మీ వ్యూస్

ఇక.. అంతేనేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లు వెచ్చించి తీస్తున్న సినిమాలు థియేటర్ల వద్ద చతికిల పడుతున్న వైనం చూస్తుంటే బాధేస్తోంది. గత వారం మూడు పెద్ద సినిమాలు వచ్చాయ. నితిన్ లై, బెల్లంకొండ జయజానకి నాయక, రానా నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు ఎంతమందిని ఆకట్టుకున్నాయ. ఎంతమందికి సినిమా సంతృప్తిని మిగిల్చాయ. హిట్ రేంజ్‌కి చేరని సినిమాలకు కోట్ల వసూళ్ల ఎలా వస్తున్నాయ. చూస్తుంటే, తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్ నడుస్తోందేమో అనిపిస్తుంది. సినిమా విడుదలైన మరుసటి రోజే సక్సెస్ మీట్లుపెట్టి సెలబ్రేషన్ పేరిట టీవీ చానెళ్ల ముందుకొచ్చారూ అంటే, కచ్చితంగా ఆ సినిమా ఢమాల్ అందనే అర్థమవుతోంది. ఎన్నాళ్లు మాయమాటలు చెప్పి సినిమా చూపించగలం. తెలుగు సినిమా తన గమనాన్ని మార్చుకోక తప్పదు. లేదంటే ఇవే ఫలితాలు ఎప్పటికీ రిపీట్ అవుతుంటాయ.
-ఎం. కమల, తుని
సినిమాగానే చూడాలి!
ఎమర్జెన్సీ సంఘటనల నేపథ్యంగా మాధుర్ భండార్కర్ నిర్మించిన ‘ఇందు సర్కార్’ను సెన్సార్ బోర్డు వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించారు కొందరు. సినిమా విడుదలైతే ఇందిరా, సంజయ్‌లకు అవమానం జరుగుతుందన్న చర్చను లేవనెత్తారు. సినిమా విడుదలైంది, ఆడింది, వెళ్లిపోయంది. ఏమైంది? ఇందిర, సంజయ్‌లకు అవమానం జరిగిందా? ఎందుకు ఇలాంటి యాగీలను లేవనెత్తుతారు. గతంలో ఎన్టీఆర్ సిఎంగా ఉండగా ‘మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, కలియుగ విశ్వామిత్ర’ వంటి అనేక చిత్రాలు తీసినపుడు -తెలుగుతెర పురాణ పరుషుల పాత్రలకు పేరెన్నికగన్న ఎన్టీఆర్ ఏమీ అనలేదే? భండార్కర్ గతంలో తీసిన ‘చాందిని బార్, ఫ్యాషన్, ట్రాఫిక్ సిగ్నల్’ వంటి సినిమాలు వినోదంగా చూడాలనుకునేవారికి వినోదమే కన్పిస్తుంది. వంకరగా చూసేవారికి వారి బుద్ధివలే అద్దంలా కన్పిస్తుంది. భండార్కర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించటం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవటం కిందకు రాదా?
-యర్రమోతు ధర్మరాజు,
ధవళేశ్వరం
బిగ్‌బాస్ రోత
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన వక్తగా నిర్వహిస్తున్న బిగ్‌బాస్ తొలివారం బాగున్నా, తరువాతే అంత ఆసక్తి లేకుండాపోతోంది. ఆటకన్నా బిగ్‌బాస్‌ని పిలవటం ఎక్కువైంది. శని ఆదివారాలు మాత్రం అంత బాగాలేదని చెప్పాలి. విశే్లషణ ఎక్కువైంది. లోపల జరిగేవాటికి టైమ్ సరిపోవటం లేదు. బిగ్‌బాస్ పిలవటం టైమ్ వేస్ట్‌గాంది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. కొంతమంది అరుపులు ముఖ్యంగా ముమైత్‌ఖాన్ ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది. శని ఆదివారాల్లో సినిమా ప్రోగ్రాం తీసివేసి బిగ్‌బాస్‌ను నిర్వహించటంవల్ల ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. మళ్లీ మళ్లీ వివిధ చానల్స్‌లో పునఃప్రసారం చేయటం ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా కొత్త కానె్సప్ట్‌తో వచ్చిన బిగ్‌బాస్ అంతగా అలరించలేకపోయిందని చెప్పొచ్చు. రానున్న ఎపిసోడ్స్‌లోనైనా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.
-ఎ. రఘురామారావు, ఖమ్మం

ఎం లాభం?
పాత చిత్రాలను కలర్ చేస్తే మంచిదని ఒక పాఠకుని సలహా. మొగల్-ఎ-ఆజమ్, మాయాబజార్ చిత్రాలను కలర్ చేసి ఏళ్ళు గడిచినా మరో కలర్ చేసిన చిత్రం రాలేదు. ఆ ప్రయత్నాలు లేవు. ఎందుకంటే నిపుణుల కొరత, కాలహరణం, ఖర్చు. కలర్ మాయాబజార్‌కి నామమాత్రపు లాభాలే వచ్చాయి. మరో రెండు ముఖ్య సమస్యలు ఉన్నాయ. పాత చిత్రాలకు రంగులు వేసినా వాటిని చూడరు. రెండో కారణం పాత చిత్రాలను అభిమానించేవారు రంగులు ఎలా ఉన్నాయో అని ఒకసారి చూసారే తప్ప, రిపీట్ ఆడియన్స్ కారు. అందువల్ల శ్రమకు తగ్గ ఫలితం ఉండదు.
-కృష్ణ, కొండయ్యపాలెం
కరెక్టే కదా..!
డ్రగ్స్ సిట్ విచారణపై కాస్త ఘాటుగా స్పందించాడు వర్మ. కానీ, ఆ ఘాటు స్పందనలో కొంచెమైనా బాధ్యత ఉందా? అన్న భావన కలుగుతుంది. హీరో హీరోయిన్లు ఏం చేస్తే అభిమానులు అదే చేయడానికి ప్రయత్నిస్తారన్నది మామూలుగా చెప్పుకునే మాటే కాదు, చాలావరకు నిజం కూడా. తారలను ఫాలో అయ్యే ప్రమాదం ఉంటుందని కనుక, సిట్ సినిమా రంగాన్ని టార్గెట్ చేసిందనే అనుకోవాలి. ఆఫీసర్ డ్రగ్స్ తీసుకుంటే ప్రజలు పట్టించుకోరు. భావస్వేచ్ఛ అని అంగలార్చే వర్మ, పత్రికల్లో డ్రగ్స్ లీక్ వార్తలు ప్రచురించరాదనడం విడ్డూరమే. ఫేస్‌బుక్‌లో రంకెలేయకుండా, సిట్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఇతర రంగాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నవారి వివరాలు, డ్రగ్స్ వాడుతున్న విద్యార్థులు, స్కూళ్ల వివరాలు సిట్‌కి ఎందుకు చెప్పడు?
-మరుద కాళి, కరప
ఫిదానే..
ఫిదా కావాల్సిందే’ వ్యాసం బాగుంది. కాని అందులో ‘తెలంగాణ భాషను చిన్నచూపు చూడటం వల్లే స్వరాష్టమ్రై వెలసింది’ అని రాశారు. తెలంగాణ భాషనుకాని, రాయలసీమ భాషనుకాని, ఉత్తరాంధ్ర భాషనుకాని సినిమా వాళ్ళు ద్వేషంతోనో, తక్కువభావంతోనో వాడలేదు. కామెడీకోసం, వైవిధ్యం కోసం వాడారు. సినిమా అనేది వ్యాపారం. అంతే తప్ప సాటివారిమీద ఏవగింపు కాదు. తమిళాన్ని, మలయాళాన్ని, ఉర్దూని కూడా కామెడీకి వాడారు సినిమా వాళ్ళు. అంతేగాక అవిటివాడ్ని, గుడ్డివాడ్ని, నత్తివాడ్ని కూడా కామెడీకి వాడారు. ఇదంతా జనాకర్షణకోసం. సినిమా అనేది పచ్చి వ్యాపారం అవ్వడంవల్ల జరిగింది. దానివల్లే తెలంగాణ ఉద్యమం రాలేదు, రాదు కూడా! రాజకీయ నిరుద్యోగం నుంచి వచ్చింది ఉద్యమం. కళకు ప్రాంతీయ భేదాలుండవు. శృంగారం అందరినీ అలరించినట్లే హాస్యం కూడా అందరినీ అలరిస్తుంది. నెల్లూరు మాండలికాన్ని వాడితే, అక్కడ ఉద్యమాలు వచ్చేస్తున్నాయా?
-ఆర్ బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు