మీకు తెలుసా ?

ఇవి ఎక్కువగా ఉంటే కాలుష్యం లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్లులు, కప్పల మాదిరిగా కనిపించే ‘సలమాండర్’లు విభిన్నమైన ఉభయచర జీవులు. వీటిలో మైన్యూట్ సలమాండర్ జాతి జీవులు కేవలం ఒకటిన్నర మిల్లీమీటర్ పొడవుంటే చైనా జెయింట్ సలమాండర్ ఏకంగా ఆరు అడుగుల పొడువుంటుంది. స్లిమ్‌గా ఉండే సున్నితమైన, అందమైన చర్మం వీటి సొత్తు. బల్లులు, ఇతర ఉభయచరాల చర్మంకన్నా ఇది కాస్త భిన్నంగా, ఒకరకమైన జిగురుపదార్థంతో ఉంటుంది. ఇది విషతుల్య పదార్థం. శత్రువుకు చిక్కినా ఈ పదార్థం వల్ల అవి తినలేవు. వీటి చర్మం అతి సున్నితంగా ఉండటం వల్ల కాలుష్యాన్ని, విషవాయువులను తట్టుకోలేవు. గాలిలోని విషాలు వీటి శరీర భాగాల్లోకి చర్మంద్వారా వెళ్లడం వల్ల అవి మరణిస్తాయి. అందుకే కాలుష్య ప్రాంతాల్లో అవి మనుగడ సాగించవు. అవి ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ కాలుష్యం జాడలేదని అర్థం. ఇది జీవశాస్త్ర పరిశోధకుల అభిప్రాయం. ఇవి ఊపిరితిత్తులు, మొప్పలు, చర్మం ద్వారా శ్వాసిస్తాయి. నీటిలో, నేలపై, గాలిలో ఎగిరినప్పుడు అవసరాన్నిబట్టి గాలిని పీలుస్తాయన్నమాట. జతకట్టేముందు ఆడవాటిని ఆకర్షించేందుకు మగ సలమాండర్‌ను నీటిలో చేసే డ్యాన్స్ విచిత్రంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి