లు రామునికి ఈశ్వరునికి వున్న అనుబంధాన్ని తెలుపుతాయి. మంగళప్రదమైన ఈశ్వర నామం కలవాడా, ఈశ్వరుని చేత స్తుతింపబడినవాడా రామా అని ఆ చరణానికి అర్థం. ఇప్పుడు ఇలాంటి పాటలు పాడేందుకు చిత్తూరు నాగయ్యలు లేరు. అంతా చిత్తు చిత్తుగా మత్తు మత్తుగా పాడేస్తున్నారు.
-ఆర్.శాంతి చంద్రిక, సామర్లకోట

హీరో విలన్
అసలు హీరో విలనే అన్న వ్యాసం ఆకట్టుకుంది. చదివాక ఎన్నో ఆలోచనలు కలిగాయి. దేవతలంతా ఉత్తరాదివారని, రాక్షసులు దక్షిణాదివారని అప్పట్లో పురాణాల్లో చిత్రించారన్నది ద్రవిడ భావజాలం. మణిరత్నం అలాంటి భావజాలం ఉన్నవాడే. తీస్తున్నది సాంఘి రామాయణమైనా అలా చెప్పకుండా విలన్ చిత్రం తీశాడు. దానిలో విలన్ అన్యాయానికి గురైన ధీరుడు. హీరో చేతగానివాడు. కిడ్నాప్ అయిన హీరో భార్య విలన్‌పట్ల సానుభూతి, సద్భావం చూపిస్తూ వుంటుంది. విలన్‌ని హీరోగా చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు.
-జె.్ధర్మతేజ, గొడారిగుంట