మీకు మీరే డాక్టర్

కఢుపు నొప్పికి కారణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: తరచూ కడుపులో నొప్పి వస్తోంది. ఇందుకు కారణాలు వివరిస్తారా?
-సామ్రాజ్యలక్ష్మి జె. (ఒంగోలు)

జ: వ్యాధులు రెండు రకాలు. వచ్చేవి, తెచ్చుకునేవి! తెచ్చుకునే వాటి గురించి హెచ్చరించకపోతే, వాటిని తెచ్చుకునే మన అలవాట్లను మానుకోకపోతే ఆసుపత్రులు మన శరణాలయాలుగా మారిపోతాయి. ఏదైనా మన చేతిలోనే ఉంది.
కడుపులో నొప్పిగా ఉంది, బడికి వెళ్లనని మారాం చేస్తాడు పిల్లవాడు. అయ్యో నాయనా! నీకు ఇవ్వాళే కడుపునొప్పి రావాలా..? నీకు ఇష్టమని గారెలు వండానే..! అంటుంది తల్లి. వెంటనే ఆ పిల్లవాడు ‘అమ్మా! ఆకలే!’ అని పాట ఎత్తుకుంటాడు. చాలా కడుపు నొప్పిలు ఇలాంటివే! వచ్చేవి తక్కువ! తెచ్చుకునేవి ఎక్కువ!!
శూలం గుచ్చుకున్నంతగా బాధ కలుగుతుంది కాబట్టి నొప్పిని శూల (డఔ్ఘఒ్యౄజూజష ఔ్ఘజశ) అంటారు. అది పేగుల్లో రావచ్చు. లివర్, స్ప్లీను, గర్భాశయం, మూత్రపిండాలు మొదలైన అవయవాలలో కూడా కలగవచ్చు. గుండెలో కూడా ఏర్పడవచ్చు. గుండెనొప్పిని ‘హృచ్ఛూల’ అనీ, మూత్రపిండాల నొప్పిని ‘వృక్కశూల’ అనీ ఇలా ఆయా అవయవాల పేర్లతో ‘శూల’ని పిలుస్తారు. పేగులలో కలిగే ఆంత్రికశూల (ష్యజష) అంటారు. ఈ అవయవాలలో దేని కారణంగా శూల ఏర్పడినా, కడుపు నొప్పి (ఉదరశూల) అనే వ్యవహరిస్తుంటాం.
కడుపు లోపల ఉండే అవయవాలతో సంబంధం లేకుండా, కేవలం పొట్ట కండరాలలో కూడా ఉదరశూల కలగవచ్చు. కండరాలలో కలిగే వాత వ్యాధి అది. ఎపెండిసైటిస్ అనే ఇరవై నాలుగ్గంటల కడుపునొప్పి, మూత్రపిండాలు, ఇతర పొట్ట లోపల అవయవాలలో చీము దోషాలు (ఇన్‌ఫెక్షన్స్) ఏర్పడటాల వంటి కారణాలు. ఇవి వచ్చే వ్యాధులు! తక్కినవన్నీ తెచ్చుకున్న వ్యాధులే! వైద్యచింతామణి అనే వైద్య గ్రంథం ‘శుచి, శుభ్రత లేని ఆహారం వలన కడుపు నొప్పి, అజీర్తి వస్తాయ’ని చెప్పింది.
ఎండు చేపలు, ఎండు మాంసం, ఎండు రొట్టెలు, నెయ్యి నూనె అసలు తగలకుండా వండిన వంటకాలు.. ఇలాంటివి ఒళ్లు తగ్గించుకోవాలనుకునేవారు ఎక్కువగా తింటారు. అలా తినటం వలన కడుపునొప్పే కాదు, అనేక వాత వ్యాధులు కూడా వస్తాయి. మంచి చేసే వాటిని కొంచెం ఎక్కువగా, చెడు చేసే వాటిని బాగా తక్కువగా తినటం ఒక పద్ధతిగా పెట్టుకోవాలి. నూనెని పోసుకొని తినటం ఎంత తప్పో నూనె లేకుండా శుష్క పదార్థాల్ని అమితంగా తినటం కూడా అంతే తప్పు. అమితమైన పులుపు, మసాలాలు, అల్లం వెల్లుల్లి మిశ్రమాలు ఒక పరిమితి లేకుండా వాడే వారికి కడుపు నొప్పి పిలవకపోయినా పలుకుతుంది.
టీవీ తెరకు అంటుకుపోయి అర్ధరాత్రి అపరాత్రి కూడా గడపటం, అతి జాగరణాలు, నిద్ర తక్కువగా పోతే ఒళ్లు తగ్గుతుందనే అప నమ్మకంతో కావాలని మేల్కొని ఉండటం లాంటివి ఉదరశూలకు కారణమయ్యే పనులే! అకాల భోజనం, అతి భోజనం, అరకొర భోజనం, అభోజనం మన జీవన వ్యవస్థలో ఇలాంటి తప్పులే కడుపునొప్పికి కారణాలు.
శక్తికి మించిన శరీర శ్రమ చేయటం తప్పని జీవితాలు కొన్ని ఉంటాయి. అతి శ్రమ ఉదరశూలకు దారి తీస్తుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, నిద్రాహారాలు చాలినంత లేకుండా పనిచేస్తే ఉదరశూల వస్తుంది.
వందేళ్ల క్రితం వరకూ హిమాలయాలకు వెళ్లి చూసిన వారికి తప్ప మంచు ఎలా ఉంటుందో మామూలు జనాలకు తెలీదు. ఇవ్వాళ రిఫ్రిజిరేటర్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయ్యింది. కూరగాయలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండితో పాటు పచారీ సరుకులు నిల్వ బెట్టుకునేందుకు ప్రతి ఇంట్లో ఫ్రిజ్‌ను తప్పనిసరిగా వాడుతున్నారు. మంచునీళ్లు (ఐస్ వాటర్) తాగటం సరే.. పెరుగు లేదా మజ్జిగ కూడా అతి చల్లనివే తీసుకొంటున్నాం. అతిగా చల్లదనాన్ని కడుపులోకి నెట్టటం వలన, చల్లని నీటిని సీసా ఎత్తి గడగడా తాగే అలవాటు వలన జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది.
శనగలు తెలుగువారికి మొదటి నుండీ శుభ సూచకమైనవి. తెలుగు మహిళలు శనగలు వాయినం ఇచ్చుకోవటం తరతరాల ఆచారం మనకి. శనగలను సాతాళించుకొని తినటం ఒక అలవాటు. పూర్వపు రోజుల్లో ఘనమైన జీర్ణశక్తి, తగినంత శరీర శ్రమా ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో అలాంటి కఠిన ద్రవ్యాలు తిన్నా ఏమీ అయ్యేది కాదు. అమెరికా వాడు ఏ దుర్ముహూర్తంలోనో గుండ్రటి బఠాణీ శనగలు తెచ్చి భారతదేశానికి అంటగట్టాడు. ఫలితంగా శనగపిండి స్థానంలో ఈ బఠాణి పిండి చేరి అదే శనగపిండిగా చెలామణి అవుతోంది. పురుషుల్లో లైంగిక శక్తిని తగ్గిస్తాయని అమెరికన్లు పొరపాటున కూడా ఈ బఠాణీ శనగల్ని తినరు. అందుకని వాటిని అమితంగా పండించి, మనలాంటి దేశాలకు ఎగుమతి చేస్తూంటారు. అమెరికా మోజులో ఉన్న మనం వాటిని దైవదత్త ప్రసాదంగా స్వీకరిస్తుంటాం. జేబులో డబ్బు వాడికీ, కడుపులో నొప్పి మనకీ దక్కుతున్నాయి.
మన పూర్వులు బూందీ, పకోడీలూ ఇతర తినుబండారాలూ అన్నీ తిన్నారు. కానీ, వాటిని ఇప్పటిలాగా శనగపిండితో వండుకోలేదు. బియ్యప్పిండి, రాగిపిండి, జొన్నపిండి, గోధుమ పిండితో చేసుకునేవారు. సజ్జప్పాలు అంటే తీపి కలిపిన సజ్జ పిండితో చేసిన అప్పచ్చులు, దాన్ని మనం మైదాపిండి, బొంబాయి రవ్వతో ఇప్పుడు వండుకుంటున్నాం.
తీవ్రమైన విరహంలో పడి, అతిగా నిగ్రహించుకోవడానికి ప్రయత్నించడం వలన కడుపు నొప్పి వస్తుంది. ఇదేమిటండీ.. ఒక తప్పు చేయాలనే ప్రేరణ వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించుకోవటం వ్యాధి ఎలా అవుతుందీ.. అని సందేహం కలగవచ్చు. ఏ మనిషికైనా ఎలాంటి ఆలోచనైనా రావచ్చు. ఆలోచనలు నిరంతర ప్రవాహం కాబట్టి వాటి దారిన అవి వస్తాయి. కానీ, వాటిని అక్కడే తుంచేయకుండా ఆ ఆలోచనలో జీవించటం వ్యాధి అవుతుంది. ‘వాణ్ణి చంపేసేయాలి అన్నంత కోపం ఎవరిమీదైనా రావచ్చు. కానీ, అది మనబోటి వారికి సాధ్యంకాని పని. కాబట్టి, అక్కడితోనే ఆ ఆలోచన ముగిసిపోతుంది. పోవాలి కూడా! కానీ, ఆ వ్యక్తి పొద్దస్తమానం అదే ఆలోచనలో ఉంటే అది కచ్చితంగా కడుపునొప్పికి దారితీస్తుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com