మీకు మీరే డాక్టర్

ఆరోగ్యానికి సపోటాదే వాటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: సపోటా పండు మంచిదేనా? ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదూ?
-మహంకాళి సదాశివరావు (నెల్లూరు)
జ: సపోటా పండు వేడిని తగ్గిస్తుంది. అమితంగా చలవనిస్తుంది. వేడి వలన కలిగే దోషాలను ఆపుతుంది, బీపీని, పొడిదగ్గును తగ్గిస్తుంది. శరీరంలో నిస్సత్తువగా, బలహీనంగా ఉన్నప్పుడు సపోటా పండ్లను తింటే, శరీరం శక్తి పుంజుకుంటుంది. సపోటాలో ఫ్రక్టోజు అనే పంచదార పదార్థం ఉంటుంది. నీరసం వచ్చినప్పుడు రక్తంలోకి ఎక్కించేది ఈ ఫ్రక్టోజు (డెక్స్‌ట్రోజ్)నే. శరీర కణాలకు శక్తినందించేది ఇదే.
గుండ్రంగా ఉండే పెద్ద సపోటాలో తీపి తక్కువగా ఉంటుంది. కోలగా, చిన్నగా ఉండే నాటు సపోటాలో తీపి, పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సపోటాలను నేరుగా తినవచ్చు. సలాదుల్లో కలిపి తినవచ్చు. జ్యూసు తీసుకుని తాగొచ్చు. ఉడికించకుండా ఏ విధంగా తిన్నా తప్పు లేదు. కేరెట్, బీట్‌రూటు, ముల్లంగి, కీరదోస, సపోటా గుజుజ వీటిని సమభాగాలుగా తీసుకుని సలాదుగా తీసుకోవచ్చు. లేదా జ్యూసు రూపంలో తీసుకోవచ్చు. క్షీణించిపోతున్న వారికి, బలహీన పడ్తున్న వారికి ఇది దివ్యౌషధం. తెలుగు నేల మీద పాల సపోటా అనేది ప్రముఖంగా దొరికే సపోటా రకం. కీర్తిబర్తి సపోటా, క్రికెట్ బంతి సపోటా, ద్వారపూడి సపోటా, గుత్తి సపోటా, జొన్న వలస సపోటా, వావివలస సపోటా అనే రకాలు కూడా దొరుకుతున్నాయి. ఉత్తరాదిలో చీకూ పండ్లని పిలుస్తారు.
సపోటాలో పోషకాలు జీర్ణశక్తిని పెంపు చేసేవిగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అయితే ఎక్కువ శాతం షుగర్స్ ఉన్న పండు ఇది. అందువలన దీన్ని మధుమేహ రోగులు, స్థూలకాయం ఉన్నవారూ జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ అధిక శాతం ఉండటాన ఇది కంటిచూపును మెరుగుపరచేదిగా ఉంటుంది.
సపోటాలో పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి షుగరు రోగులు సపోటాని పరిమితంగా తినవచ్చు. ఈ ఫైబరు వలన ఇది పెద్ద పేగుల్లో వచ్చే కేన్సర్‌ని నివారిస్తుంది. మొలలు, ఫిస్ట్యులా లాంటి వ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది. మొలల్లో రక్తస్రావాన్ని ఆపుతుంది. పేగులు బలసంపన్నం అవుతాయి. మలబద్ధత తగ్గుతుంది. కొవ్వు, షుగరు వగైరా రక్తంలో చేరకుండా ఈ పీచు నివారిస్తుంది. రోజూ సపోటా జ్యూసులో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగుతుంటే మలబద్ధత పోయి, కాలవిరేచనం అయ్యేలా చేస్తుంది. పేగుల్ని మృదువు పరుస్తుంది. ఎందుకంటే విష దోషాలను నివారించటానికి, వైరస్ - బాక్టీరియాల నుండి శరీరాన్ని రక్షించటానికి అప్పుడప్పుడూ సపోటాని కడుపులోకి పంపుతూ ఉండటం అవసరమే.
విష దోషాల్ని తగ్గించే పాలిఫినోలిక్ అనే రసాయనం కారణంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో సపోటా ఎక్కువ గుణవత్తరంగా ఉంటుంది. తరచూ జ్వరాలొచ్చే వారికి సపోటా తరచూ పెడ్తుంటే రోగి త్వరగా పుంజుకొంటారు.
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాపులూ ఉన్నవాళ్లకు సపోటా పండు నొప్పులు, వాపులు తగ్గించేందుకు సహకరించేదిగా ఉంటుంది.
పుండును మానే్ప గుణం కూడా ఉంది. అందుకనే పేగుపూత లాంటి వ్యాధుల్లో సపోటాలు ఉత్తమ ఫలితాన్నిస్తాయి. బొప్పాయి, సపోటాలు తింటూ ఉంటే పేగుపూత చాలా త్వరగా తగ్గుతుంది. పొట్టని శుభ్రం చేయటం ద్వారా వాతాది దోషాలను తగ్గిస్తుంది. వాతాది దోషాల వలన కలిగే అనేక జబ్బులు కూడా నెమ్మదిస్తాయి. సపోటా పండ్లకు నరాల్లో ఉద్రేకాన్ని వత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉన్న బి విటమిన్ ఈ కార్యాన్ని బాగా నెరవేరుస్తుంది.
మొక్కగట్టిన రాగుల్ని ఎండించి మరాడించిన పిండిని రాగి మాల్ట్ అంటారు. రాగి మాల్ట్‌లో సపోటా గుజ్జు కలిపి రోజూ సాయంకాలం అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపం సరవుతుంది. ఎముక పుష్టికి ఎండలో కూర్చోవటం అవసరం.
సి విటమిన్ అధికంగా లభ్యం కావటాన ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తుంది. అపకారం చేసే స్వేచ్ఛా విషాలను అరికడ్తుంది. జ్వరాల్లో సపోటా మంచి చేస్తుంది. ఎ విటమిన్ లోపాన్ని సరిచేసుకోవటానికి సపోటా ఉత్తమ సాధనం. గర్భాశయ కేన్సర్ నివారించటానికి ఇది ఔషధంలా పనిచేస్తుంది.
గర్భవతులకు సపోటా చాలా మేలు చేస్తుంది. శరీరానికి శక్తినీ, మృదుత్వాన్నీ, తనకూ తన కడుపులో పెరిగే బిడ్డకు కావలసిన కనీస పోషకాల్నీ అందించటమే కాకుండా సౌకుమార్యాన్ని కూడా కలిగిస్తుంది. మానసిక వత్తిడిని తగ్గించి సంతోషాన్నిస్తుంది. కమ్మటి నిద్ర పట్టిస్తుంది. సపోటా జ్యూస్‌లో పాలు కలిపి, కొద్దిగా జాజికాయ, జాపత్రి చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి రాత్రి పడుకోబోయే ముందు తాగటం వలన నిద్ర నాశనం తగ్గి కమ్మగా నిద్ర పడుతుంది.
జుత్తు గరుకుగా, బిగుసుగా ఉన్నప్పుడు సపోటా తింటూంటే వెంట్రుకలు మృదువుగా అవుతాయి. ముఖం జిడ్డు కారటం, తలలో చుండ్రు, మొటిమలు తగ్గుతాయి. జుత్తు పెరగటానికి, నల్లబడటానికి తోడ్పడుతుంది. ఎండ రియాక్షన్ ఉన్నవారు సపోటా తింటూ ఉంటే ‘సి’ విటమిన్ ఎండ తెరలా ఉపయోగపడ్తుంది. అబీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ వ్యాధుల్లోనూ, టైఫాయిడ్ జ్వరంలోనూ, నీళ్ల విరేచనాలలోనూ ఇది ఒక మంచి ఔషధంలా సహకరిస్తుంది. ఆయా వ్యాధులకు వాడుకునే మందులకు అనుపానంగా సపోటా పండు తింటే మందులు కూడా శక్తిమంతంగా పని చేస్తాయి. వ్యాధి త్వరగా తగ్గుతుంది.
ఎముకల దృఢత్వం కోసం, రక్తహీనత తగ్గటం కోసం, తగినంతగా సపోటా పండ్లను తింటూ ఉండాలని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. అధికంగా రక్తస్రావం అయ్యే వ్యాధులు తీవ్రంగా ఉన్నవారు సపోటా పండ్లను తింటూ ఉంటే వేడి తగ్గుతుంది. అందువలన రక్తస్రావం అయ్యే పరిస్థితులు తగ్గుతాయి. రక్తస్రావం కావటం కూడా నెమ్మదిస్తుంది.
సపోటాలో బాక్టీరియాలను, ఇతర సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధిలో దీనికి ఔషధ ప్రయోజనాలున్నాయి. పూటపూటా సపోటా తినే అలవాటున్న వారికి మానసిక ఆరోగ్యం బావుంటుంది. మనసు తేలిక పడుతుంది. త్వరగా సమస్య నుండి బయటపడగలుగుతారు. డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన లాంటి మానసిక స్థితిగతులకు సపోటా మంచి నివారకంగా పని చేస్తుంది. వేడి చేసినందువలన వచ్చే పొడిదగ్గు, మూత్రంలో మంట, కడుపులో మంట, విరేచనంలో మంట దీనివల్ల తగ్గుతాయి. సపోటా మంచి విరేచనకారి కూడా. విరేచనాలు అయ్యేలా చేయటం, అవుతున్నప్పుడు ఆగేలా చేయడం రెండింటికీ ఇది ఒకేలా ఉపయోగపడ్తుంది. ఆయా పరిస్థితుల్ని బట్టి అది పని చేయటం ఆధారపడి ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు తరచూ సపోటా తింటూ ఉండటం మంచిది.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642