మీ వ్యూస్

కొంచెం వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో టాలీవుడ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్ వేగానికి దువ్వాడ జగన్నాథం కాస్త బ్రేక్ వేసినట్టు అయ్యంది. వైవిథ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, మాస్ హీరోయజానికి మరింత పదును పెట్టుకుంటూ వస్తున్న బన్నీ, డిజెలో చేసిన ప్రయోగం తనవరకూ ఓకే అయనా, దర్శకుడు హరీశ్ శంకర్ వైఫల్యం బన్నీ కెరీర్‌కు బ్రేక్ వేసిందా? అనిపించింది. నిజానికి కంపారిజన్స్ చేయాల్సిన అవసరం లేకున్నా, అప్పుడెప్పుడో వచ్చిన అర్జున్ జెంటిల్‌మెన్, మొన్నటికి మొన్న వచ్చిన ఎన్టీఆర్ అదుర్స్ పాత్రల ప్రభావంతో కథ వండుకున్న ఫీలింగ్ దర్శకుడు హరీశ్ నడిపించిన కథనంలో స్పష్టంగా కనిపించింది. కలెక్షన్లను పదేపదే ప్రస్తావిస్తూ సినిమాకు ఎంత హైప్ తీసుకొచ్చినా, బన్నీ కెరీర్‌లో గొప్ప సినిమాగా డిజెను గుర్తించలేం.
సీతాకుమార్, మామిడికుదురు
ఆలోచింపచేసేదే
‘జబర్దస్త్‌గా నడిచే షోలు అవసరమా?’ వ్యాసం ఆలోచింపజేసింది. బాధ్యతాయుతంగా ఆలోచించే వాళ్లు, మధ్య వయస్కులు వ్యాసంలోని అంశాన్ని ఆమోదించొచ్చు. కాని యువత ఎక్కువగా చూసేది, ఆనందించేది అలాంటి కార్యక్రమాలే. హాస్టళ్లు, కాంటీన్లు, గార్డెన్లలో గుంపులుగా చేరే విద్యార్థుల సంభాషణల్ని వినండి. వాళ్ల భాష, చేష్టలు అవే. అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా వాళ్లతోచేరి కబుర్లు ఎంజాయ్ చేస్తూంటారు. కారణం బిడ్డలపై తల్లిదండ్రులకు అదుపు లేకపోవడం. వాళ్లు బయట ఎలా ఉంటున్నారో పెద్దలకు తెలియకపోవటం. జనరల్‌గా సమాజమే దిగజారిపోతూ ఉండడం లాంటివే కారణాలు.
-శుభ, కాకినాడ
అదే ఉత్తమం
పోటీ మొదలైంది. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం పెరుగుతోందని మనం మురిసిపోతే, తెలుగు మంత్రివల్ల వాటికి అవార్డులొస్తున్నాయని అనేవాళ్లూ ఉన్నారు. గతంలో మనమూ లాబీయింగ్ వల్లే వాళ్లకి (బాలీవుడ్) అవార్డులొస్తున్నాయి అనుకునేవాళ్లం. పక్షపాతం లేకుండా ఆలోచిస్తే బాహుబలి కేవలం కాలక్షేప చిత్రం. ఏ సామాజిక సమస్యనూ చర్చించలేదు. పరిష్కారమూ చూపలేదు. ఉత్తమ చిత్రంగా పనికిరాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఉత్తమ చిత్రం ఒకటికాదు, క్రిటిక్ చాయిస్, ప్రజాదరణ చిత్రం, సమైక్యతా చిత్రం అంటూ కోణాలున్నాయి. బాహుబలినీ ప్రత్యేకంగా ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రమని అవార్డు ప్రారంభించి ఇవ్వొచ్చు. కాని బాహుబలి ఉత్తమ చిత్రం స్థాయిలో లేదు. పెళ్లిచూపులు, శతమానంభవతి మంచి చిత్రాలే తప్ప అవీ ఉత్తమ చిత్రాలు కాదు.
-స్నేహమాధురి, పెద్దపురం
అంతరించిన పాతతరం
అలనాటి ప్రముఖ పాటల సాహితీ స్రష్టలైన సముద్రాల, మల్లాది, దేవులపల్లి, ఆత్రేయ, ఆరుద్ర, పింగళి, దాశరథి వారి సరసన చేరి కీర్తినార్జించిన సినారె -గొప్ప సినీ కవుల తానులో ఆఖరి ముక్క అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వారికన్నా మిన్నగా సినీ గీతాలు రచించారు. రుచికరమైన సంగీత బాణీలనందించే సాలూరి, పెండ్యాల, ఘంటసాల, టివి రాజు, చలపతిరావు లాంటివాళ్లు -సినారె గీతాలకు గొప్ప బాణీలు అందించి అజరామరం చేశారు. ఆ గీతాలను ఈనాటికి పెద్దవారినుంచి పిల్లల వరకూ అనేక టీవీ కార్యక్రమాల్లో చక్కగా ఆలపిస్తున్నారు. సినారె పాటలను జిక్కి, లీల, సుశీల, జానకి, ఘంటసాల, ఎస్‌పి బాలు గొప్పగా ఆలపించారు. సినీ పాటల రచయితల ఆనాటి తరంలో సినారెను చివరివాడిగా చెప్పుకోవాలి. సినారె ఎందరో పాటల రచయితలకు మార్గం చూపారు. ఈనాటి వాద్యఘోషలో చిక్కకుండా తన సాహిత్యానికి ప్రాణం పోశారు.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికింద్రాబాద్
ఆనాది అవార్డు సంబరాలు!
జాతీయ చలనచిత్ర అవార్డులు ఇండియాలో 1854 నుంచి ప్రారంభమయ్యాయి. 1954 మార్చి 21న అవార్డు ఫంక్షన్ మొదటిసారిగా బొంబాయి మెట్రో థియేటర్‌లో కొనసాగింది. ఆ అవార్డుల్లో దిలీప్‌కుమార్ ‘దాగ్’ చిత్రం, హీరోయిన్ మీనాకుమారి బైజుబావ్రా చిత్రం అవార్డులు అందుకున్నాయి. ప్రసిద్ధ హీరో, హీరోయిన్‌గా ఆనాడు వాళ్లిద్దరూ పేరుగాంచారు. అదే ఏడాది ‘దోబి ఘా జమీన్’ చిత్రానికి అవార్డు దక్కింది. ఈ అవార్డులను క్లేర్ అవార్డులు అని పిలిచేవారు. అంటే అప్పటి టైమ్స్ ఆఫ్ ఇండియా క్రిటిక్ క్లేర్ మెండొంకా అని అర్థం. ఏదేమైనా నేటి నటీనటులకు అవార్డు భుజకీర్తులు పొందినంత సంబరం. ఏది పొందినా పొందకపోయినా ఎవరి నైపుణ్యం వారి చేతల్లో ఉంటుంది కదా!
-కెవి ప్రసాదరావు, కందుకూరు
బిగ్ బాస్
బాలీవుడ్‌లో కౌన్ బనేగా కరోడ్‌పతి బుల్లితెర కార్యక్రమం అమితాబ్‌తో 8 సీజన్లు సాగి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అదే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు 4 సీజన్లు పూర్తిచేసింది. మొదటి మూడు సీజన్లు అక్కినేని నాగార్జున అత్యద్భుతంగా చేసి రికార్డు నెలకొల్పాడు. 4వ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసి ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు స్టార్ మా చానల్‌లో బిగ్‌బాస్ కార్యక్రమానికి మరో నటుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ చేశాడు. తెలుగులో జూ ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
-పిఎస్‌ఆర్, కర్నూలు
కళామతల్లి దీవెన
అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన మొట్టమొదటి చిత్రం -ఇద్దరు మిత్రులు. 1961లో అన్నపూర్ణా సంస్థ నిర్మించిన ఆ చిత్రంలో అజయ్, విజయ్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు అక్కినేని. ఆ తరువాత 1969లో వచ్చిన గోవుల గోపన్న చిత్రంలోనూ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. మరుసటి ఏడాదే 1970లో వచ్చిన సిపాయి చిన్నయ్య చిత్రం మాత్రం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. అక్కినేని సంభాషణలు, సన్నివేశ బాహ్యనటన తగిన రీతిలో లేదని విమర్శలు వచ్చాయి. అక్కినేని కంఠస్వరం పీలగా ఉందనీ వాదించారు. అలాంటి విమర్శలను అక్కినేని ఎన్నో ఎదుర్కొన్నా.. కళామతల్లి ఆశీస్సులతో చిత్రసీమలో రాణించిన ధ్రువతార అనిపించుకున్నారు అక్కినేని.
కెవి ప్రసాదరావు, కందుకూరు