మీకు తెలుసా ?

కాళ్లు తెగినా మళ్లీ పెరుగుతాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వందకాళ్ల జెర్రి’, ‘శతపాది’ అని మనం పిలిచే ‘సెంటిపెడె’కు నిజంగా అన్ని కాళ్లుండవు. మహా అయితే 15నుంటి 30 జతల కాళ్లుంటాయంతే. మొదటి జత కాళ్లు నడవడానికి ఉపయోగించవు. విషంతో కూడుకున్న ఆ రెండు కాళ్లతో ఆహారాన్ని పట్టుకోవడం లేదా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కుట్టడానికి ఉపయోగిస్తాయి. ఫలకాల గదులతో (షెల్) కూడిన శరీరంతో అతివేగంగా నడిచే జీవి ఇది. ప్రతి షెల్‌కు ఒక జత కాళ్లుంటాయి. ప్రమాదం ముంచుకొచ్చినపుడు శత్రువులనుంచి తప్పించుకునేందుకు ఇవి కాళ్లను వదిలేస్తాయి. లేద ప్రమాదంలో కాళ్లను కోల్పోతాయి. ఆ తరువాత మళ్లీ వాటికి కాళ్లు పెరుగుతాయి. (బల్లుల తోకల మాదిరిగా). అయితే వెంటనే కాకుండా చర్మం లేదా పై పొరలు (మోల్టింగ్) వదిలినప్పుడు ఈ ఎదుగుదల కన్పిస్తుంది.వీటిలో 8000 జాతులున్నప్పటికీ గుర్తించినవి 3వేల లోపే. సంథిపాద జీవుల్లో (ఆంత్రోపొడ) విషపూరితమైన జీవి జెర్రి మాత్రమే. ఆఫ్రికాలో కన్పించే కొన్ని జాతుల జెర్రులు 12 అంగుళాల వరకు పెరుగుతాయి. ఇవి ఎలుకలు, చిన్నచిన్న పక్షులను కూడా పట్టుకుని తింటాయి.

ఎస్.కె.కె.రవళి