మీకు తెలుసా ?

ఒకే శునకం.. మూడు రూపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూడిల్ జాతి శునకాల ప్రత్యేకతలు తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. జర్మనీలో పుట్టిపెరిగిన ఈ శునకాలు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన, ఆదరణ పొందిన రెండవజాతిగా గుర్తింపు పొందాయి. ఫ్రాన్స్, అమెరికాలో వీటిని ఎక్కువగా పెంచుకుంటున్నారు. కొత్త విషయాలను సులువుగా, చురుకుగా నేర్చుకోవడం, పరిస్థితులకు తగ్గట్లు మసలుకోవడం, కుటుంబ సభ్యులతో ఆడుకోవడం, యజమాని చెప్పే ట్రిక్‌లను త్వరగా నేర్చుకుని అనుకరించడం వీటి ప్రత్యేకత. ఆరేడు రంగుల్లో కనిపించే ఈ పూడిల్ శునకాలు మూడు సైజుల్లో ఉంటాయి. పొట్టిగా ఉండేవాటిని టాయ్ పూడిల్స్ అని, మధ్యతరహాలో ఉండేవాటిని మినియేచర్ పుడిల్ అని, కాస్తంత పెద్దగా ఉండేవాటిని స్టాండర్డ్ పుడిల్ అని పిలుస్తారు. ఇవి బతికి ఉన్నంతకాలం వీటి బొచ్చు పెరుగుతూనే ఉంటుంది. పొడవైన మూతి, కోలకళ్లు, గుండ్రటి చెవులు, నిటారుగా ఉండే తోక, ఒతె్తైన బొచ్చు వీటికి అందాన్నిస్తాయి. నీటిలో బాతుల వేటకు వీటిని వినియోగిస్తారు. నీటిలో మునిగిపోకుండా వీటికి ఆ బొచ్చు ఉపకరిస్తుంది. వీటిని ‘డక్‌డాగ్’, ‘్థరపీడాగ్’ అని కూడా పిలుస్తారు. మానసిక, శారీరక సమస్యలతో బాధపడేవారికి స్వస్థత చేకూర్చడంలో ఇవి ఎంతగానో ఉపయోగడపతాయి.

- ఎస్.కె.కె. రవళి