మీ వ్యూస్

మంచి ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి రారా సినిమాతో విభిన్నమైన ఇమేజ్‌ను తెచ్చుకున్న సుధీర్‌వర్మ, తాజాగా ‘కేశవ’ అంటూ వచ్చాడు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్లు కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా సీరియల్ హత్యలు చేసే పాత్రలో నిఖిల్ బాగా నటించాడు. రీతూవర్మ, ఇషాకొప్పీకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కథ చిన్నదే అయినా సస్పెన్స్ వీడకుండా, బిగి సడలకుండా వేగంగా సాగడంతో ప్రేక్షకులకు విసుగు కలగలేదు. తరువాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తితో చూశారు. జరిగే హత్యలు విభిన్నంగా జరగడంవల్ల కూడా ఎక్కడా బోర్ ఉండదు. ఈ సినిమాలోని స్టైలిష్ మేకింగ్ నిస్సందేహంగా ఓ మంచి ప్రయత్నం.
-సి ప్రతాప్, శ్రీకాకుళం
చెత్తవాగుడు
చలపతిరావు చెత్తవాగుడుకి మహిళా సంఘాలు కేసు పెట్టి సరైన సమాధానమిచ్చాయి. మరో పెద్ద సినిమా హీరో తన 150వ సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ ఆంబోతులా వెంటబడితే, ఈ మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? అది చాలదన్నట్టు కౌన్ బనేగాలో రోజాను పిలిచి అమ్మడూ అంటే, ఆమె కూడా ఛాతీ ఎగరేసుకుని స్టేజీ ఎక్కినప్పుడు ఈ మహిళా సంఘాలు ఏం చేశాయి? చలపతికి ఒక రూలు, పెద్దమనిషికి మరో రూలా? అలాగే అలీ కూడా పిలవగానే ఊపుకుంటూ వస్తారని అమ్మాయిలను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. కనుక ఈ కామపైత్యం ఉన్నవాళ్లను, వాళ్ల సినిమాలను, వాళ్ల కార్యక్రమాలను ప్రేక్షకులు నిషేధించాలి. ముఖ్యంగా స్ర్తిలు వీళ్ల ముఖం చూడటం మానేయాలి.
-శిష్ట్లా లక్ష్మీనరసింహమూర్తి
ఆశ్చర్యం
ప్రపంచమంతటా సంచలనం సృష్టిస్తున్న బాహుబలిపై మా అభిమాన వెనె్నల పేజీలో విమర్శలతో కూడిన వ్యాసాలు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు సినిమా స్టామినా బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లో కూడా కుదిపివేసింది. కలెక్షన్ల రికార్డులు ప్రక్కన పెడితే ఆ సినిమాని ఒక యజ్ఞంలాగా భావించి రూపొందించారు. అన్ని వేలమందితో ఎక్కడా వివాదం లేకుండా క్రమశిక్షణతో రూపొందించినందుకు ప్రశంసించాల్సిందే!
-వేదుల శ్రీదత్త, నిడదవోలు
నిద్రపోవచ్చు
కొన్ని తెలుగు చానల్స్‌లో సినిమా విభాగం నిర్వహించే విధానం వారికి ఆ విభాగంపై ఎలాంటి పట్టూ లేదనిపిస్తోంది. బాహుబలి విజయం చూసి బాలీవుడ్ హీరోలకు నిద్రపట్టడంలేదని ఓ చానెల్ వ్యాఖ్యానించింది. బాలీవుడ్ అనగానే ఖాన్ త్రయం గుర్తుకొస్తుంది. హిట్, ఫట్‌లకు అతీతంగా దశాబ్దాలుగా వారు పదిలంగా ఉన్నారు. ప్రభాస్ వాళ్లకు పోటీనే కాదు. బాహుబలి అనగానే గ్రాఫిక్స్ జిగేల్ మంటాయి. కానీ నటన, కథ, పాటలు కావు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లే ఖాన్‌లను కదల్చలేకపోయారు. దశావతారం, రోబో చిత్రాలు హిట్ అయినా అవి డబ్బింగ్ చిత్రాల కిందే లెక్క. ఖాన్‌లను నేరుగా హిందీలోనే ఢీకొనాలి. డబ్బింగ్‌లతో కుదరదు. అందువల్ల ఖాన్‌లు హాయిగా నిద్రపోవచ్చు.
-ఆర్ సత్య, కరప
లోపం
బాహుబలి చిత్రంలో ఓ కల్లు దుకాణం యజమాని (దర్శకుడు) కల్లు కొరకు వచ్చిన వ్యక్తితో డబ్బు ఉందా? అని అడుగుతాడు. కానీ ఆ కాలంలో మొహిరీలు, ధనం, వెండి నాణేలు చలామణి అయ్యేవి. ఆ రోజుల్లో అలా డబ్బు ఉందా? అని అడగడం ఓ లోపమే!
-కెవి ప్రసాదరావు, కందుకూరు
హతవిధీ
మే నెలాఖరుకు మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి సీజన్ ముగియనుంది. నవంబర్‌లో రెండో సీజన్ ప్రారంభం కావాలి. కానీ ఆ సూచనలు కానరావు. చిరంజీవి ఉయ్యాలవాడ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాని షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కోటీశ్వరుడు నిర్మాతలు కూడా రెండో సీజన్‌కు తొందరపడటం లేదు. ఎందుకంటే, ఫీడ్‌బాక్ ద్వారా ప్రేక్షకులు నాగార్జున స్థాయిలో చిరు వ్యవహారం లేదని తేల్చేశారు. సీజన్-1కి లాభాలు సంతృప్తికరంగా లేవు. అందువల్ల ఓ ఏడాదిపాటు కోటీశ్వరుడు బజ్జుంటాడని విమర్శకుల అంచనా. హతవిధీ.. కోటీశ్వరుడికి ఎన్ని కష్టాలో!
-ఎ చైతన్యకృష్ణ,
వాకలపూడి
కళ వ్యాపారం కూడా!
కిరాణా కొట్టువాడు మంచి సరుకే అమ్మాలి. మురిగిపోయిన వాటిని కూడా అమ్మేస్తుంటాడు. అలాగే, సినిమా ఎంత కళ అయినా పెట్టుబడితోపాటు మరింత లాభం రావాలనుకోవడం, ఆ విధంగా వ్యాపార కళను పెంచుకోవడం సహజం. కళాత్మకంగా నిర్మించిన సినిమాలు అపజయాలు చవిచూశాయి. అన్ని మాయాబజారు, శంకరాభరణాలు కాలేవు, కావు కూడా. కొన్ని సంస్థలు ఎంత వ్యాపార ధోరణితో సినిమాలు నిర్మించినా అవి కళాత్మకంగా సుస్థిర స్థానాన్ని పొందాయి. విజయ, అన్నపూర్ణ, ఎన్‌ఎటి, సురేష్‌లాంటి సంస్థలు తీసిన చిత్రాలు చరిత్రలో శాశ్వత కీర్తిని పొందాయి. ఇప్పుడొచ్చేవాటిలో చాలాభాగం సృజనాత్మకతలోగాని, సమాజ విలువలకుగానీ, సంగీత సాహిత్యాలలో కానీ ఎక్కడా కాగడా వేసిన కానరావు. అవి ఎప్పుడొచ్చి వెళ్లిపోతున్నాయో కూడా తెలియదు. మరోసారి చూడాలనుకున్నదే మంచి సినిమా.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికింద్రాబాద్

అలనాటి సంగతి
సెన్సార్ వారి సెన్సు
రాముడు-్భముడు (1963) సినిమా పాటలో నాయిక రమ్మనకు, పగలే నను రమ్మనకు అని పాడుతుంది. అప్పటి సెన్సార్‌వారు పగలే రమ్మనకు అంటే రాత్రికి రమ్మని అర్థమా అంటూ, ఆ వాక్యం తొలగించాల్సిందేనన్నారు. దాని స్థానంలో నను రమ్మనకు అని మార్చారు. అప్పటి సెన్సార్ అలా ఉండేది. ఇప్పటి సెన్సార్ అయితే ఇలాంటివేమీ పట్టించుకునే పరిస్థితి లేదు. పెద్దమనుషులు (1954) చిత్రంలో శివశివ మూర్తివి గణనాథా అన్న పాటలో కాంగ్రేసోళ్లు నిన్ను కొల్వ అని కమ్యూనిస్టులు నిన్ను గొల్వ అని రెండు చరణాలుంటాయి. దూరదర్శన్‌లో ఈ సినిమా ప్రసారమైనప్పుడు వాటిని కత్తిరించారు. దీనే్నమనాలి?
- డి.ఎస్.శంకర్, వక్కలంక