మీకు తెలుసా ?

తిన్నది అరిగేందుకు పక్షం పడుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో కనిపించే ‘వొమ్‌బొట్’ అనే జీవి గట్టిగా ఉండే ఆహారానే్న తింటుంది. గట్టి దుంపలు, బెరడు, వేర్లు ఇలా అన్నమాట. దీని ఉదరంలో విడుదలయ్యే ప్రత్యేక రసాయనాలు ఎంతటి గట్టి ఆహారాన్నైనా చిన్నచిన్న తునకలుగా మార్చేస్తాయి. అయితే ఒకసారి ఇది ఆహారం తింటే అది పూర్తిగా జీర్ణమవడానికి పదిహేనురోజులు పడుతుంది. మనుషులు తిన్న ఆహారం పూర్తిగా అరగడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే అవసరమవుతుంది. ఇక ఇది బొరియలు తవ్వడంలో నైపుణ్యం కల జీవి. 650 అడుగుల పొడవైన మార్గాలను, ఒకదానిలోంచి ఒకదానిలోకి వెళ్లేందుకు వీలుగా విభిన్నమైన రీతిలో చాలా మార్గాలను, బొరియలను తవ్వుతుంది. కానీ రోజూ వెళ్లివచ్చేందుకు వాటిలో ఒకటిరెండింటినే ఉపయోగిస్తుంది. దీని శరీరంలో పృష్ఠ్భాగం చాలా ధృడంగా ఉంటుంది. అక్కడి చర్మంకూడా గట్టిగా ఉంటుంది. అందుకే శత్రువులు వెంటపడినప్పుడు వేగంగా పరిగెట్టి తన బొరియలోకి తలపెట్టి దూరిపోతాయి. పృష్ఠ్భాగాన్ని శత్రువుకు కనిపించేలా ఉంచుతాయి. పొరపాటున ఆ శత్రు జీవులు బొరియలోకి తొంగిచూస్తే వాటిని తన పృష్ణ్భాగంతో బొరియ పైభాగానికి నొక్కి చంపేస్తాయి. ఇది దాని రక్షణ టెక్నిక్‌లలో ఒకటి. కంగారూల మాదిరిగా వీటి ఉదరంపై చిన్న సంచి ఉంటుంది. వాటిలోనే పిల్లల్ని సాకుతుంది. అయితే కంగారూల ఉదరంపై ఉండే సంచీకి భిన్నంగా ఇది వెనుకకు తెరుచుకుని ఉండటం విశేషం. ముందరి కాళ్లతో బొరియలు తవ్వినపుడు ఆ మట్టి సంచుల్లో పడకుండా ఈ ఏర్పాటన్నమాట.

- ఎస్.కె.కె. రవళి