మీకు తెలుసా ?

చదరంగా ఉండే పుచ్చకాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండ్రంగా, సిలెండర్ మాదిరిగా కన్పించే పుచ్చకాయలు అందరికీ తెలిసినవే. కానీ చదరపు ఆకారంతో ఉండే పుచ్చకాయలున్నాయని ఎందరికి తెలుసు. అయితే సహజసిద్ధంగా అవి అలా పెరగవు. మామూలు పుచ్చకాయ పాదులకే అవి కాస్తాయి. కృత్రిమ పద్ధతిలో వాటికి ఆ రూపం వచ్చేలా చేస్తారంతే. చతురస్రంగా ఉండే గాజుపెట్టెల్లో సాధారణ పుచ్చకాయలు పెరిగేలా చూస్తారు. అంటే బలవంతంగా వాటికి ఆ రూపు వచ్చేలా చేస్తారన్నమాట. జపాన్‌లోని ఒకటిరెండు ప్రాంతాల్లో మాత్రమే వీటిని పెంచగలుగుతున్నారు. 1978లో షికొకు గ్రామంలో ఓ రైతు ఈ ప్రయోగం చేశాడు. దీంతో చతురస్రపు పుచ్చకాయలకు మహా గిరాకీ ఏర్పడింది. వీటి ఖరీదుకూడా ఎక్కువే. సాధారణ పుచ్చకాయలు 15 డాలర్లుంటే చదరపు పుచ్చకాయలు 100 డాలర్లవరకు ధర ఉంటుంది. సామాన్యులకు అందుబాటులో లేని ఈ పుచ్చకాయలు బహుమతులుగా ఇవ్వడం పరిపాటి. జపాన్‌లో వీటికి క్రేజ్ ఎక్కువ. ఇంతకీ వీటిని ఎందుకు సృష్టించారో తెలుసా. రిఫ్రిజిరేటర్లలో చోటు ఆదా చేసుకోవాడానికే. మామూలు పుచ్చకాయలు ఫ్రిజ్‌లలో పెట్టడానికి వీలు లేకపోవడం, ఉంచినా స్థలం ఎక్కువ అవసరం అవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ రైతు చేసిన ప్రయోగం ఇలా ఫలించిందన్నమాట.

గొడుగు కథ ఇదీ!

ఎండ, వానలనుంచి రక్షణకోసం గొడుగులు వాడతారని చాలామందికి తెలుసు. కానీ వీటిని స్టైల్‌కు, హోదాకు చిహ్నంగా మొదట వాడేవారు. వీటి వాడకం కనీసం 3వేల ఏళ్లక్రితమే ప్రారంభమైంది. ‘అంబ్రోస్’ అనే లాటిన్ పదంనుంచి ‘అంబరిల్లా’ అనే ఆంగ్లపదం పుట్టుకొచ్చింది. నిజానికి గొడుగులు కేవలం మహిళలే వాడేవారట. ఇంగ్లండ్‌లో ఓ రెస్టారెంట్ వ్యాపారి తొలిసారి గొడుగు వాడటంతో అప్పటినుంచి మగవాళ్లూ వాటిని వాడటం అలవాటైంది. ప్రపంచంలో గొడుగుల ఉత్పత్తిలో మెజారిటీ వాటా చైనాదే. ఈ దేశంలోని ‘షాంగ్యూ’ అనే పట్టణం గొడుగుల ఉత్పత్తిలో నెంబర్ వన్. ఆ ఒక్క పట్టణంలో గొడుగులు తయారు చేసే సంస్థలు కనీసం వెయ్యి ఉన్నాయి. ఒక్కో కార్మికుడు గంటకు 70 గొడుగులు తయారు చేయగలరు. పిల్లలకు, జంతువులకు, సేదదీరడానికి, స్టైల్‌కు, హోదాకు, ఫొటోషూట్‌లకు ఇలా భిన్నమైన అవసరాలకు ఒక్కోరకంగా గొడుగులు తయారు చేస్తున్నారు. మీకో విషయం తెలుసా. గొడుగులను హత్యలకూ ఉపయోగించేవారు. ముఖ్యంగా కుట్రలతో హతమార్చడంలో గొడుగులను వాడేవారు. 1978లో బల్గేరియా అధ్యక్షుడిని రష్యాకు చెందిన కెజిబి ఏజెంట్ గొడుగు కొనకు విషంపూసి, దానితో పొడిచి హత్య చేశాడు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.

చేతిరుమాళ్లు కొన్ని దేశాలకే పరిమితం

చేతి రుమాళ్లు మనం వాడుతున్నాం కానీ ప్రపంచంలో వాటి వాడకం చాలా పరిమితం. పదుల సంఖ్యలో దేశాల్లో మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. వేల సంవత్సరాలక్రితంనుంచే చేతిరుమాళ్ల వాడకం ఉంది. లెనిన్, కాటన్‌తో వీటిని తయారు చేస్తారు. ఇంగ్లండ్‌లో రిచర్డ్-2 హయాంలో ఆయన తొలిసారిగా ముక్కు తుడుచుకునేందుకు చిన్నచిన్న గుడ్డముక్కలను వాడారని, అప్పటినుంచి రుమాళ్ల వాడకం మొదలైందని చెబుతారు. శుభ్రం చేసుకోవాడానికి, చమట తుడుచుకోవడానికి మామూలుగా వీటిని వాడతాం. తెల్లరుమాళ్లు శాంతికి చిహ్నంగా, సంతోషం వ్యక్తం చేయడానికి రుమాళ్లు ఊపడాన్ని సంకేతంగా (అమెరికాలో) చెబుతారు. సరే రుమాళ్ల మడతలను బట్టి ఒక్కో భాష్యం చెబుతారు. అలాగే స్వలింగ సంపర్కులు తమ వెనుకజేబుల్లో పెట్టుకునే రుమాళ్లు, వాటి రంగులను బట్టి వారి కోర్కెను, తమకు ఎలాంటివారు కావాలో చెబుతాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సంప్రదాయం ఉంది.

ఎస్.కె.కె.రవళి