మీకు తెలుసా ?

జీడిపప్పు కొందరికి పడదు... (మీకు తెలుసా?)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా మందికి జీడిపప్పు అంటే బాగా ఇష్టం. నిజానికి ఇది బలవర్దకమైన ఆహారమే. కానీ ఇందులో ఉండే కొన్ని ప్రొటీన్లు కొందరికి పడవు. పాలు, పాలపదార్థాలు కొందరికి పడనట్టే ఇదీను. అందువల్ల జీడిపప్పు పడనివారు తింటే అజీర్తి, ఒళ్లంతా రాషెస్ వస్తాయి. అన్నట్లు బ్రెజిల్‌లో పుట్టి ప్రపంచం అంతా జీడిమామిడి సాగు అల్లుకుంది. జీడిపప్పు ఉత్పత్తిలో నైజీరియా, వియత్నాం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వియత్నాం మొదటి స్థానానికి చేరుతోంది. జీడిపప్పు పాలు, వెన్న, చీజ్, జీడిపళ్లతో మద్యం తయారు చేస్తారని చాలామందికి తెలుసు. కానీ జీడిపిక్కల పెంకుతో రంగులు, క్రిమిసంహారక మందులు తయారు చేస్తారు తెలుసా. ఈ పెంకుల్లో ఉండే అనకార్డిక్ యాసిడ్ విషంతో సమానం. అన్నట్లు మామిడి, దురదగుండాకు జీడిమామిడికి దగ్గరి వర్గం.

వంకాయల్లో నికోటిన్
మనలో చాలామంది ఇష్టంగా తినే వంకాయ నిజానికి కూరగాయ (వెజిటబుల్) కాదు. వృక్షశాస్త్ర పరంగా దీనిని ‘బెర్రీ’గానే పరిగణిస్తారు. క్యాన్సర్‌కు కారణమైన ‘నికోటిన్’ వంకాయల్లో ఉంటుంది తెలుసా. వీటిల్లో మినహా మరే కాయగూరల్లో నికోటిన్ ఉండదు. కానీ పొగాకులో ఉన్నంత పరిమాణంలో ఉండదు. అందువల్ల వంకాయలు తినడంవల్ల మన ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు. పైగా దీనిలో ఉండే ఇతర పోషకాలు, ఖనిజలవణాలవల్ల ‘ట్యూమర్’ పెరుగుదలను వంకాయ నివారిస్తుంది. అంటే క్యాన్సర్‌ను అడ్డుకుంటుందన్నమాట. మనం వంకాయలను ఇంగ్లీష్‌లో‘బ్రింజాల్’ అని పిలుస్తాం. కానీ చాలాదేశాల్లో వీటిని ‘ఎగ్‌ప్లాంట్’ అని పిలుస్తారు. వంకాయలు గుడ్లమాదిరిగా ఉంటాయని అలా పిలిచేవారు. ఇటలీలో మాత్రం వీటిని ‘క్రేజీఏపిల్’ అని పిలుస్తారు. అది ఎక్కువగా తింటే పిచ్చి పడుతుందన్నది వారి భయం.

24 గంటలకోసారి తినకపోతే మరణమే
చూడటానికి చిన్నగా, అరుదైన రూపంలో కన్పించే ఈ ‘వీసెల్’...వేటలో మేటి. అతిక్రూరంగా, నిర్దయగా జంతువులు లేదా పక్షులను చంపి తినడం దీని ప్రత్యేకత. పైగా ప్రతి 24 గంటలకోసారి ఇది ఆహారాన్ని తినాల్సిందే. లేనిపక్షంలో ఆకలిని తట్టుకోలేక అది మరణిస్తుంది. అందుకే నిత్యం అది ఆహారానే్వషణలోనే ఉంటుంది. అవసరంకన్నా ఎక్కువగా తింటుంది. అవసరం లేకున్నా వేటాడుతుంది. తినగా మిగిలింది దాచిపెట్టుకుంటుంది. వేటకు దిగినపుడు జంతువులు, పక్షులపై దాడిచేసి వాటి తలవెనుకభాగాన్ని కొరికి, కపాలంపై రంధ్రం చేసి చంపేస్తుంది. తనకన్నా సైజులో పెద్దగా ఉన్నవాటినీ వదలదు. ఒక్కోసారి మనుషులపైనా దాడి చేస్తుంది. కానీ చంపడానికి కాదు. ఆహారాన్ని వేటాడేటపుడు ఇది గెంతుతూ, దొర్లుతూ, పొర్లుతూ, తొంగిచూస్తూ చేసే విన్యాసాలను ‘వార్ డ్యాన్స్’గా పిలుస్తారు. అచ్చం ‘స్టోట్స్’లా ఉన్నా తోక చివర మచ్చ లేకపోవడమే తేడా.

షార్క్‌కు ఎముకలు ఉండవు
షార్క్ (సొరచేప)ల శరీరంలో ఎక్కడా ఎముకలు ఉండవు. మన ముక్కు, చెవుల మాదిరిగా మృదులాస్థికల్లాంటి నిర్మాణంతో అది ఉంటుంది. షార్క్ నీళ్లలో నిరంతరం కదులుతూంటేనే వాటికి ఆక్సిజన్ అంది జీవిస్తుంది. ఎక్కడైనా నిశ్చలంగా ఉండిపోతే ఆక్సిజన్ అందక మరణిస్తుంది. అందువల్ల అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. వీటి పళ్ల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ప్రతి దంతం వెనుక అదే మాదిరిగా ఉండే కొన్ని పళ్లు వరుసగా ఉంటాయి. ఒక పన్ను ఊడిపోతే ఆ స్థానంలోకి ఆ వెనక ఉన్న పన్ను చేరుతుంది. దాని వెనుక ఉన్నది ఆ తరువాతి స్థానానికి చేరుతుంది. అంటే కనే్వయర్ బెల్ట్‌మాదిరిగా పళ్లు ముందుగుజరుగుతాయన్నమాట.

-ఎస్.కె.కె.రవళి