మీ వ్యూస్

చక్కని కానె్సప్ట్‌తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురు సినిమాను ఎలాం టి కమర్షియల్ విలువలు లేకుండా రొటీన్‌కు భిన్నం గా చక్కని కానె్సప్ట్‌తో తయారుచేశారు. గురు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయారు. తనకున్న ఇమేజ్‌ని గురించి ఆలోచించడు ఈ ఒకే ఒక్క నటుడు వెంకటేశ్. శిష్యురాలిగా నటించిన రితికాసింగ్ చక్కని నటన ప్రదర్శించారు. తొలుత అల్లరి పిల్లగా, ఆ తర్వాత బాక్సింగ్ క్రీడాకారిణిగా చివరకు గురువుకు తగ్గ శిష్యురాలిగా నటించి మెప్పించారు. ఆమె ఆహార్యం, హావభావాలు పాత్రకు తగినట్లు సరిపోయాయి. సీనియర్ నటుడు వెంకటేష్‌తో పోటీ పడి నటించారు. దర్శకురాలు సుధ కొంగర ఆమెలోని నటనను బయటకు తీయడంలో పూర్తిగా సఫలీకృతమయ్యారు. వెంకటేష్, రితికాసింగ్ మధ్యన సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాలుగు నెలల నెలల క్రితం విడుదలైన ‘దంగల్ సినిమాకు, ఈ సినిమాకు నేపథ్యపరంగా చూసినట్లయితే చాలా పోలికలున్నాయి. అందులో తమ కూతుళ్ళను ఇద్దరిని తండ్రి కుస్తీలో శిక్షణ ఇస్తే, ఈ సినిమాలో బాక్సింగ్ క్రీడలో ఒకమ్మాయిని రాటుతేలేలా శిక్షణనిస్తాడు. తక్కువ నిడివిగల సినిమాయే అయినా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు మరిన్ని రావాలి.

-జి.అశోక్, గోధూర్