మీ వ్యూస్

హారర్‌కు హాలిడే ఇస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వచ్చే ‘ఆత్మ’ కథల పంథా మారడం లేదు. పాడుబడిన భవంతి లేదంటే కొత్త అపార్ట్‌మెంట్. అవుట్‌డోర్‌లోకి వస్తే ఓ ఫాంహౌస్ లేదంటే సిటీకి దూరంగా ఉండే అడవి. కొనే్నళ్ల క్రితం హత్యకు గురైనవాళ్లో, కొన్ని జన్మల క్రితం ఆశతీరని వాళ్లో.. ఆత్మరూపం ఎత్తడం సినిమాకు సరిపడినంత పగను కథగా అందించటం. పోస్టర్లు మారుతున్నాయ తప్ప, స్క్రీన్ మీద స్టోరీ మారడం లేదు. పోయనవారం వచ్చిన అవంతిక అందుకు మినహాయంపు కాదు. అప్పుడెప్పుడో పూర్ణ చేసిన అవును చిత్రం హిట్టవ్వడంతో, అదే తరహాలో పూర్ణను మళ్లీ చూపిస్తే వర్కవుటవుతుందన్న ఆలోచనతో తీసిన సినిమాలా అనిపించింది. చాలా హారర్ చిత్రాలు ఢమాల్ మనడం చూస్తుంటే, కొద్దికాలం హారర్‌కు హాలిడే ఇస్తే మంచిదనిపిస్తుంది.
జి ప్రభాకర్ రావు, వేళంగి
ఇప్పుడు సాహో
సినిమాల్లోని కొన్ని మాటలు భలే పేలుతాయి. చిరకాలం మనసుల్లో ఉండటమే కాక సందర్భానుసారం మాటల్ని వాడేస్తూ ఉంటాం. పాతాళభైరవి చిత్రంలో ‘గురూ’ అన్న సంబోధన వైరల్ అయి ఇప్పటికీ వాడుతున్నాం. అలాగే అమ్యాయ్యా కూడా. ఈమధ్య సాహో, ఆరడుగుల బుల్లెట్ బాగా ప్రజల్లోకి వెళ్లాయి. సాహో అనే మాటకు అర్థం తెలీకపోయినా వాడేస్తున్నాం. నిజానికి ఆరడుగుల బుల్లెట్ ఎందుకూ పనికిరాదు. ఎందుకంటే దానితో షూట్ చేయాలంటే మనం హేండిల్ చేయలేనంత, మనం మోయలేనంత బరువైన గన్ కావాలి. అందువల్ల ఆరడుగుల బుల్లెట్ మ్యూజియంలో ఉండాల్సిందే. యుద్ధంలో పనికిరాదు!
-ప్రసాద్, గొడారిగుంట
నవ్వు తెప్పించింది
ఇటీవల దువ్వాడ జగన్నాథమ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్ చూస్తుండగా అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేను తన కొడుకుకు పరిచయం చేయాలని శతవిధాలా ప్రయత్నించినప్పటకీ, అల్లు అర్జున్ కొడుకు మాత్రం ఎవ్వరు పిలిచినా పలకకుండా స్టేజీమీద జరుగుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంను చూస్తుండటం నవ్వు తెప్పించింది. దేవిశ్రీప్రసాద్ దువ్వాడకు మంచి సంగీతాన్ని అందించి ప్రెజెంట్ జనరేషన్‌లో తానే నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు.
-బానాల కృష్ణమాచారి, హైదరాబాద్
మాయమైన దిగ్గజం
సింగిరెడ్డి నారాయణరెడ్డి మరణవార్త సినీ సాహిత్యప్రియులకు పిడుగులాంటిది. 1962లో గుళేబకావళి కథ చిత్రంతో పరిచయమై 3వేల పాటలు పూర్తిచేశారు. కులగోత్రాలు, అగ్గిపిడుగు, పూజాఫలం, రాముడు భీముడు, శ్రీకృష్ణపాండవీయం, గోవుల గోపన్న, పూలరంగడు, బంగారుగాజులు -ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తన కలంతో కొత్త రంగులద్దిన సినారేను తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోదు.
-పి.ఎస్.ఆర్, కర్నూలు
మహావృక్షం కూలింది
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుగారు ఇకలేరు అనే వార్త అభిమానులుగా మాకు తీవ్ర సంతాపం కలిగించింది. 1973 తాతామనవడు చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన దాసరి, ఆ తరువాత నటరత్న ఎన్‌టిఆర్‌తో మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించాడు. అక్కినేనితో ఏడంతస్థుల మేడ, శ్రీవారిముచ్చట్లు, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, మేఘసందేశం లాంటి క్లాసిక్స్ అందించాడు. అంతేకాక శోభన్‌బాబు, కృష్ణంరాజు, మోహన్‌బాబులకు విజయవంతమైన చిత్రాలు అందించాడు. చిన్న సినిమా సినీ పరిశ్రమ అభివృద్ధికి వెనె్నముకగా భావించి చనిపోయేంతవరకు పోరాటం చేసిన ధన్యజీవి దాసరి నారాయణరావు.ఈయన లేని లోటు తీర్చలేనిది. ‘నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు’ - ఇది దాసరికి అతికినట్లుంటుంది.
-పి.ఎస్.ఆర్, కర్నూలు

సరికాదు
‘దాసరి ట్రెండ్’ లేఖలో ప్రేక్షకులు నీతిలేని సినిమాలే కోరుకుంకటున్నారు అనడం సరికాదు. ప్రేక్షకులు కోరిందే మేము ఇస్తున్నమని నిర్మాతలు, వాళ్లు నిర్మించిన చిత్రాలో గతిలేక మేము చూస్తున్నాం అని ప్రేక్షకులు అంటూ ఉంటారు. శంకరాభరణం లాంటి చిత్రం కావాలని ఎవరూ అడగలేదు. వచ్చింది, విజయం సాధించింది. ఇలాంటివే ప్రజలు కోరుతున్నారంటూ అలాంటి చిత్రాలే వరసగా వచ్చి ఢాం అన్నాయి. బహుబలి విషయంలోనూ అలాగే అవుతోంది. ప్రజలు భారీ చిత్రాలే కోరుతున్నారంటూ నాలుగైదు భారీ చిత్రాలు తీయబోతున్నారు. ఒక సినిమా హిట్ అయితే చాలు ప్రజలు ఇలాంటివే కోరుతున్నారని ముద్ర వేసేస్తున్నారు. ప్రజలలు మంచి చిత్రాలు కోరుతున్నారంతే.
-చంద్ర, మాధవనగర్
రాలిన రత్నాలు
దర్శకరత్న దాసరి, ప్రాసకి నడకలు నేర్పిన కవి దిగ్గజం సి.నారాయణరెడ్డి ఈ ఇరువురి మరణం చిత్రసీమతో బాటు కళాభిమానులకు, కళాకారులకు, సాహిత్య అభిమానులకు, చిత్రాల అభిమానులకు తీరని వేదన. రత్నాలలాంటివారు రాలిపోయారు. తెలుగు రాష్ట్రాలకు, తెలుగు భాషకి, తెలుగు చిత్రాలకు తీరని లోటు.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం
వేడుక చేసేశారు
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మ చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం విజయం సాధించి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, పల్లెటూరి అమ్మాయిలా ముగ్ధ మనోహరంగా ఉండే భ్రమరాంబ పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్ మంచి మార్కులు వేయించుకుంది. చాలాకాలానికి మంచి ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం పేరు తెచ్చుకున్నది. నాగార్జునకు నినే్న పెళ్ళాడుతా లాగా నాగచైతన్యకు రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం పేరు తెచ్చింది. ఈ చిత్రం 9 రోజులకు 35 కోట్లు కలెక్ట్ చేసి నాగచైతన్య చిత్రాలలో రికార్డు సాధించింది. శతమానంభవతి తరువాత ఈ చిత్రం ఆ స్థాయిలో ఆకట్టుకుంది.
-పి.ఎస్.ఆర్., కర్నూలు