మీ వ్యూస్

ఒక్కోసారంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా బిజీ అవుతన్న టైంలో -చిత్రమైన చెత్త కథను చేసి అవసరాల అనవసరంగా ఖాళీ అయిపోయాడు. కొన్ని సినిమాలు వ్యక్తిగత ఇమేజ్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయనడానికి ‘బాబు బాగా బిజీ’ని ప్రస్తావించుకోవచ్చు. మన తెలుగు నేటివిటీకి ఏమాత్రం సూట్‌కాని కథలో -తన అప్పీరెన్స్‌కు అస్సలు అతకని ‘మాధవ్’ పాత్ర చేసి అవసరాల మాచెడ్డ ఇబ్బంది పెట్టాడు. దర్శకుడిగా సున్నితమైన కథలను, నటుడిగా మెచ్చదగిన పాత్రలు చేసిన అవసరాల -ఈ చిత్రంతో కష్టపడి సంపాదించుకున్న క్రేజ్‌ను కోల్పోయాడనే చెప్పాలి. సున్నితమైన, సృజనాత్మకమైన ఆలోచనలు కలిగిన వాళ్లు సైతం -అప్పుడప్పుడూ అతి చేసి పప్పులో కాలేస్తుంటారనడాకి ‘బాబు బాగా బిజీ’లో అవసరాలను ప్రస్తావించుకోవచ్చు. అనవసర సన్నివేశాల్లో ఇరుక్కుని అవసరాల కచ్చితంగా ఖాళీ అయిపోయాడు.
-యామి, పార్వతీపురం
ఒక్కరోజు రాజు
వెనె్నలలో ప్రచురించిన ఏక్‌దిన్‌కా సుల్తాన్ వ్యాసం ఆసాంతం యదార్ధం. చదువుతుంటే ఆలోచింపచేస్తుంది. నేటి హీరోలకు అక్షరాలు రావు, నటనా తెలియదు. కళలపట్ల ఆసక్తి ఉండదు. శిక్షణ ఉండదు. సినీ బంధుప్రీతితో హీరోలైపోతున్నారు. సాంకేతిక నైపుణ్యం రూపంతో హీరోలుగా అవతరించి పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతున్నారు. దర్శకులు కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కొత్త హీరోలను డబ్బుకోసం పరిచయం చేస్తున్నారు. వీరు పరిచయం చేసిన నూతన కథానాయకులు అభివృద్ధి చెందుతారు అంటారు కానీ అసలు వారు నటులే కాదుకదా! మంచి ప్రతిభ కలవారిని పరిచయం చేస్తే వారు జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అందుకే ప్రతిభావంతులైన నటులను దర్శకులు వేటాడాలి. అది లేనందువల్లే తెలుగు చిత్రాల్లో క్వాలిటీ అంతరించిపోయింది. క్వాంటిటీ పెరిగింది.
-మాధవరపు కృష్ణ, కాకినాడ
అభినందనలు
తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో సరికొత్త రికార్డు సృష్టించింది బాహుబలి. ఫోటోగ్రఫీ అద్భుతం. ఎంతో కష్టపడి మంచి చిత్రం అందించారు. ప్రభాస్ తన అభిమానులకు ఆనందం కలిగించాడు. రెండోభాగంలో దేవసేన పాత్ర సినిమాకు జీవం పోసింది. సినిమా మొత్తం అద్భుత కావ్యంగా రూపొందించారు. సినిమా యూనిట్‌కు అభినందనలు.
-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
ఇదేం వల్గర్?
కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ దేశవ్యాప్త గౌరవం తెచ్చారు. తెలుగు వెర్షన్‌కి నాగార్జున ఆ స్థాయిలో కాకపోయినా బాగానే ప్రాచుర్యం తెచ్చాడు. ఇప్పుడు చిరంజీవి దాన్ని మాస్, ఊర మాస్ స్థాయికి దిగజార్చాడు. వారానికొక సెలబ్రిటీని తీసుకొచ్చినా కిందపడ్డ కోటీశ్వరుడు పైకి లేవలేకపోతున్నాడు. ఈ మధ్య సెలబ్రిటీగా రోజా వస్తే చిరంజీవి లెటస్ డూ కుమ్ముడు అంటూ మొదలుపెట్టాడు. రోజా తన ఛాతిని పైకి కిందికి రెండుసార్లు ఊపి ఒకవేలుపైకెత్తి రమ్మన్నట్టు సైగ చేసింది. ఇదేం పాడుబుద్ధి. ఎంతో ప్రఖ్యాతి చెందిన కార్యక్రమాన్ని వల్గర్ చేసి పారేసాడు చిరంజీవి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ రోజానే దుమ్మెత్తిపోసిన సంగతి ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు!
-టి.శాండిల్య, కాకినాడ
క్రిష్ గొప్ప!
ప్రతి ఛానల్‌లో ఓ అరగంటో, గంటో సినిమా కార్యక్రమాలు ప్రసారం చే స్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్ధంపర్ధంలేని వాగుడుకి అదుపు లేకుండా పోతుంది. బాహుబలి వల్ల ఆంధ్రుల ఖ్యాతి పెరిగిన మాట నిజమే. కానీ ఆ చిత్రంవల్ల బాలీవుడ్‌లో ఆంధ్రులని నెత్తిన పెట్టుకుంటున్నారనడం అబద్ధం. బాహుబలివల్లే అనుష్కశర్మ తాను నిర్మించే చిత్రానికి క్రిష్‌ని దర్శకుడిగా, విజయేంద్రప్రసాద్‌ను కథకుడుగా తీసుకుందనడం నిజం కాదు. శాతకర్ణిని అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ సమయంలో రూపొందించిన క్రిష్‌ను తీసుకున్నారు కానీ, బాహుబలితో ఆయనకు సంబంధం లేదు. ఇది క్రిష్ ఘనత తప్ప రాజవౌళికి సంబంధం లేదు.
-సి.మైథిలి, సర్పవరం
గెలిపించింది
బాహుబలి అద్భుతవిజయాన్ని మూటగట్టుకుని నిర్మాతల ధనాగారాన్ని బలోపేతం చేసింది. ఇందులోని కథ తాలూకు మూలాలు గతంలో అనేక జానపద సినిమాల్లో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అయితే బాహుబలి కథను నడిపించడంలో దర్శకుడి ప్రతిభ, ఇంద్ర మహేంద్ర జాలంలాంటి గ్రాఫిక్స్, వినూత్న యద్ధ సన్నివేశాలు, ఎనిమిదివేల పైన థియేటర్లలో అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడం, అదేదో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న చిదంబర రహస్యంపై హైప్ సృష్టించడం మొదలైన కారణాలవల్ల ప్రేక్షకులు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. బాహుబలికి కొన్ని క్రాఫ్ట్‌లలో ఆస్కార్ అవార్డులు వరిస్తాయేమో!
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
నిజమే..డబ్బు చేసింది!
వెనె్నలలో బాహుబలికి డబ్బు చేసింది అన్న వ్యాసం బాగుంది. నిజం నిష్టూరంగా వుంటుందన్న నానుడిని అనుసరించి రాజవౌళి ఎలా స్వీకరిస్తాడో చూడాలి. ఈ వ్యాసంలో నాకు నచ్చని విషయం మాయాబజార్‌తో ప్రస్తావన.మాయాబజార్‌తో సాటి రాదగిన సినిమా ఇంతకుముందూ రాలేదు, ఆ తరువాత రాదు. ఇక ముందు రాబోదు. కారణం ఆ సినిమాకు తెరవెనుక, తెరపైన పనిచేసిన వారు మళ్లీ రారు.
-డి.ఎస్.శంకర్, వక్కలంక
వారు స్టార్లు!
తమిళనాట ప్రేమగా అణ్ణా అని పిలువబడే ఎంజీఆర్, కర్నాటకలో గౌరవంగా కన్నడ కంఠీరవ అని పిలుచుకునే రాజ్‌కుమార్- ఇద్దరూ ఒకలాంటివారే. ఇద్దరూ సిగరెట్ కాల్చరు. మగువ, మద్యం జోలికి పోరు. పరుషంగా మాట్లాడరు. బూతులు కూయరు. నిజ జీవితంలో వారు ఎలా వుంటారో వారు ధరించే పాత్రలు కూడా అలాగే ఉండేవి. సామాజిక స్పృహ అంటే అది! మడి కట్టుకుకూర్చుంటే మనల్ని ఎవరు చూస్తారు అని కుంటిసాకులు చెబుతారు మన హీరోలు. కానీ వాళ్ల ఖాతాలోనూ ఘనవిజయాలున్నాయి. సామాజిక స్పృహలో మన సూపర్‌స్టార్‌లు, మెగాస్టార్‌లు వారిముందు దిగదుడుపే!
-కె.ఎల్.ప్రసూన, పేర్రాజుపేట