మీ వ్యూస్

మరీ పేలవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగా గోపీచంద్ గ్రాఫ్ అంతంతమాత్రంగానే ఉన్న టైంలో వచ్చిన సినిమా గౌతమ్‌నంద. టైటిల్ బావుందికానీ, సినిమా తేలిపోవడంతో గోపీచంద్ కెరీర్ క్వొశ్చన్ మార్కైంది. విడుదలకు ముందు రొటీన్ పబ్లిసిటీలాగే ఆహా ఓహో అనేసినా, థియేటర్లలో బోర్ కొట్టించాడు. తన ఈడు హీరోలతో పోటీ పడలేక జిల్ తరువాత గ్యాప్ తీసుకుని సినిమా చేసినా ఫలితం లేకపోయింది. రోటీన్ కథ, పేలవైన స్క్రీన్ ప్లే, కథతో ఏమాత్రం సంబంధం లేని హీరోయిన్లుగా హన్సిక్, కేథరిన్... ఇలా ఏదో చేయబోయి ఏదేదో చేసేసినట్టుంది. రచయితగా కెరీర్ మొదలెట్టి దర్శకుడైన సంపత్ నంది -పది నిమిషాలు కూడా కూర్చోబెట్టలేని కథను పట్టుకొచ్చి జనం మీదకు రుద్దాడనిపించింది. సినిమా మొత్తంమీద భారీ బడ్జెట్‌ను ఆవిష్కరించే నిర్మాణత్మక విలువలు, సౌందర రాజన్ కెమెరా పనితనం తప్ప ‘గౌతమ్ నంద’ సామాన్య సినిమాలకు కూడా సాటిరాని చిత్రంగా మిగిలిపోయింది. పూర్ గోపీచంద్!
-రామచంద్ర, సికింద్రాబాద్
పాత చిత్రాలని కలర్ చేస్తే..
మొగల్ ఎ ఆజమ్, మాయాబజార్ నలుపు-తెలుపు చిత్రాలన్నీ రంగుల చత్రాలుగా ముద్రించి విడుదల చేసి విజయం సాధించిన గోల్ట్‌స్టోన్ సంస్థలో తెలుగు చిత్రాలలో మరపురాని పౌరాణిక నలుపు-తెలుపు చత్రాలు ముఖ్యంగా సీతారామకళ్యాణం, సంపూర్ణ రామాయణం, శ్రీకృష్ణపాండవీయం, శ్రీకృష్ణ అవతారం, శ్రీకృష్ణవిజయం, భీష్మ, పాండవ వనవాసం, నర్తనశాల, బబ్రువాహన, సారంగధర, చంద్రహారం, పాండురంగ మహత్మ్యం, పాతాళభైరవి, ప్రమలార్జున యుద్ధం, వినాయకచవితి, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ, వాల్మీకి, తాతమ్మకల, దేవదాస్, అనార్కలి, లైలామజ్ను, శ్రీకృషార్జున యుద్ధం, దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ మొదలైనవి. ఇపుడున్న భారీ టెక్నాలజీ సహాయంతో కలర్‌లో ముద్రించి విడుదల చేస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను. గోల్డ్‌స్టోన్ సంస్థ పరిశీలించమని కోరుతున్నాను.
-కె వేంకటేశ్వర్లు,
కరీంనగర్
ఏవీ ఫ్యామిలీ
సినిమాలు?
గత తరం చిత్రాల్లో ఎక్కువ కటుంబ కథా చిత్రాలే ఉండేవి. కుటుంబాల్లో తలెత్తే సమస్యలను పరిష్కారాలు చూపిస్తూ సాగేవి. అప్పటి తరం హీరోలు సైతం అలాంటి కథలవైపే ఎక్కువ మక్కువ, మొగ్గు చూపేవారు. మారిన కాలం మాస్ ఇమేజ్‌లాంటి చెత్తను తీసుకొచ్చి సినిమాను కుటుంబ కథలకు దూరం చేసేశాయి. కొంతమంది దర్శకులు కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్నా, ఆ తరహాలో వస్తున్నవి తక్కువే. మళ్లీ అలాంటి చిత్రాల ఆవశ్యకత ఇప్పుడు కనిపిస్తోంది. భార్యాభర్తల అనురాగం, అన్నాచెల్లెళ్ల ఆప్యాయతలు, తల్లిదండ్రుల పిల్లల అనుబంధాలు, ఉమ్మడి కుటుంబాల ప్రేమలు తదితర కథలతో చిత్రాలు రావాలి. నిజ జీవితంలో కుటుంబాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించేలా ఆ చిత్రాలుండాలి. పెద్ద, చిన్న హీరోలు ఇలాంటి కథలకే ప్రాధాన్యతనివ్వాలి. కథలో దమ్ముంటే ఈనాటికీ ఇవి ప్రేక్షకాదరణను పొందుతాయి. సందేహం లేదు.
-ఎస్‌ఎస్ రాజు, వనస్థలిపురం
వాటినీ రాయొచ్చుగా
విడుదలైన అన్ని సినిమాల సమీక్షలూ ‘వెనె్నల’లో రావడంలేదు. స్థలాభావం కావచ్చు. కనుక విపులంగా సమీక్షించే వాటిని సమీక్షిస్తూ, మిగిలినవాటి చిత్రం పేరు, ప్రక్కన మీరిచ్చే స్టార్ లేదా స్టార్లు వేస్తే బాగుంటుంది. చిన్నదైనా పెద్దదైనా సినిమా సినిమాయే కనుక, వాటినీ చూసేవాళ్లు ఉంటారు కనుక -ఎక్కువ స్థలం కేటాయించలేని సినిమాలను చిన్నగానైనా సమీక్షించి నాలుగు మాటలు రాస్తే పాఠకులకు మేలు చేసినట్టే. సమీక్షలు రాయని సినిమాల్లోనూ ఒకటో రెండో మణిపూసలు ఉండొచ్చు. అలాంటి సినిమాలకు సమీక్ష చదువుకుని అయినా వెళ్లి చూసే అవకాశం ఉంటుంది. ఆలోచించండి.
-డిఎస్ శంకర్, వక్కలంక
పుష్కర స్నానమంత హాయిగా..
ఫిదా సినిమా నిజంగానే ప్రేక్షకులని ఫిదా చేసింది. ఇందులోని పాత్రలు సహజంగా అనిపించాయి. ఇంతకుముందు చిత్రాల్లోకంటే హీరో వరుణ్‌తేజ్ వైవిధ్యంగానూ, సహజంగానూ కనిపించాడు. నటనలో పరిపక్వత కనిపించింది. ఇక హీరోయిన్ సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ పరిశ్రమకు ఆణిముత్యం అనుకోవాలి. తన నటన, గాత్రం, సహజమైన అందంతో పాత్రకు నూటికి రెండొందల పాళ్లు న్యాయం చేసింది. గర్భిణి అయిన అక్కకు సహాయంగా అమెరికా వెళ్లమన్నపుడు ముందు తిరస్కరించిన నాయిక, ‘మీ అమ్మ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా’ అని తండ్రి బాధపడుతున్నపుడు డైలాగ్ లేకుండా సాయిపల్లవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అత్యద్భుతం. ఈ ఒక్క సన్నివేశం చాలు, పాత్రను ఎంతగా అర్థం చేసకుని పరిపక్వత ప్రదర్శించిందో చెప్పడానికి. దిల్‌రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలాకాలం తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల మంచి సినిమా అందించాడు. పుష్కర గోదారిలో మునిగి తేలినంత హాయి అనిపించింది, ఫిదా చిత్రం చూసిన తరువాత.
-ఏపీ నాయడు, పార్వతీపురం
భక్తి బావుంది
వెనె్నలలో వచ్చిన ‘్భక్తి సరే, శ్రద్ధ ఏదీ’ అన్న కథనం ఆసాంతం చదివించింది. తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. అజరామరమైన గీతాల్ని ఆవిష్కరించిన కవికి దక్కాల్సిన గౌరవం, తెలిసీ తెలియని జ్ఞానంతో మరొకరి దక్కేలా చేయడం నేరం, నిజంగా పాపం కూడా. అతి భక్తితో కవులకు అపచారం జరుగుతోందంటూ రచయిత వివరించిన తీరులో నిజంగానే వారిపట్ల గౌరవం కనిపించింది. లోతైన విషయాన్ని సేకరించి అందించిన రచయితకు ధన్యవాదాలు. ఇకనైనా అలాంటి పొరబాట్లు జరగకుండా -ఒక విషయాన్ని ప్రస్తావించేటపుడు తెలిసిన వారినుంచి పూర్తి విషయాన్ని సేకరించి ప్రచురించటం లేదా చూపించటం మీడియా కనీస ధర్మం. లేదంటే, ఇప్పుడు రాసిందే భవిష్యత్‌లో చరిత్రగా మారి అసలు విషయం మరుగున పడే ప్రమాదం ఉంది.
ఎం ఆనందరావు, వేగివారిపాలెం