మీకు తెలుసా ?

ఈ పక్షులను అలా ఎందుకు పిలుస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర అమెరికా, కెనడాల్లో కనిపించే ఈ ‘రెడ్ కార్డినల్’ పక్షులను అలా పిలవడానికి అసలు కారణం తెలుసా. రోమన్ కాథలిక్ చర్చిలలో ‘కార్డినల్స్’ ధరించే వస్త్రాలు, టోపీ ఎర్రటి రంగులో ఉంటాయి. అలా ఎర్రటి రంగులో ఉండే ఈ పక్షులను కూడా ‘రెడ్‌కార్డినల్ బర్డ్స్’గా పిలవడం అలవాటైంది. కాంతివంతమైన ఎరుపు రంగుతో మెరిసిపోయే ఈ పక్షులు మగవి. ఆడపక్షులు ఇంత మెరుపు, ఎరుపుతో ఉండవు. మిగతా సాంగ్‌బర్డ్స్‌కు భిన్నంగా ఈ జాతి పక్షుల్లో మగ, ఆడ పక్షులు ‘పాటలు’ ఆలపించగలవు. తాము నివసించే ప్రాంతానికి ఇతర మగ పక్షులు వస్తే వాటిని తరిమికొట్టేందుకు అవి దాదాపు యుద్ధమే చేస్తాయి. అద్దంలో తమ ప్రతిబింబం చూసుకుని వేరే మగపక్షులు వచ్చాయన్న భ్రమతో అవి నానా హంగామా చేయడం వినోదం కలిగిస్తుంది. అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో ఇవి రాష్ట్ర పక్షులుగా ప్రకటించారంటే అమెరికా జనజీవన స్రవంతిలో వాటి ప్రాధాన్యం అర్ధమవుతుంది.

- ఎస్.కె.కె. రవళి