మీ వ్యూస్

పైసలు దండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో విజయవంతమైన పోకిరి చిత్రా న్ని అటుఇటుగా మార్చి పూరి జగన్నాథ్ బాలకృష్ణతో పైసావసూల్ అంటూ వచ్చాడు. అయితే ఆయన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టిం ది. బాలకృష్ణ తరచుగా చేసే పాత్రలకు భిన్నంగా తీర్చిదిద్దిన తేడా సింగ్ పాత్ర ఒక్కటే ఈ సినిమాలో ప్లస్‌పాయింట్. డిఫరెంట్ యాంగిల్‌లో ఆ పాత్రను డిజైన్ చేసినా నటుడి నటన, సంభాషణలు ఆకట్టుకోలేక పోయా యి. ఇక సినిమాలో కథ నిల్. తనకు తోచిన సన్నివేశాలను ఇష్టమొచ్చినట్లు తీసేసి పైసా వసూల్ సినిమాను మనకు అందించాడు దర్శకుడు పూరి. ప్రేక్షకుల టేస్టును తప్పుగా అర్థం చేసుకున్నాడాయన. భారీ డైలాగ్స్, ఫైట్, పాట, కుళ్లు కామెడీ రిపీట్ అవుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. క్లైమాక్స్‌లో దేశభక్తి డైలాగులు కావాలనే ఇరికించినట్లుంది. ముగ్గు రు హీరోయిన్లను పెట్టినా, చెవులు వాచిపోయేలా అనూప్ సంగీతం కొట్టినా గ్లామర్‌గానీ, సెంటిమెంట్‌గానీ, కామెడీగానీ పంటలేదు. సిని మా చూడడం పైసలు దండగ అనే ఫీలింగ్ కలిగింది.
-ఎం.కనకదుర్గ, తెనాలి
భక్తి లేదు
హిందీ నుంచి డబ్బింగ్ చేసిన పౌరాణికా లు తెలుగు బుల్లితెరను ముంచెత్తుతున్నాయి. పురాణాలను తెరకెక్కించడంలో ఉత్తరాదివారికి మనకు చాలా తేడాలున్నాయి. అక్కడా ఇక్కడా ఇంద్రుడు విలనే. అయితే శనిని చంపడానికి ఇంద్రుడిని దేవగురువు బృహస్పతి ప్రోత్సహించడం వింత గా వుంది. అలాగే శుక్రాచార్యుల వేషధారణ బందిపోటు దొంగలా కనిపిస్తుంది. మన దేవతల నుదుటిన అడ్డబొట్టు లేదా నిలువుబొట్టు వుంటుంది. కానీ ఉత్తరాదివారు విచిత్రమైన బొట్టు పెడుతున్నారు. పౌరాణికం కాక జానపద లేదా సాంఘిక సీరియల్స్ చూస్తున్నట్టుగా వుంది. ఎక్కడా భక్త్భివం కలగడంలేదు.
-డి.అభిలాష, సాంబమూర్తినగర్
సూచిక
వెనె్నల్లో కృష్ణ, కొండయ్యపాలెం నుంచి ఏం లాభం? శీర్షికలో మొఘల్-ఎ-ఆజమ్, మాయాబజార్ చిత్రాలను కలర్స్ చేసి ఏళ్లు గడిచినా మరో రంగుల చిత్రం రాలేదని రాసా రు. మొఘల్-ఎ-ఆజమ్ చిత్రం తర్వాత దిలీప్‌కుమార్, వైజయంతిమాల నటించిన ‘నయాదౌర్’, దేవానంద్, సాధన జంటగా వచ్చిన ‘హమ్ దోనో’ సినిమా, రాజ్‌కపూర్, నర్గీస్ నటించిన ‘చోరీ చోరీ’ చిత్రాలు కలర్‌లోకి వచ్చాయన్న సంగతి రాయలేదు.
-ఎన్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
కతలు.. కథలుగా..
వెనె్నల్లో వచ్చిన ఈ వ్యాసం మాకు నచ్చిం ది. తెలుగులో కంటే ఇంగ్లీషు, హిందీలో వచ్చి న బయోపిక్‌లు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలతో సమస్య ఏమిటంటే సినిమాకు అవసరమున్నంత సరకు, మసా లా ఏ ఒక్క వ్యక్తి జీవితంలోను వుండవు. రెండున్నర గంటల సినిమా ఆసక్తికరంగా వుండడానికి వినోదం, సంగీతం నృత్యాలు, హాస్యం జోడించాలి. అలా చేస్తే అసలు కథ పలుచబడి అసత్యాలు, కల్పనలు ఎక్కువై ముఖ్యపాత్ర దెబ్బతింటుంది. ఆసక్తికరంగా తీస్తే ఎన్ని కల్పనలున్నా చిత్రం హిట్ అవుతుందనడానికి అల్లూ రి సీతారామరాజు, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ లాంటి చిత్రాలు ఉదాహరణలు. ప్రపంచ ఖ్యాతి పొందిన గాంధీ చిత్రంలోనే బోలెడు అబద్ధాలు, కల్పనలు వున్నాయి.
-హెచ్.పవనపుత్ర, రామారావుపేట
డబ్బా కబుర్లు
ఎంతకాలం.. డబ్బా కబుర్లు అన్న వ్యాసం మాకు నచ్చింది. రెండు రోజులు కూడా ఆడని చిత్రరాజాన్ని సిగ్గులేకుండా బంపర్‌హిట్, బ్లాక్‌బ్లస్టర్ అని డబ్బా కొట్టడం వినీవినీ విసిగిపోయాం. ఇప్పటి సినిమాలను రోజుల్లో లెక్కించడం మానేసి కలెక్షన్లతో లెక్కిస్తున్నారు. మొదటిరోజు కలెక్షనే రెండు కోట్లు! దాంతో సూపర్‌డూపర్ హిట్ అనడం ఫ్యాషన్ అయింది. మరోరకం ఏమిటంటే నెట్‌లో ఫస్ట్‌లుక్‌ను గంటలోనే లక్షనుంచి కోటి మందిదాకా చూసారని డబ్బాలు మోగిస్తున్నారు. అసలు సినిమాను ఎంతమంది చూసారు, ఎన్ని షోలు వేసారు అనేది మాత్రం చెప్పరు. డిజె చిత్రం కలెక్షన్లు వచ్చిన అంకెలను అభిమానులే నమ్మలేదు. నిజమైన ఫిగర్ చెప్పమని నిర్మాతను నిలదీసారట. ఆ తర్వాత కలెక్షన్ల ఊసే వారు ఎత్తలేదు. అదీ సంగతి!
-సుధీర్, శ్రీనగర్
సామాజిక స్పృహ
దశాబ్దాల క్రితం చేతులు బొబ్బలెక్కకుం డా బట్టలు ఉతికే సబ్బు గురించి హేమమాలిని, సౌందర్యాన్చిచ్చే సబ్బు గురించి ప్రకటలిస్తే ప్రజలు నవ్వుకునేవారు. నిజంగా వీళ్లు వాడుతున్నారా?అని. ఇప్పుడు రోజులు మా రాయి. ఫెయిర్‌నెస్ క్రీమ్ రాసుకుంటే అమ్మాయిలు తెల్లబడి త్వరగా పెళ్లి జరుగుతుందని చెప్పే ప్రకటనలో నటించడానికి నటి శ్రీయ తిరస్కరించింది. ఈ ప్రకటన స్ర్తిలను కించపరిచే విధం గా వుందని అమ్మాయి తెల్లగా వుంటేగాని పెళ్లి కాదాని ఆమె ప్రశ్నించింది. అలాగే, తాప్సీ కూడా నేను వాడని ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి చెప్పనన్నది. ఇలా ఈ నటీమణుల సామాజిక స్పృహను నేర్చుకోవాల్సిందే. ప్రకటనలు చూసి మోసపోయినవారు కేసులు పెడుతున్నారు. అది కూడా భయం కావచ్చు.
-బి.సోనాలి, సూర్యారావుపేట