మీకు తెలుసా ?

షికాకాయ్‌లో పనికిరానిది లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం షికాకాయ్‌ని తలంటుకోవడానికి, హెయిర్ కండిషనర్‌గా ఉపయోగిస్తాంకదా. కానీ దానికంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఔషధాల్లోను, షాంపూల తయారీలోను, బట్టలు ఉతికే పదార్థంగానూ, ఆహార పదార్థాల తయారీలోనూ వాడతారు. తుమ్మజాతికి చెందిన షికాకాయ్ చెట్ల ఆకులు, బెరడు, కాయలు, గింజలు అన్నీ ఉపయోగకరమైనవే. వీటి బెరడులో ఉండే సపోనిన్ చర్మరక్షణకు పనికొస్తుంది. వీటి ఆకులు కొన్ని రకాల పచ్చళ్లలో వాడతారు. గింజలు, కాయలు, ఆకులతో నూరిన ముద్దను జుత్తుకు పట్టిస్తే శరీరం చల్లబడుతుందని చెబుతారు. ఇక కాశ్మీరీ దుస్తులను శుభ్రం చేయడానికి షికాకాయ్ రసాన్ని ఉపయోగిస్తారు.

తుమ్మెదలే లేకపోతే...
ప్రపంచంలో 80శాతం పంటలు పండటానికి తుమ్మెదలు, తేనెటీగలే కారణం. పువ్వుల్లోని పుప్పొడిని ఇతర పువ్వుల్లోకి చేరేలా అవి చేస్తాయి. అందువల్ల ఫలదీకరణం జరిగి పంటలు పండుతాయి. ఆధునిక కాలంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంవల్ల ఇప్పుడు తుమ్మెదలు, తేనెటీగలు తగ్గిపోతున్నాయి. ఇవి నశిస్తే పంటలగతేమిటో అర్థం చేసుకోవాలి. తేనెటీగలకన్నా తుమ్మెదలవల్లే ఎక్కువ పంటల ఫలదీకరణం జరుగుతోంది. ఆడ తుమ్మెదలకు మాత్రమే వాటి శరీరం వెనుక సూదిలాంటి ముల్లుంటుంది. ఆడ తేనెటీగలకు ఉన్నట్లే. కానీ తేనెటీగలు ఎవరిపైనా ముల్లుతో దాడి చేస్తే అవి మరణిస్తాయి. కానీ తుమ్మెదలు మరణించవు. తుమ్మెదలు తేనెను తింటాయి. దాచవు. కానీ తేనెటీగలు దాచి, తింటాయి. ఇవి ఎగిరినప్పుడు వీటి రెక్కలు సెకనుకు 130 సార్లు కొట్టుకుంటాయి.

జెల్లీ ఫిష్ చేపకాదు... ఎన్నటికీ మరణించదు
చేపకాని చేప అంటే ఇదే. వీటికి కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు, రక్తం, ఎముకలు, దంతాలు లేవు. ‘నెర్వ్‌నెట్’ అనే వ్యవస్థద్వారా నాడీమండలం పనిచేస్తుంది. పలుచటి గొడుగులాంటి శరీరంవల్ల ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టంకాదు. వీటిలో కొన్నిరకాలు చీకట్లో మెరుస్తూంటా. ఇవి స్వయంగా క్లోనింగ్ చేసుకోగలవు. అందువల్ల వీటికి మరణం అంటూ లేదు. శత్రువులు దాడి చేస్తే ముక్కలుముక్కలుగా అయిపోయినా ఆ ముక్కలు మళ్లీ ఎదుగుతాయి. నీటిలో సంచరించే వీటిని చూసి నేర్చుకోవలసిన ఎన్నో అంశాలున్నాయంటారు శాస్తవ్రేత్తలు. ప్రొఫెల్లింగ్, అణురియాక్టర్ల నిర్వహణ, క్లోనింగ్‌వంటి విషయాలపై ఇవి ఎన్నో రహస్యాలను వెల్లడిస్తున్నాయట. 650 మిలియన్ సంవత్సరాల క్రితమే వీటి ఉనికిని కనుగొన్నారు. అన్నట్లు వీటిలో 10వేల రకాలున్నాయట తెలుసా. అందులో ఒకటి మాత్రం విషపూరితం. అది దాడిచేస్తే రెండుమూడు నిమిషాల్లో మనిషి ప్రాణం పోతుంది.

పెసలతో ఐస్‌క్రీమ్...కేక్
అట్లు, పచ్చళ్లు, వంటకాల్లో పెసలు వాడటం మనకు కొత్తకాదు. చైనా, ఇండియా, కొన్ని ఆసియాదేశాల్లో ఇది మామూలే. ఇప్పుడిప్పుడే అమెరికా, కొన్ని యూరోప్ దేశాల్లోనూ పెసల వాడకం పెరిగింది. కానీ చైనా, తైవాన్‌లో వీటితో మనకు తెలీని కొత్త పదార్థాలు తయారు చేస్తారు. వాటికి మంచి డిమాండ్‌కూడా ఉంది. తైవాన్, చైనాల్లో పచ్చటి పెసలతో మూన్‌కేక్ తయారు చేస్తారు. ఇండోనేషియాసహా మరికొన్ని దేశాల్లో ఐస్‌పాప్, ఐస్‌క్రీమ్, ఐస్‌ఫ్రూట్‌లూ తయారు చేస్తారు. చైనా, జపాన్, తైవాన్‌లలోకన్నా ఇక్కడ వీటికి డిమాండ్ ఎక్కువ.

-ఎస్.కె.కె.రవళి