మీకు మీరే డాక్టర్

నిధ్రపుచ్చే సైన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: మీరు అనేక ఆరోగ్యపరమైన విషయాల గురించి చాలా వివరంగా రాస్తున్నారు. పిల్లల్ని నిద్రపుచ్చటం గురించి కూడా తెలుపగలరు.
జ: మీరెప్పుడైనా ‘కిడ్నాప్’ చేశారా? అసలు మనలో కిడ్నాప్ చేయటం ఎంతమందికి తెలుసు? కిడ్నాప్ అనేది ఒక కళ. ముఖ్యంగా తల్లులందరూ కిడ్నాప్ కళలో కళారత్నలు కావాలి.
కిడ్ అంటే బిడ్డ. నాప్ అంటే కునుకు. కిడ్ నాప్ అంటే బిడ్డను నిద్రపుచ్చటం. శిశువు గుక్కపట్టి కక్కటిల్లకుండా కమ్మగా నిద్రించటం కన్నా తల్లులకు భాగ్యం ఏముంటుందీ చెప్పండి!
‘జో అచ్యుతానంద జోజో ముకుందా/ లాలి పరమానంద రామ గోవిందా.. జోజో’ అనే పాటలో శిశువును ఉయ్యాల తొట్లో వేసి ఊపుతూ నిద్రపుచ్చటమే కనిపిస్తుంది.
‘తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ/ నాలుగూ వేదాల గొలుసులమరించీ...’ అంటూ ఆ ఉయ్యాలతొట్టిని వర్ణిస్తుందీ అన్నమయ్య గీతం.
బిడ్డను ఉయ్యాల్లో వెల్లకిలా పడుకోబెట్టడం, అలా పడుకునేలా వాళ్లకు అలవాటు చేయటం ఉత్తమం అని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా చెప్తున్నారు. బిడ్డ పుట్టాక 11వ రోజున ఉయ్యాల తొట్లో వేసే వేడుకని మనం జరుపుకుంటాం.
బిడ్డని ఎలా సాకాలో సీనియర్ తల్లులు బిడ్డతల్లికి నేర్పించటానికి ఉద్దేశించిన వేడుక ఇది.
బిడ్డను వెల్లకిలా పడుకోబెట్టి నిద్రపుచ్చటం వలన పిల్లల్లో కలిగే ‘అకస్మాత్ మరణ వ్యాధి’ (sudden infant death syndrome (SIDS) ని నివారించవచ్చని హెల్త్ డే న్యూస్ జర్నల్ 2017 ఆగస్టు 21న ఒక నివేదికలో వెల్లడించింది. ఎంత చెప్పినా అమెరికన్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పొట్టమీద బోర్లా పడుకోబెట్టుకునే tummy - sleeping అలవాటు మానట్లేధు అంటూ ఈ పత్రిక ఒకింత అసహనం ప్రదర్శించింది.
1994లో అమెరికా ప్రభుత్వం పిల్లల విషయంలో ఱ్ఘషరీ ఆ్య ఒళళఔ వెల్లకిలా పడుకోబెట్టడం అనే ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా. ముఖ్యంగా అమెరికన్ నీగ్రో ప్రజల్లో ఉన్న ఈ అలవాటును మాన్పించటానికి ఈ ఉద్యమాన్ని ఉద్దేశించింది. బిడ్డ ఉయ్యాల్లో పడుకున్నాడా, మంచం మీద పడుకున్నాడా, బొజ్జ మీద పడుకున్నాడా అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. బిడ్డ బోర్లా పడుకోకూడదు అనేదే ఇక్కడ ముఖ్య విషయం.
నిద్ర సుఖం ఎరుగదు. నిద్ర ముంచుకొచ్చాక ఎటు తిరిగి పడుకున్నాం అనేదీ ముఖ్యం కాదు. నిద్రే ముఖ్యం అనుకుంటాం మనం. కాని, వెల్లకిలా పడుకోవటంలో ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. బోర్లా పడుకోవటంలో ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. చంటి పిల్లల విషయంలోనే కాదు, మన విషయంలో కూడా ఇది నిజం. పెద్దవాళ్లు కూడా వెల్లకిలా తిరిగి పడుకోవటానికే ప్రాధాన్యత నివ్వటం అవసరం.
వెల్లకిలా పడుకున్నప్పుడు ఊపిరి నడిచే మార్గాల మీద వత్తిడి ఉండదు. శ్వాస ధారాళంగా ఆడుతుంది. బోర్లా పడుకున్నప్పుడు బిడ్డ శ్వాసకు అవరోధం కలిగి నిద్రలోనే మరణించే ప్రమాదం ఉంది. బోర్లా పడుకుంటే ఎక్కువ నిద్ర పోతారనే నమ్మకంతో చాలామంది పిల్లల్ని వెల్లకిలా పడుకోనివ్వరు. ఇది అపోహే! పైగా బిడ్డకు ప్రాణహానిని కలిగించవచ్చు కూడా! జోలపాడినంత మాత్రానే నిద్ర రాదు. నిద్ర సౌకర్యవంతంగానూ, నిరపాయకరంగా కూడా ఉండాలి. వెల్లకిలా పడుకోబెట్టి, చిచ్చికొడుతూ బిడ్డను తల్లి నిద్రపుచ్చుతుంది. తల్లిని చూస్తూ నిద్రపోయే సమయానికి బిడ్డ మనసులో ఒక విధమైన మనోధైర్యం confidence level నిండి ఉంటుంది. అదే కమ్మని నిద్రకు కారణం అవుతుంది. బిడ్డను బోర్లా పడుకోబెట్టి వీపున బాదుతుంటే వాళ్లు నిద్రపోయేది తక్కువ, ఏడ్చేది ఎక్కువగా ఉంటుంది. చిచ్చికొట్టడం అనేది అతి సున్నితంగా ఇవ్వవలసిన ఒక స్పర్శ మాత్రమే! కొందరు తల్లులు ళుబుళుబుళుబు హారుూ అంటూ భీకరంగా పాడుతుంటే పక్కింట్లో పిల్లలు కూడా నిద్రలేచి ఏడ్చే ప్రమాదం ఉంది. లాలి లేదా జోల అనేది చిరుగాలిలా సున్నితంగా సాగాలి, తుఫాను గాలిలా హోరెత్తేదిగా ఉండకూడదు.
వెల్లకిలా పడుకోబెట్టినప్పుడు బిడ్డ చెవులు, అతని భుజం సమాన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. తలకింద పెద్ద దిళ్లు పెడితే చెవులు ఎత్తు ఎక్కువ మీద, భుజాలు దిగువకూ ఉంటాయి. అందువలన తలకాయని వంచినట్టవుతుంది. అది గొంతులోని ఊపిరి మార్గాలను నొక్కిపెడ్తూ ఊపిరాడక బిడ్డ మరణించే ప్రమాదం ఉంది.
పాలు తాగంగానే వెల్లకిలా పడుకోబెట్టి తారంగం కొట్టడం మంచి అలవాటు కానీ, వెంటనే బోర్లా తిప్పి నిద్రపుచ్చకూడదు. బొజ్జమీద బిడ్డ పడుకోబెట్టుకోగానే చక్కగా నిద్రపోయాడనుకోండి.. వెంటనే తెచ్చి ఉయ్యాల తొట్లో వెల్లకిలా పడుకోబెట్టండి. అలా వొంటరిగా ఉయ్యాల్లోనే పడుకునేలా అలవాటు చేయండి.
బిడ్డ పుట్టంగానే తల్లులు చాలామంది మొదటిగా అడిగే ప్రశ్న ‘మా బిడ్డకు ఏం మందులు వాడాలండీ?’ అని. తరువాత ప్రశ్న.. ‘ఏం పెట్టాలండీ?’ అని. శిశువులకు తన పాలిస్తే చాలు ఏ మందులూ వాడనవసరం లేదు. కానీ, ఏ తల్లీ ఏ డాక్టరునూ అడగని ప్రశ్న.. బిడ్డను ఎలా పడుకోబెట్టాలీ..? అని. బిడ్డను కన్నాక ప్రతీ తల్లీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. వైద్యులు, శిక్షణ పొందిన నర్సులూ ప్రాక్టికల్‌గా చూపించాల్సిన విషయం కూడా.
చంటి పిల్లల వయసునిబట్టి వారి నిద్రా వేళల్లో మార్పులు వస్తుంటాయి. నెలలు పెరుగుతున్న కొద్దీ నిద్రా సమయం తగ్గుతూ వస్తుంది. లోకాన్ని ఆకళింపు చేసుకునే అవకాశం వాళ్లకు మెలకువలో ఉన్నప్పుడే కలుగుతుంది. బిడ్డ ఎదిగే కొద్దీ మెలకువ కాలం పెరుగుతూ వస్తుంది. వారివారి వయసునుబట్టి పిల్లల నిద్రా సమయాన్ని నిశ్చయం చేయాలి. వాళ్లకు ఎంత నిద్ర అవసరమో అంత నిద్రపోయే అవకాశం కల్పించాలి. అంతేకాని మనకు పని ఉన్నప్పుడు వాళ్లు నిద్రపోవాలని అనుకోకూడదు. మనం ఎలా అలవాటు చేస్తే అలానే పెరుగుతారు. ఏడాది దాటిన పిల్లల్ని మీతోపాటుగా కాక వేరుగా పడుకోబెట్టడమే మంచిది. ఊహ తెలిసిన పిల్లల్ని వేరే గదిలో పడుకోవడాన్ని అలవాటు చేయండి. మాటలు నేర్చిన పిల్లలకు నిద్ర పుచ్చేటప్పుడు మంచి కథలు చెప్పండి. వాళ్లు విన్న కథలే వాళ్లకు కలలుగా వస్తుంటాయి. ఆ కలలు వాళ్ల మానసిక ఉత్తేజానికి, వికాసానికీ కారణం అవుతాయి. బిడ్డల నిద్రా పర్యావరణం - స్లీపింగ్ ఎన్విరాన్‌మెంట్ - అనేది సౌకర్యదాయకంగా, సుఖదాయకంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. బిడ్డలు ఇష్టపడి తమ గదిలోకి వెళ్లి నిద్రపోయే అలవాటు ఉండాలి. "White Noise" సంగీతం లాంటివి త్వరగా నిద్ర తెస్తాయి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com