మీ వ్యూస్

హవ్వ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీ నెంబర్ 150 చిత్రానికి చిరు కుమార్తె రూపొందించిన కాస్ట్యూమ్స్ అసౌకర్యంగా ఉన్నాయని అన్నందుకు ఆ చిత్రంలో ఐటెమ్ పాటలో నృత్యం చేయాల్సిన కేథరిన్ థ్రెస్సాను తప్పించి, రాయ్‌లక్ష్మిని పెట్టుకున్నారు. అలా తాను అని ఉండకూడదు, చిరుతో అవకాశం పోయింది. మళ్లీ అవకాశం వస్తుందో లేదో అని ఆమె బాధపడింది. మరిప్పుడు అదే కేథరిన్ చిరుతో ఐటెమ్ పోయినందుకు బాధపడడం లేదు. నేనేరాజు నేనే మంత్రి సినిమాలో మంచి పాత్ర దొరికిందంటూ పొంగిపోయింది. నెగెటివ్ షేడ్స్‌తో నటనకు ఆస్కారం వున్న ఆ పాత్రలో మంచి పేరు వస్తుందని చెబుతోంది. .
-ఆర్. మరుదకాశి, కరప

గురు అంటే గురునే!
వెంకటేష్ కథానాయకుడుగా వచ్చిన గురు సినిమా ఇప్పటి తరాలకు మార్గదర్శకంగా వుంది. వెంకటేష్ ఇలాంటి పాత్రలను చక్కగా చేయగలడని మరోసారి నిరూపించారు. పాత్రను ఆకళింపుచేసుకుని ఆయన నటించిన తీరు అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా రావుడుగా నటించిన అమ్మాయి ఒకానొక సందర్భంలో వెంకటేష్ కన్నా అద్భుతంగా నటనను పండించింది. గురువు అంటే ఇలా ఉండాలి అనేలా తీర్చిదిద్దారు సినిమాను. ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం వుంది.
- టి.రఘురామ్, నరసరావుపేట

అంతేగా మరి!
మనకు బాగా తెలిసిన హీరోలు, అందమైన హీరోలు, మెగా హీరోలు ఏవో కొన్ని చిత్రాలు వంద కోట్ల రాబడి దాటితే, ఇక ఏది తీసినా అదే కోట్లకు దారి అనుకుంటే ఎలా? బ్రహ్మోత్సవం బ్రహ్మాండం బద్దలు చేస్తుందని అన్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ గుర్రం కోట్లు కొల్లగొడుతుందన్నారు. కబాలీ బాక్సాఫీస్‌ని కబళించేస్తుందన్నారు. చివరకు ఏమైంది? అన్నీ చతికిలపడ్డాయి. ఈ హైప్‌లన్నీ హుష్‌కాక్‌లైపోయాయి. వీరిని ప్రతిసారీ నమ్ముకొని వందకోట్ల సినిమాలు తీయాలా? ఇక ఓ బిచ్చగాడి కథ. ఎవరితను? ఎవరీ హీరో విజయ్‌ఆంటోనీ? తెలుగువారికెవరికైనా తెలుసా? పోనీ ఇది స్ట్రయిట్ సినిమానా? మరెందుకు బిచ్చగాడు నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కోటీశ్వరులుగా చేశాడు? కథాకథనం కావాలి మొర్రో అంటున్నా చెవికెక్కకపోతే ఫలితాలు ఇలానే వుంటాయి. ఇమేజ్‌లు, డామేజ్‌లు కలిగిస్తాయి. నిర్మాతలు మొహమాటాలకుపోయి ఇలాంటి సినిమాలు తీయకండి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

86 ఏళ్లు
వెనె్నలలో మాటలు నేర్చిన అలంఅరా విశేషాలు ఆకట్టుకున్నాయి. ఆరోజుల్లో ఆ చిత్ర వివరాల్లోకెళితే ఆనందం అనిపిస్తుంది. పరిశ్రమ బావుంటేనే అంటూ ఇచ్చిన శరత్‌కాలమ్ బావుంది. హైదరాబాద్ అగ్రనటుల స్టూడియోల గురించి చక్కగా వివరించారు. హీరో.. విలనే అన్న విశే్లషణా వ్యాసం ఆకట్టుకుంది. ఆరోజుల్లో విలన్ గెటప్‌లో తారతమ్యాలను చక్కగా వివరించారు. చందమామ పాటలపై విశే్లషణ బావుంది. ఆతరం మధురాతి మధురమైన పాటలను ఇక వినలేమేమో?
- మంగం ఆనందరావు, వేగివారిపాలెం

ఖేల్ ఖతం
వర్మకు ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో ఆయన స్కూల్‌నుండి వచ్చిన పూరి జగన్నాథ్‌కు అన్ని ప్లాప్స్ ఉన్నాయి. టెంపర్‌కు ముందువెనుక హిట్స్ లేనే లేవు. అయినా బాలకృష్ణతో ఒకటి, వెంకటేష్‌తో ఇంకొకటి చిత్రాలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు వచ్చినందుకు ఆనందంకన్నా రెండిట్లో ఒకటి హిట్‌కాకపోయినా ఆయన పని ఖేల్ ఖతం. కెరియర్ క్లోజ్ అనే భయం పట్టుకుంది అతనికి. భయంతోపాటు టెన్షన్ కూడా. ఆ టెన్షన్ తట్టుకోలేక సైకియాట్రిస్ట్‌ని ఆశ్రయించాడని వార్తలు వస్తున్నాయి. ప్లాపుల బారిన పడిన ఎందరో ఇలా రహస్యంగా సైకియాట్రిస్టుల సలహాలు, మందులు తీసుకుంటే ఉంటారు. సక్సెస్ దూరం అయితే అంతే మరి!
- ఎ.చైతన్య, వాకలపూడి

ఆ దగ్గుకూడా
నాదే మాస్టారూ
‘దేవదాసు’ గురించి ఘంటసాలవారు అన్న మాట ఇది. నవలా చక్రవర్తి శరత్ రాసిన దేవదాసు చిత్రం అక్కినేనికి అద్భుతమైన పేరుతెచ్చింది. జగమే మాయ పాట పాడే అదృష్టం నాకు దక్కింది అంటూ ఘంటసాలవారు ఓ సభలో ఆ పాట పాడి ప్రేక్షకులను రంజింప చేశారు. ఆ సభలో ఆయన వేసిన చెణుకు, జిమ్మిక్కు గురించి చెప్పుకోవాలి. ఆ పాటలో దేవదాసు తాగినా, వేదాంత శైలిలో ఈ ప్రపంచమంతా ఒక భ్రమ, మాయ, కన్నీరు, పన్నీరు, కావడికుండలు అనే మాటలమధ్య ఖళ్ ఖళ్ అనే దగ్గు కూడా వచ్చిందని, ఆ దగ్గుకూడా నేనే దగ్గానని చెప్పారు. నాగేశ్వరరావు నటనలో దేవదాసు, నవరాత్రి, ప్రేమ్‌నగర్ ఇత్యాది చిత్రాలు నభూతో నభవిష్యత్‌గా రూపొందాయని తెలిపారు. ఆ పాటలో దగ్గు కూడా నాదే మాస్టారూ అంటూ గొప్పలు చెప్పుకోవడం కూడా స్వోత్కర్ష కాదు సుమా అంటూ రెండుమూడు దగ్గులు దగ్గి అందరిచేత చప్పట్లు స్వీకరించారు. ఇది అలనాటి సంగతి. ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది.
- కె.నాగరాజారావు, హైదరాబాద్

తప్పెవరిది?
జడ చూస్తి మెడ చూస్తి, జబ్బల నునుపు చూస్తి, కనరాని ఒంపులన్నీ ఓలమ్మి, కసికసిగా చూస్తిని ఓలమ్మి.. 40 ఏళ్లకిందటే ఈ పాట చిత్రీకరణ చూసి అర్థరాత్రి థియేటర్‌నుండి బయటకు వచ్చిన యువకుడు, కథానాయిక కనపడదు కనుక అందుబాటులో వున్న యువతిపై అతిగా ప్రవర్తిస్తే ఎవరిని తప్పుపట్టాలి? ఈ ప్రశ్న అప్పట్లో చాలామంది వేసుకున్నారు. మార్చి 14 వెనె్నలలో వచ్చిన లేఖ పూర్తి వాస్తవాన్ని కళ్లకు కట్టింది. కారులో సినీనటిపై దౌర్జన్యంగా ప్రవర్తించిన సందర్భంగా వచ్చిన ఆ లేఖలో సదరు సినీనటి అర్థనగ్నంగా, దాదాపు ముప్పావు శాతం నగ్న ప్రదర్శన చేస్తున్న కారణంగా ఏర్పడిన భావానికి వాళ్లు కనపడినప్పుడు స్పందన, వికృత మనస్కులనుండి ఇంతకన్నా గొప్పగా ఆశించలేం. నటనపై బొత్తిగా పరిచయంలేనివారు తాతలు, తండ్రుల పేర్లతో బతికే హీరోలు నేడు కథానాయికల అందచందాలతో బతుకుతున్నారు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్