మీ వ్యూస్

వెయ్యి కోట్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతం ఇతిహాసాన్ని మూడు గంటల వ్యవధిలోనో లేక రెండు భాగాలుగానో వెయ్యి కోట్లు వెచ్చించి హాలీవుడ్ లెవల్లో సినిమా నిర్మించాలనే సంకల్పం సాహసంతో కూడినదే. ఇందులో బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌లు నటిస్తారట. అమీర్‌ఖాన్ కృష్ణుడని ఓ వార్త. ఇందులో మన తెలుగు నటులు ఎంతమందో మరి! ఈ నిర్మాణానికి ఇద్దరో ముగ్గురో నడుం కడుతున్నారట. అన్ని ముఖ్యమైన భారతీయ భాషల్లో మరియు ఇతర దేశ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్‌లలో ఒకేసారి విడుదల చేస్తారట. అది కూడా 2020లోనట. అంతా బాగానే వుంది. మహాభారత గాథను తెలుగు నిర్మాతలు అద్భుత చిత్రాలుగా నిర్మించి కళాఖండాలుగా తీర్చిదిద్దారు. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి ముఖ్యపాత్రలలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ తదితర ఉద్దండులు అజరామరంగా నటించి నిలిచిపోయారు. ఈ కళ్లతో మరొకరిని చూడగలమా? సాంకేతిక విలువలతో హత్తుకుంటేనే విజయం అందుకుంటుందేమో కానీ నటీనటులపరంగా తెలుగువారికి మరెవరూ ఎప్పటికీ సాటిరారు.
-ఎన్ రామలక్ష్మి,
సికింద్రాబాద్
వేధింపులు తప్పవా?
సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు లైంగిక వేధింపుల గురించి వింటూనే ఉన్నాం. నోరు తెరిచి తెగేసి చెప్పే హీరోయిన్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ఛాన్సులు దక్కవనో, పరువుపోతుందనే ఒకప్పుడు నోరు మూసుకున్నవాళ్లంతా ఇప్పుడు తెరుస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని అమ్మాయిలకు చిత్రసీమలో వేధింపులు తప్పవేమో! నటన వారసులు కూడా వేధించేవారే. ఒకటి రెండు సందర్భాల్లో నేనూ బాధపడ్డాను. తిరగబడితే తప్ప పరిస్థితి చక్కబడదు అని అతిథిరావు హైదరి అన్నది. ఇలియానా కూడా వేధింపులవల్ల తాను బాధపడినట్టు చెప్పింది. చిన్నారి పెళ్లికూతురు హీరోయిన్‌గా మారి వేధింపులు తట్టుకోలేక సినిమా రంగానే్న వదిలేసింది. రాధిక ఆప్టే తెలుగులో నటించనని తెగేసి చెప్పింది. ముమైత్‌ఖాన్ కూడా టాలీవుడ్ విడిచి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఇన్నున్నాయి వేధింపుల కథలు!
-ఎస్ ప్రసాద్, గొడారిగుంట
వెగటు రొమాన్స్
ప్యాషన్లు మారిపోతున్నాయి. డాన్సుర్లు యాంకర్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అవుతోంది. ఇటీవల సోనమ్ కపూర్ ఓ వేడుకలో ఎదభాగం కనిపించేలా డిజైన్ చేసిన సూట్‌ను వేసుకొచ్చింది. సోషల్ మీడియాలో విమర్శించినా డోంట్ కేర్ అంటూ కొట్టిపారేసింది. హిందీ సినిమా అవార్డుల వేడుకలలో ఒక హీరోయిన్ కటి భాగం కనిపించేలా నృత్యాలు చేసింది. మరో కార్యక్రమంలో హెబ్బాపటేల్‌ని తెలుగులో మాట్లాడించే ప్రయత్నంలో మీ అందరికీ ‘ఐ లవ్ యు’ చెప్పించి ఆ తరువాత ఐ లవ్ నందు అని చెప్పించే ప్రయత్నం చేశాడు యాంకర్ నందు! తన సినిమాలో ఆమెకు నచ్చిన డైలాగులు ఇలా చెప్పించాడు. ‘రొమాన్స్‌కి శరీరం ఉండగా బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు?’. మరీ ఇంతగా రెచ్చిపోవడం వెగటుగా ఉంటుందని వారికి ఎటూ తెలియదు. చూసేవారైనా విమర్శించాలిగా.
-జె జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
అలనాటి సంగతి
సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ నిర్మించినపుడు గాలిపెంచల నరసింహారావు సంగీతం అందించారు. ఇందులో చిరస్మరణీయమైన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘కానరారా కైలాస నివాస బాలేందుధర జరాహరా’ పాటలు నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అమృతధారలు. లవకుశ చిత్రానికి సి పుల్లయ్య గాలి పెంచలవారిని సంగీత సారథ్యం వహించమని కోరారు. అనివార్య కారణాలవల్ల వారు చేయలేకపోయారు. పుల్లయ్య వెంటనే ఘంటసాలను సంగీత దర్శకులుగా నియమించగా వారు చేశారు. అందుకు ఆయన ఒకరు తిరస్కరించిన సంగీతాన్ని తానెందుకు చేయాలనే తలంపు లేకుండా బాణీలు కట్టి అమరగీతాలు అందించారు. అదీ అప్పటివారి గొప్పతనం. ఎన్నటికీ ముందుతరాలవారు మరువని విలువలు పాటించారు కనుకే ధన్యులుగా మిగిలారు.
-కెవి ప్రసాదరావు, కందుకూరు
హింస, అశ్లీలం
నేటి సినిమాల్లో నానాటికి హింస, అశ్లీలం దృశ్యాలు పెరుగుతున్నాయి. వెనుకటి చిత్రాల్లో క్లైమాక్స్‌లోనే ఫైటింగ్ సీన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా సినిమాల్లో మొదటినుంచీ చివరిదాకా ఏ క్షణాన ఫైటింగ్ సీన్లు వస్తాయో తెలియదు. వింత వింత ఆయుధాలతో నరుక్కోవడం, రక్తపాతం చేయడం జరుగుతుంది. అశ్లీల సన్నివేశాలు, ద్వంద్వార్థ, ఏకార్థ డైలాగులు పెరుగుతున్నాయి. కుటుంబ సమేతంగా పెద్దలు, పిల్లలు కలిసి సినిమా చూడాలంటే ఇబ్బందికరమే. సినిమా హిట్ కావాలన్నా, కలెక్షన్ సునామీ కురిపించాలన్నా కథ, స్క్రీన్‌ప్లేలో దమ్ముండాలి. కుటుంబ విలువలను, నైతిక విలువలను పెంచేవిగా సందేశాన్నిచ్చేవిగా సినిమాలు రూపొందించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
నేనే గొప్పోణ్ణి
ఎందరో సపోర్టు చేస్తేనే సంగీత దర్శకుడిగా నిలబడ్డాడు కీరవాణి. ఆయనకన్నా ఎందరో మహానుభావులు ప్రస్తుతం చాలామంది వున్నా, అవకాశాలు అండదండలు లేక కనుమరుగయ్యారు. అంతమాత్రాన నేనే గొప్పోణ్ణి అన్నట్టు వ్యాఖ్యలు చేసి నిర్మాత, దర్శలకులను, రచయితలను కించపర్చడం కీరవాణికి ఎంతమాత్రం మంచిది కాదు. చెట్టెక్కి కూర్చున్న కొమ్మనే నరికినట్టుంది కీరవాణి ధోరణి. ఆయనకు తెలుసో లేదో.. ఆయన పాడిన పాటలవల్ల కొన్ని సినిమాలు ఫ్లాపయ్యాయి. గాయకుడిగా ఆయన గొంతు సరిపోదు. అది తెలుసుకుంటే నిర్మాత బాగుపడతాడు. అమితాబ్‌బచ్చన్ లాంటి మహానటుడు కూడా నాకన్నా అమీర్‌ఖాన్ మహానటుడు అని అన్నాడు. రామారావు, నాగేశ్వరరావులు కూడా నేనే గొప్ప నటుణ్ణి అని ఏనాడూ చెప్పలేదు. చక్రవర్తి హయాంలో ఏడాదికి ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు. గిన్నిస్ బుక్ రికార్డ్‌లో కూడా ఎక్కారు. ఆయన కూడా నేనే గొప్పోణ్ణి అని ఏనాడూ చెప్పలేదు. కీరవాణికి కాబట్టి ఇలా మాట్లాడడం సరిపోయిందేమో.
-ఎండి లతీఫ్, నాచారం