మీ వ్యూస్

మిస్టర్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ
వ్యూస్

మిస్టర్ అవుట్
దర్శకుడిగా నా దగ్గర సరుకు అయపోయంది అన్న విషయాన్ని మిస్టర్ చిత్రంతో శీను వైట్ల చెప్పకనే చెప్పాడు. పరాజయాలతో గ్యాప్ తీసుకున్న తరువాత కూడా పరమ చెత్త చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడంటే -తన స్థాయ దర్శకులతో ఆయన పోటీ పడుతున్నట్టా.. వెనక్కి తగ్గినట్టా? మెగా కాంపౌండ్‌లోని హీరో వరుణ్‌తేజ్‌తో సినిమా చేసే అవకాశం దక్కినా.. లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ లాంటి అందగత్తెలు సినిమాలో ఉన్నా కథనంతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడంటే -శీను ఏ దారిలో పోతున్నట్టు. కెరీర్ ఆరంభంలో తీసినట్టుగా ఓ ఫీల్ ఫ్రెష్ కథను ఎంపిక చేసుకుని చిన్న బడ్జెట్‌లో సినిమా తీస్తే ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండొచ్చు. లేదంటే -వైఫల్యాల బాటలో ఎంతదూరం ప్రయాణించాల్సి ఉంటుందో ఎవ్వరికీ అర్థంకాదు. మిస్టర్‌లాంటి మిస్టేక్ రిపీట్ చేయడని ఆశిద్దాం.
-పూర్ణ, ఆముదాలవలస
చతికిలపడ్డాడు
ఆగడు, బ్రూస్‌లీ పరాజయాల తరువాత శ్రీనువైట్ల మిస్టర్ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి కామెడీ అద్ది ప్రేక్షకులపై వదిలాడు. మూడు నాలుగు కథలు ఒకే చిత్రంలో చూపించడానికి దర్శకుడు ప్రయత్నించి చివరకు తడబడి ప్రేక్షకుల తలకు బొప్పి కట్టించాడు. ఫస్ట్ఫా రఘుబాబు, శ్రీనివాసరెడ్డి కామెడీ ఫర్వాలేదు. హీరోయిన్లు ఇద్దరూ తమ అందాలతో సినిమా అంతా కనిపించారు. మాటలు, కెమెరా పనితనం ప్లస్ పాయింట్. స్పెయిన్ అందాలను కర్ణాటక ప్రదేశాలను బాగా చిత్రీకరించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రెగ్యులర్‌గా కనిపించే నటులు ఈ చిత్రంలో కనిపించలేదు.
-జి.గౌరి గాయత్రి, ఉప్పల్
మన హాస్యనటులు
1960లో కాకినాడలో సినిమాలు చూసేవాళ్లం. రేలంగి వుంటేనే మా మామ్మ సినిమా చూసేది. అది కూడా చుట్టుప్రక్కలవారిని తీసుకెళ్లి ఉచితంగా సినిమా చూపించేది. అదీ రేలంగి పవర్. అటు తర్వాత రేలంగి ఖాళీని జంధ్యాల వచ్చేవరకూ బ్రహ్మానందం కొంతలో కొంత పూరించాడు. పదేళ్ల వరకూ బ్రహ్మానందం ఉంటేనే సినిమా చూసినవారున్నారు. తన్నులు, చెంపదెబ్బలు ఆయనతోపాటు వీరూ అనుభవించారు. ఈమధ్యకాలంలో బ్రహ్మానందం లేకుండా హీరో హీరోయిన్లు వెకిలి హాస్యం చేస్తున్నారు. ఏమే, ఒసే, కళ్లు దొబ్బాయా అంటూ వగైరా మాటలతో తెలుగును ఖూనీ చేసి ప్రేక్షకులు పారిపోయేలా చేస్తున్నారు. ఇదీ మన హాస్యం.
-ఎస్ లక్ష్మీనరసింహమూర్తి, హైదరాబాద్
కొత్త గోల
టీవీ చానల్స్ నిండా కొత్త గోల ప్రారంభమైంది. సినిమా టీజర్ విడుదల అయిన గంటలో ఎందరు చూశారు? మొదటిరోజు ఎందరు చూశారు? లెక్కలతో ఆ చిత్రం ఎంత కలెక్షన్లు రాబడుతుందో చెబుతూ బోడిగండుకు మోకాలికి ముడివేస్తున్నారు. బాహుబలి టీజర్‌ను పదికోట్లమంది చూశారట. ఆ చిత్రం 2వేల కోట్లు సాధిస్తుందని చెబుతున్నారు. చిరు ఖైదీ, కాటమరాయుడు టీజర్లు పది లక్షలు మించి ప్రేక్షకుల్ని ఆకర్షించాయట. అందుకని ఈ చిత్రాల కలెక్షన్లు 2వేల కోట్లు మించిపోతాయట! అయితే, ఖైదీ చచ్చీ చెడీ 150 కోట్లు సాధించింది. కాటమరాయుడు 100 కోట్లు చేరుకోవడం కష్టమే. డిజె సంగతి విడుదలైతేకానీ చెప్పలేం. ఎందుకు చానల్స్ అత్యుత్సాహంతో కొత్త గోల పెడుతున్నాయ?!
-బి.చంద్రిక, సర్పవరం
లెట్స్ కుమ్ముడు!
ఈమధ్య చిరు పాల్గొనే ఏ కార్యక్రమాలన్నింటిలోనైనా తప్పక వినిపించే మాట, పాట ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’. అన్ని కార్యక్రమాల్లో చిరంజీవి ఉచ్ఛరించేది కూడా ఈమాటనే! ఈ మాటకు అర్థం ఏమిటో ఎవరైనా ఆలోచించారా? కుమ్ముడు అంటే కాళ్లతో తన్నడమని అర్ధం. ఇదే మాట అమ్మాయతో అంటే మరో అర్థం ధ్వనించే ప్రమాదం ఉంది. అయనా ఆ చరణానికి ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యమే! ముఖ్యంగా సెన్సార్ కూడా!! కానీ కుర్రాళ్లు మాత్రం ఆ చరణాలు పాడి అమ్మాయిలను వేధిస్తున్నారు. కనీసం సీనియర్ నటులైనా బూతు కూతలు ఆపితే బెటర్!
-ఎన్.గిరిధర్, కాకినాడ
అన్నీ ఉపన్యాసాలే!
ఒక ఆంగ్ల దినపత్రిక సర్వే ప్రకారం బాహుబలి-2 ప్రీ రిలీజ్ షో ఫ్లాప్ అయింది. నిర్మాతలు పిలిచారో లేదో కానీ టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ రాలేదు. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, వారి కుటుంబాలు మాత్రమే వచ్చాయి. సినిమా గురించి ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లంతా మిగతావాళ్లని పొగడ్తల్లో ముంచెత్తారు. అన్నీ బోరింగ్ ఉపన్యాసాలే. విసిగించారు. మీడియా గ్యాలరీ చాలాసేపు ఖాళీగానే కనిపించింది. తర్వాత మీడియాకు చెందనివారితో గ్యాలరీ నిండింది. స్థానిక మీడియాని వేదికకు దూరంగా కూర్చోబెట్టి ఇబ్బందికి గురిచేశారు. నిర్మాతలు పూర్తిగా ఆంగ్లంలో ఉపన్యసించి ఆశ్చర్యపరిచారు.
-బి.అభిలాష, సాంబమూర్తినగర్
మాయాబజార్
భారతీయ చలనచిత్ర రంగంలోనే మాయాబజార్‌లాంటి మురిపించే చిత్రం మరే భాషలోనూ రాలేదని గట్టిగా చెప్పొచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, గుమ్మడి వంటి మహానటులు నటించిన ఈ చిత్రంలో విచిత్రమైన కథ ఉంటుంది. మహాభారతంలోని విరాటపర్వాన్ని ఘటోత్కచుడు ఎలా నడిపించాడు అనేదే ఈ కథనం. నటీనటులందరూ ప్రేక్షకుల ముందు మాయచేశారు. సావిత్రి వేసిన శశిరేఖ పాత్ర సజీవమై చిత్రాన్ని స్వర్ణమయం చేసింది. 60 ఏళ్ళు నిండిన ఈ శుభవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఉచితంగా ఒక రోజు వినోదపు పన్ను రద్దుచేసి ప్రదర్శించాలి. మార్కస్ బార్‌ట్లే ఛాయాగ్రహణం కంప్యూటర్లు లేని కాలంలో అద్భుతంగా సినిమాను ఆవిష్కరించింది. గుమ్మడి పోషించిన పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. వివాహ భోజనంబు అంటూ వచ్చిన పాట అమోఘం.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి