మీకు తెలుసా ?

‘సన్ బేర్’కు ఆ పేరు ఎలా వచ్చింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలేసియా, వియత్నాం, థాయ్‌లాండ్, భారత్ తదితర ప్రాంతాల్లో కనిపించే ‘సన్ బేర్’ ఎలుగుబంట్లు ‘బేర్’ జాతి జీవుల్లో అతి చిన్నవి. ఐదారు అడుగుల ఎత్తు పెరిగే వీటికి ఛాతీపై సూర్యుడిలాంటి పసుపు లేదా జేగురు రంగు మచ్చ ఉండటం వల్ల వాటికి సన్‌బేర్ అన్న పేరు వచ్చింది. మొక్కల చాటున నక్కి ఉండి శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించే ఇవి తేనె, చెదలు, చీమలను ఎక్కువగా తింటాయి. పుట్టలు, పట్లు, చెట్ల దుంగల మధ్య ఉండే పురుగులను నాలుకతో ఊర్చి తింటాయి. అందుకే మిగతా ఎలుగుబంట్లకు భిన్నంగా వీటి నాలుకు పది అంగుళాల పొడవుంటుంది. వీటి చేతులు, కాళ్లకు ఉండే గోళ్లు మిగతా జాతి ఎలుగులుకన్నా బలంగా ఉంటాయి. చెట్ల కాండాన్ని, దుంగలను చీల్చడానికి వీలుగా ధృడంగా ఉండటం వీటి స్పెషాలిటీ.

- ఎస్.కె.కె. రవళి