మీకు తెలుసా ?

ఎర్ర ఉడతకు పైన్‌కోన్ అంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో కన్పించే ఈ ఎర్ర ఉడతలకు పైన్‌కోన్ అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆహారాన్ని రెండుచేతులతో గట్టిగా పట్టుకుని తినడం వీటి అలవాటు. కానీ పైన్‌కోన్ అంటే తెగ ఇష్టపడే ఇది ఏదో ఒక చేత్తోనే దానిని పట్టుకుని ఆస్వాదిస్తూ ఆరగిస్తుంది. వీటి శరీరంపై బొచ్చు ఎర్రగా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. సంవత్సరానికి రెండుసార్లు శరీరంపై బొచ్చును విడుస్తుంది. అలాగే పెద్దగా ఉండే వీటి చెవులపై ఉండే బొచ్చు (వెంట్రుకలను) సంవత్సరానికి ఒకసారి విడుస్తుంది. జీవితంలో ఎక్కువభాగం చెట్లపైకొమ్మల్లోనే ఉండటం దీనికి అలవాటు. అన్నట్లు మిగతా ఉడతలకన్నా పెద్దగా ఉండే దీని తోక శరీరం పొడవుకన్నా పెద్దగా ఉంటుంది. అయితే బూడిదరంగు ఉడతల వల్ల వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.

మునగలో మనమే ఫస్ట్
హిమాలయ సానువుల్లో పుట్టి ఆసియా అంతటా అల్లుకుపోయిన మునగ ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం. మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌దే మొదటిస్థానం. బెరడు, కాయలు, గింజలు, ఆకులు, చివరకు వేర్లుకూడా పనికొచ్చే చెట్టు మునగ. ఆహారం, ఔషధం, కాస్మొటిక్స్ తయారీకి మునగ ఉపయోగపడుతుంది. వీటి గింజలతో తీసే ‘బెన్ ఆయిల్’కు రుచి, వాసన ఉండవు. చాలా స్పష్టంగా కన్పిస్తుంది. దీనిని వంటల్లో అరుదుగా వాడతారు. బయోఫ్యూయల్‌గా పనిచేస్తుంది.

వలసవెళ్లినా పుట్టినచోటుకు వచ్చేస్తాయ్
ఉత్తర అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో కన్పించే సాల్మన్ చేపల ప్రత్యేకతలు అన్నీఇన్నీకావు. మంచినీటి నదులు, సరస్సుల్లో పుట్టి సముద్రాలకు వలసవెళ్లిపోయే ఈ చేపలు సంతానోత్పత్తికోసం మళ్లీ పుట్టినచోటును వెతుక్కుంటూ వచ్చేస్తాయి. వలసకు, మళ్లీ పుట్టిన ప్రాంతానికి చేరుకోవడానికి అవి వేలాదిమైళ్లు ప్రయాణిస్తాయి. భూఅయస్కాంతశక్తి, జలతరంగాల శక్తి, సునిశితమైన ఘ్రాణశక్తి, పుట్టినచోటినుంచి వలసవెళ్లిన ప్రాంతంవరకు అవి విడుదల చేసే కొన్ని రసాయనాల వాసనబట్టి అవి తరతరాలుగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మంచినీటిలో ఉన్నప్పుడు, సముద్రజలాల్లో ఉన్నప్పుడు భిన్నమైన రంగుల్లో కన్పించే ఈ చేపలు కనీసం 2వేల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. పుట్టిన ప్రాంతానికి చేరుకోవడానికి ఎదురొచ్చే నీటిప్రవాహాన్ని, అడ్డంకులను ఎదుర్కొని అవసరమైతే 7 మీటర్ల ఎత్తును అధిగమించి ఎగురుతూ గమ్యానికి చేరుకుంటాయి. నీటి అడుగున నేలపై గులకరాళ్లను తోకలతో చెదరగొట్టి, గొయ్యిచేసి అందులో గుడ్లు పెట్టి, మగచేపలు వచ్చి ఆ గుడ్లపై ‘స్పెర్మ్’ను విడుదల చేశాక ఆ గోతులను రాళ్లతో కప్పి మరోచోటికి వెళ్లడం ఆడసాల్మన్ చేపల ప్రత్యేకత. అలా ఏడుచోట్ల గుడ్లను పెట్టడం వాటికి అలవాటు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అవి మరణిస్తాయి. సాధారణంగా పింక్, బ్లూ, సిల్వర్ రంగుల్లో కన్పించే ఇవి ఉప్పునీరు, మంచినీటిలో ఉన్నప్పుడు భిన్నమైన రంగులు కన్పిస్తాయి.

వీటి తోకలు పెద్దవి...చెవులు చిన్నవి
మలేషియాలోని బోర్నియాలో మాత్రమే కన్పించే ‘పిగ్మీ ఏనుగులు’ ఏనుగుల ఉపజాతిలో అన్నింటికన్నా చిన్నవి. మిగతా ఏనుగులతో పోలిస్తే వీటి చెవులు చిన్నవిగానే ఉంటాయి. అయితే వీటి తోకలు మాత్రం పొడవుగా ఉంటాయి. కొన్నింటి తోకలు నేలను తాకుతూంటాయికూడా. ఈ పిగ్మీ ఏనుగుల్లో ఆడవాటికి సాధారణంగా దంతాలు ఉండవు. ఉన్నా చాలా చిన్నవే అయి ఉంటాయి. నోరు బాగా తెరిచినప్పుడు మాత్రమే అవి కన్పిస్తాయి. ఇండోనేషియాలో ఒక ప్రాంతంలోకూడా ఒకటీఅరా ఇవి కన్పిస్తాయి. బోర్నియా ఎలిఫేంట్స్‌గా పిలిచే ఈ పిగ్నీ ఏనుగుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆయిల్‌పామ్ మొక్కల పెంపకంకోసం అడవులను నరికేస్తుండటంతో వీటి మనుగడకు ముప్పు ఏర్పడింది.

-ఎస్.కె.కె.రవళి