మీకు మీరే డాక్టర్

‘మధుమేహ కంచం’ నియమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నాకు షుగరు వ్యాధి వచ్చిందని ఈ మధ్యే పడింది. దీని మందులు తప్పనిసరిగా వాడాలా? ఆహార జాగ్రత్తలతో ఈ వ్యాధిని అదుపు చేసుకోగలమా? ఆ వివరాలు తెలియజేయండి.
-లక్ష్మీ రమణ కొండ్రెడ్డి (జగిత్యాల)
జ: షుగరు వ్యాధి రావడానికి ఆహారం ముఖ్య కారణం అయినప్పుడు ఆహారంలో మార్పులనేవి తప్పనిసరి అవుతాయి. ‘అన్నీ తినండి - ఈ మందులు వేసుకోండి..’ అనే చికిత్సా విధానాలు ప్రాణాంతక పరిస్థితిని తెచ్చి పెడతాయి. కాబట్టి, షుగరు వ్యాధిలో ఆహార నియమాల్ని విధిగా పాటించాలి. మందులు ఎంత అవసరం అనేది ఆ వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు నిర్ణయిస్తారు. మందులు వాడుతున్నప్పటికీ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని తాజా పరిశోధనాంశాలు మీ ముందుంచుతున్నాను.
కంచంలో వడ్డించే ఆహార పదార్థాల గురించే ఇప్పుడు మన చర్చ. షుగరు వ్యాధిలో ‘కంచం నియమాలు’ చాలా ముఖ్యమైనవి. ‘డయాబెటిక్ ప్లేట్’ రూల్ మీద విశేష పరిశోధనలు సాగుతున్నాయి. షుగరు వ్యాధి రావటానికీ, తగ్గటానికీ ఆహారమే ఒక కారణంగా నిర్ధారణ తరువాత ‘మధుమేహ కంచం రూల్సు’ గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరిగింది.
అమెరికాలో ప్రతీ 23 సెకన్లకీ ఒక వ్యక్తి షుగరు రోగిగా నిర్ధారణ అవుతున్నాడు. నిమిషానికి కనీసం ముగ్గురు షుగరు రోగులు బయటపడ్తున్నారు. అక్కడి ‘వ్యాధి అదుపు, నివారణల కేంద్రం (్ళళశఆళూ చ్యి జఒళ్ఘఒళఒ ళ్యశఆ్య ఘశజూ -ళ్పళశఆజ్యశ (్ళ్ళ)’ అందించిన నివేదిక ప్రకారం, షుగరు రోగులుగా నిర్ధారణ అయిన 29 మిలియన్ల అమెరికన్లలో కనీసం ఏడున్నర మిలియన్ల మందికి తమకు షుగరు వ్యాధి ఉందని తెలియదట. 86 మిలియన్ల అమెరికన్లు షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవారు (ఔళజూజ్ఘఇళఆళఒ) అని తేలింది. వీరిలో 90% మందికి తాము షుగరు వ్యాధి అంచున ఉన్నామనే గ్రహింపు లేదట.
పరీక్ష చేయించుకునే వరకూ ఎవరికీ షుగరు వ్యాధి వచ్చిందని తెలియకపోవచ్చు. కానీ, షుగరు వ్యాధిని తెచ్చే జీవన విధానాన్ని పాటిస్తున్నామన్న ఎరుక మనకుంటే ఈ రోజున వచ్చే వ్యాధిని రేపటికి వాయిదా వేసుకోగలగవచ్చు కదా!
మన జీవన విధానాన్ని అనుసరించి వచ్చే వ్యాధుల్లో షుగరు వ్యాధి ముఖ్యమైంది. వాణిజ్య సంస్కృతిలో జీవిస్తున్న మనందరమూ ఈ వ్యాధి మీద ఒక కన్ను వేసి ఉంచటం అవసరం. ముందు జాగ్రత్తల వలన ఈ వ్యాధిని, నివారించటమూ, నిరోధించటమూ, జయించటమూ, అదుపులో పెట్టటమూ, కొత్త సమస్యలు తలెత్తకుండా ఆపటమూ సాధ్యం అవుతాయి. అందుకు సహకరించే ఆహారోపాయాల్నే ‘మధుమేహ కంచం’ నియమాలని పిలుస్తారు.
‘మూడు కప్పుల ఆహారం’ అనేది ఈ నియమాలలో ఒకటి. మూడు సమానమైన బవుల్స్ (చిన్న గినె్నలు) తీసుకోండి. ఒక గినె్న నిండా అన్నం, ఇంకో గినె్న నిండా కూర, మరో గినె్న నిండా పప్పు తీసుకోండి. కూరనీ, పప్పునీ, ఇంకా అదనంగా కలుపుకునే పచ్చడి, పులుసు లేదా చారుని కూడా ఈ చిన్న గినె్నడు అన్నంతోనే తినేట్టుగా ఆహార ప్రణాళిక రచించుకుంటే అది ‘షుగరు వ్యాధి కంచం రూలు’ అవుతుంది.
అన్నంలో మూడోవంతు కూర, మూడో వంతు పప్పు, మరో మూడో వంతు పెరుగు లేదా మజ్జిగ ఇలా కలుపుకుని తింటే షుగరు వ్యాధి తప్పక అదుపులోకి వస్తుంది. కంచంలో మధ్యకి ఒక గీత గీస్తే రెండు సమాన భాగాలు అవుతాయి. రెండో సగభాగాన్ని మళ్లీ మధ్యకు గీత గీయండి. మొత్తం మూడు భాగాలు అవుతాయి. పెద్ద భాగంలో సలాదుగా తినదగిన కూరగాయ ముక్కలు వడ్డించుకోండి. రెండో దాంట్లో రెండు సగ భాగాలున్నాయి. ఒక భాగంలో అన్నం లేదా చపాతీనీ, మిగిలిన ఈ మూడో భాగంలో వండిన కూరగానీ, పప్పు గానీ వడ్డించుకోండి. మొత్తం భోజనంలో మూడో వంతు పప్పు లేదా మాంసం ఉండాలి. మరో మూడో వంతు కూర, మిగతాది పచ్చడి, పులుసు వగైరా ఉండాలి. అన్నం, చపాతీలు, పుల్కాలు లేదా రోటీలు ఇవి ఏవి తిన్నా, గోధుమ పిండికి, వరి అన్నానికి ప్రాధాన్యత తగ్గించి కూర, పప్పు ఎక్కువగా తినేలా ఆహార ప్రణాళిక ఉండాలనేది ఈ కంచం నియమాల ముఖ్య ఉద్దేశం.
ఇవి సక్రమంగా ఉండాలంటే, మన ఆహార పదార్థాలను వండే తీరులో మార్పు రావాలి. పులుసు కూరలు, మసాలా గ్రేవీ ఎక్కువగా వేసి వండే కూరల్ని ఈ నియమం ప్రకారం తినాలంటే కుదరదు. అతిగా పులుపు లేదా మసాలాలు కలిపి వండిన కూర గరిటెడు వేసుకుంటే అందులో కూర ముక్కలు ఒకటీ లేదా రెండు ఉంటాయి. మిగతాదంతా గ్రేవీ ఉంటుంది. దాన్ని తినటం కోసం అన్నం ఎక్కువగా కలుపుకోవలసి వస్తుంది. కూరల్లో చింతపండు గానీ, అల్లం వెల్లుల్లి మసాలాలు గానీ పరిమితంగా ఉండేలా వుండుకుంటే ఎక్కువ కూర లేదా పప్పుని తక్కువ అన్నంతో తినగలుగుతాం.
షుగరు వ్యాధికి ప్రధాన కారణం కార్బోహైడ్రేట్లే (పిండి పదార్థాలు) రోజువారీగా మనం తీసుకుంటున్న వరి, గోధుమ, మినుము, పెసర, శనగ, దుంప కూరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. షుగరు రోగులు తమ కంచంలోకి వీటి చేరికని ఆపగలగాలి. కార్బోహైడ్రేట్లు మనకు ఎంత అవసరం అనేది మన శరీర శ్రమ మీదా, మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం మీదా, మన జీర్ణశక్తి మీదా ఆధారపడి ఉంటుంది. ఈ మూడూ తక్కువగానే ఉన్న వ్యక్తుల కంచంలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉండాలి. అందుకని, మధుమేహ కంచంలో వరి లేదా గోధుమకు ప్రాధాన్యత తగ్గించి, కూరగాయలకు ప్రాధాన్యత పెంచాలని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు.
ఇడ్లీ, అట్టు, బొంబాయి రవ్వ ఉప్మా, బజ్జీ, పునుగులు వగైరాల ద్వారా మనం చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్లను శరీరానికి అందిస్తున్నాం. రేపొచ్చే షుగరు వ్యాధిని ఇవ్వాళ వచ్చేలా త్వరితపరిచే ఈ టిఫిన్లకు స్వస్తి పలకటం మంచిది. చపాతీ, పుల్కా, రోటీలలో వరి అన్నంతో పోలిస్తే కార్బోహైడ్రేట్ల శాతం కొద్దిగా తక్కువ అయినప్పటికీ, వీటిని మసాలా కర్రీలతో కాకుండా అన్నంలోకి వండుకున్న కూరతో తింటే మేలు జరుగుతుంది.
గత 20 ఏళ్ల కాలంలో అమెరికన్ రెస్టారెంట్లలో జనం తింటున్న ఆహార పదార్థాల మోతాదు (పోర్షన్ సైజు) 200-300 శాతం పెరిగిందని ఒక నివేదిక చెప్తోంది. విచిత్రంగా తెలుగు నేల మీద కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బజ్జీలు, పునుగుల్ని సాయంత్రం పూట మాత్రమే వేసేవారు. ఇప్పుడు ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తెల్లవారేసరికి మైసూరు బజ్జీ రెడీగా ఉంటోంది. స్థూలకాయం, షుగరు వ్యాధి రోగుల సంఖ్య పెరగటానికి ఇవన్నీ కారణాలే!
మధుమేహ కంచం నియమాలను అర్థం చేసుకుని పాటిస్తే ఇన్సులిన్ మీద ఆధారపడేవారిక్కూడా శుభం కలిగే అవకాశం ఉంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com