మీ వ్యూస్

బహుదూరపు బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడిగా, నటుడిగా, కథకుడిగా, మాటలు పాటల రచయితగా సినిమా పరిశ్రమకే కాదు, పత్రికాధిపతిగా, కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరంటే అభిమానులందరికీ బాధాకరమైన విషయం.
నటుడిగా పరిశ్రమకు వచ్చినా, తాతామనవడు చిత్రంతో దర్శకుడైన దాసరి, మానవ సంబంధాలు, అనుబంధాలను దర్శకుడిగా స్పృశించారు. దాసరి అంటే ఒక్క మార్కు అని నిరూపించారు. హాస్యనటులకు చిత్రంలో పాట పెట్టడం అనేది దాసరితో ప్రారంభమైంది. ఎన్టీఆర్ హీరోగా ‘మనుషులంతా ఒక్కటే’లో అల్లు రామలింగ్య, రమాప్రభలతో ‘ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా’, శివరంజనిలో కె.వి.చలంపైన ‘మీ అమ్మవాడు నాకోసం కని ఉంటాడు’ పాటలు జనరంజకం పొందాయి.
-జి.గౌరీగాయత్రి, ఉప్పల్
దాసరి కథలు
స్టార్లకన్నా కథకే విలువనిచ్చి కొత్తవారితోనూ క్రొంగొత్త రీతిలో వాస్తవాచక్కని చిత్రాలు అందించిన దాసరి ధన్యజీవి. చిక్కని సంభాషణలను రాసి, రాయించి ఒక వినూత్న ఒరవడిని వడిసి పట్టుకున్న దర్శకుడు. చిన్నా చితకా నటుల దగ్గరనుంచి అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లను తన పంథాలో తీర్చిదిద్ది వారిని మరింత తారాపథానికి తీసుకెళ్ళాడు. ఈ ఇద్దరి మహానటులకు అత్యంత సన్నిహితుడే అయినా చివరిదశలో ఏఎన్నార్‌తో ఏ కారణంవల్లనో స్వల్ప విభేదాలు వచ్చాయని విన్నాం. కానీ బయటపడలేదు. ఎంతోమంది నటులను తయారుచేసిన దాసరి తన కుమారులను ప్రయత్నం చేసినా నటులుగా చేయలేకపోయారు. 151 సినిమాలకు దర్శకత్వం నెరిపి ప్రపంచ రికార్డు నెలకొల్పి తారాపథంలో ధృవతారగా సినీ చరిత్రలో నిలిచిపోయాడు. వెనె్నల కథనం ఆకట్టుకుంది.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికింద్రాబాద్
కమామీషు బావుంది
ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతు తేల్చేయాలన్న కసితో మోహనకృష్ణ ఇంద్రగంటి తీసిన సినిమా -అమీ తుమీ. ఆ ఉద్దేశంతోనే టైటిల్ పెట్టాడేమో అనిపిస్తుంది. అష్టా చమ్మా చిత్రం నుంచి తన మార్క్ చూపిస్తూ వచ్చని మోహనకృష్ణ, ఈ సినిమాలోనూ వైవిధ్యమైన పాయంట్‌తో కథ నడిపిన తీరు బావుంది. వెనె్నల కిషోర్, అవసరాల తప్ప మిగితా ఆర్టిస్టుల విషయంలో పొరబాటు చేశారేమో అనిపించింది. అమీ తుమీ కథకు సరిపోయే టైమింగ్‌వున్న ఆర్టిస్టులను తీసుకునివుంటే మరింత రక్తికట్టించేది. ఏదేమైనా తన మార్క్ ఫన్‌తో దర్శకుడు మోహనకృష్ణ ఓ మంచి సినిమా అందించాడని అభినందించాలి.
డి. బాలమ్మ, కుతుకులూరు
ఎందుకు తీస్తారో?
కాదలి అని ఈమధ్య ఓ సినిమా వచ్చింది. లవ్ చిత్రాలకు ఎలాంటి పేర్లు పెట్టినా తెలుగు పిచ్చిమొఖాలు చూస్తారు అనుకోవడం దర్శక నిర్మాతల భ్రమ. కేవలం ముఖం బాగున్నంత మాత్రాన హీరో హీరోయిన్లను చూసి సినిమాలకు వస్తారా? అసలు కాదలి అంటే ఏంటో ముందుగా ప్రేక్షకులకు చెప్పాలి గదా! ఏదీ లేకుండా సునామీలా థియేటర్లమీద పడితే ఆ వైపుకు రావడానికి కూడా ప్రేక్షకులు భయపడతారు. ఈ చిత్రంలో ఒక్కటంటే ఒక్క పాట బాగాలేదు. కథ, కథనాలు చప్పగా ఉన్నాయి. నటీనటులలో ఒక్క వీసమెత్తు నటన కూడా లేదు. ఇక పాటలు, తదితర అంశాల గురించి చెప్పుకొనే అవసరమే లేదు. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో వారికైనా ఓ క్లారిటీ ఉంటుందా?
-టి.రఘురామ్, నరసరావుపేట

అటూ చూడాలి
నటుడు చలపతిరావు నోటి దురద వ్యాఖ్య మహిళల్ని, మగవారిని కూడా కించపరిచింది. వారి నిరసన సహజం, సమంజసం కూడా. అలా నిరసించిన వారందరూ ఒక క్షణం స్థిమితంగా తమ బిడ్డలు బయట మాట్లాడే భాష గమనిస్తే బాధ కలుగుతుంది. నేటి యువత కాంటీన్లలో, పార్కుల్లో అమ్మాయిల్ని ఏడిపించేటప్పుడు ఎలాంటి మాటలు వదులుతారో గమనించండి. అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలు కూడా ఏ సంకోచం లేకుండా అబ్బాయిల భాషే మాట్లాడుతారు. ఈ దిగజారుడుకు కారణం నేటి సినిమాలు, నేటి సమాజమే. కనీసం మన పిల్లల్ని మనం దిగజారకుండా జాగ్రత్తపడటం మంచిది.
-సుభాష్, అత్తిలి
అంత ఉలుకెందుకు?
ప్రపంచం అంతటా సంచలనం సృష్టిస్తున్న బాహుబలిని విమర్శించడం తగదు అనడం సరికాదు. మనకు గొప్ప అనిపించిన చిత్రం ఇతరులకు గొప్పగా అనిపించనక్కరలేదు. నిజానికి బాహుబలిలో గ్రాఫిక్స్‌లో ఘనంగా ఉంది గాని, కథ, సంగీతం, నటనాపరంగా చూస్తే సాధారణమే. సంచలనాలు హాలీవుడ్‌ని సైతం కుదిపేయడం వ్యాపారాత్మక ప్రచార హోరు మాత్రమే. మన దేశంలో ఈ చిత్రం వెయ్యి కోట్లు సాధించింది. గొప్ప విషయమే. కాని హాలీవుడ్‌లో 260 కోట్లు కూడా సాధించలేదు. మన భారతీయులు చూడటంవల్లనే ఆపాటి కలెక్షన్లు. అమెరికన్లు ఎక్కువగా చూసింది లేదు. ఏనాడో మన దేశంలో విడుదల అయిన ‘దంగల్’ ఇప్పుడు చైనాలో వెయ్యి కోట్లు మొత్తంగా 1700 కోట్లు సాధించి బాహుబలిని సవాల్ చేస్తోంది.
-పల్లవి, విజయవాడ
ఇదోరకం క్షోభ
ఫిలిం అవార్డు ఫంక్షన్లకు గంటన్నర కాలమే ఎక్కువ. కాని చానల్స్ చెత్త, చెదారంతో నింపి మూడు, నాలుగు గంటల కాలక్షేపంగా రూపొందించి వీక్షలను శిక్షిస్తున్నాయి. ఈమధ్య ఐఫా నాలుగు గంటల క్షోభగా మారింది. తెలుగు విభాగాన్ని రానా, నాని నిర్వహించారు. కాని వీరి ఓవర్ యాక్షన్ శ్రుతిమించి వెగుటుగా తయారైంది. అమ్మాయిలు ప్రేమించేది నీలాంటివాడినా? నాలాంటివాడినా? అంటూ కృత్రిమ జగడం ప్రారంభించి ఛీ ఛీ అనిపించారు ఇద్దరూ. మధ్యలో రానా కోపం నటించి బయటకు పోగా బ్రతిమాలి వెనక్కి తీసుకురావడం చాలా క్రితమే కుళ్లిపోయిన జిమ్మిక్! పేరు అంతర్జాతీయ ఫంక్షన్.. చేసింది లోకల్ గల్లీ చెత్త!
-సుధీర్, శ్రీనగర్