మీకు మీరే డాక్టర్

పోషకాలు నిండిన వంటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: ప్రతీ రోజూ అన్నంలో చారు తినవచ్చునా? ఎలా కాచుకుంటే మంచిదో వివరంగా చెప్పండి.
-జి.పద్మావతి (నెల్లూరు)

జ: చారు అంటే సారవంతమైనది అని! రసం అనే సంస్కృత పదం జన వ్యవహారంలో చారుగా మారింది. రసం అనే మాట ఎస్సెన్స్ అనే అర్థంలో ‘సారం’ అనే సంస్కృత పదానికి మరో రూపం. తెలుగు వాళ్లు చింతపండు సారాన్ని చారు (రసం)గా తాగుతూ, చారు అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు.
తమిళుల ‘రసం’, కన్నడం వారి ‘సారు’, తెలుగు వారి ‘చారు’ ఇవి మూడూ ఒకే వంటకానికి పేర్లయినా, వండటంలో తేడా ఉంది. తమిళుల రసానికి ‘చింతపండు రసం’ అని అర్థం. కన్నడం వారి ‘సారు’లో పప్పు్ధన్యాలు, కొబ్బరి, కొండొకచో మాంసం లేదా మాంసరసం కలిసి ఉంటాయి. తెలుగు వారు చారు పొడికి ప్రాధాన్యత నిస్తారు. ఈ చారు పొడిలో ప్రధానంగా మిరియాలు, జీలకర్ర లాంటి జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలుంటాయి. వాటితో పాటుగా వివిధ కూరగాయల ముక్కలు; కందిపప్పు, పెసరపప్పు, ఉలవల వంటి పప్పు ధాన్యాలు; ధనియాలు, జీలకర్ర, మిరియాల వంటి సంబారాల సారం ఉంటుంది.
తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ‘యొర్రచేరులు’ గురించి ప్రస్తావించాడు. ఒర్రగా అంటే మిరియాల, ఘాటు కలిగిన వేడిచారు అని! భుక్తాయాసం కలగకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
ఆరోగ్యాన్నిచ్చే కమ్మని చారు కావాలంటే కూరగాయల రసంతో గానీ, టమోటా లాంటి పండ్ల రసంతో గానీ, ధనియాల పొడి, జీలకర్ర లాంటి సంబారాల రసంతోగానీ చారుని కాచుకుంటే సారం అనే పదానికి న్యాయం జరుగుతుంది. సొరకాయ ముక్కల జ్యూసు తీసుకుని అందులో రసం పొడి వగైరా వేసి చారు కాచుకుంటే గ్లాసు చారు ద్వారా చలవచేసే సొరకాయ కూడా అదనంగా మన కడుపులోకి చేరుతుంది కదా! ఇలా మీకిష్టమైన కూరగాయలు లేదా ఆకు కూరలతో రోజూ చారు కాచుకుని తాగితే చారు అనేది జీర్ణశక్తిని పోషక విలువలను అందించే ఒక సాధనం అవుతుంది.
అలచందల చారు: అలచందలు, బంగాళాదుంపలు, కొబ్బరి, అల్లరి వేసి కాచిన కట్టుచారు.
ఉలవచారు (హురళి సారు): బజార్లో వాణిజ్యపరంగా తయారయ్యే ఉలవచారులో నిలవ ఉంచే రసాయనాలు ఎక్కువ ఉంటాయి. ఉలవల్ని ఉడికించి, మిక్సీ పట్టి చిక్కని రసం తీసి, కొద్దిగా చింతపండు కలిపి చారు కాచుకొని తరచూ వాడుకొంటూ ఉంటే వాతవ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. చింతపండును పరిమితంగా వాడితే ఫలితం ఉంటుంది.
కట్టు (కట్టుదారు): చింతపండు లేకుండా కాచిన పప్పుచారుని ‘కట్టు’ లేదా ‘కట్టుచారు’ అంటారు. రాత్రిపూట ఒక కూరతోనూ, కొద్దిగా పెసరకట్టుతోనూ భోజనం ముగించగలిగితే ఎలాంటి దోషాలూ కలగవు. స్థూలకాయులకూ, షుగరు రోగులకూ పెసరకట్టు చారు ఒక మంచి ఆహార పదార్థం.
కొత్తిమీర చారు: కొత్తిమీరని వేళ్లతో సహా శుభ్రం చేసి ముక్కలుగా తరిగి జీలకర్రతో కలిపి కాచిన చారు. జీర్ణశక్తిని పెంపు చేస్తుంది.
కుందపుర కోలిసారు: ఉడిపి వంటకాల్లో ప్రసిద్ధి. కోడిమాంసంతో ప్రత్యేక పద్ధతిలో కాచిన కన్నడ చారు.
గంజిచారు: తెలుగు వాళ్లు తరవాణి అంటారు. లచ్చించారు అనే ముద్దు పేరు కూడా ఉంది. గంజిని పులవబెట్టి తయారుచేస్తారు. ఇది బీరుతో సమానమైన గుణాలు కలిగింది. మన పూర్వీకులు బాగా ఇష్టంగా తీసుకొనేవారు. ఇప్పుడిది మరుగున పడిపోయింది.
చింతచారు: చింతపండు రసంలో రసం పొడి కలిపి కాచిన చారు. కడుపులో ఆమ్ల సముద్రాన్ని సృష్టిస్తుంది. జీర్ణశక్తి బలంగా లేనివారు, జీర్ణకోశ సమస్యలున్నవారు, ఎసిడిటీ ఉన్నవారు ముఖ్యంగా దీన్ని తీసుకోకుండా ఉంటే మంచిది.
జీలకర్ర చారు (జీరిగే సారు): జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్లం వేసి కాచిన చారు. రుచికరం. జీర్ణశక్తిని పెంచుతుంది.
టొమాటో చారు: చింతపండుకు బదులుగా టమోటాలు వేసిన చారు. చారుని కాచి పొయ్యి మీంచి దించిన తరువాత ఆ వేడి మీద టమోటాలను చిదిపి రసం కలపాలి. టమోటాలను ముందే వేసి ఉడికిస్తే సి విటమిన్ ఎగిరిపోయి రుచి చచ్చిపోతుంది.
(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com