మీకు తెలుసా ?

లతలా పెరిగే రోబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవనాల శిథిలాలు, ఇరుకైన, లోతైన, సన్నని ప్రదేశాల్లోకి కూడా చొచ్చుకుపోయే ఒక సరికొత్త రోబోను రూపొందిస్తున్నారు. తీగజాతి మొక్కల్లోని లతల్లా పెరుగుతూ సూక్ష్మ ప్రదేశాల్లోకి వెళ్లిపోయే రోబో అన్నమాట ఇది. ఒక గొట్టంలా ఉండే ఈ రోబో ఒకవైపు భాగం స్థిరంగా, కదలకుండా ఉంటుంది. రెండో కొస పెరుగుతూ మనం ఇచ్చే ఆదేశాల ప్రకారం పెరుగుతూ వెళుతుంది. ఆ పెరిగో కొన చివర్లో ఉండే అతి సూక్ష్మ, చక్కగా పనిచేసే కెమెరా అమర్చి ఉంటుంది. అది చొచ్చుకువెళ్లిన ప్రాంతాల్లోని దృశ్యాలను చిత్రీకరించి పంపుతుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో వీటివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్, కొన్ని రకాల రసాయనిక పదార్థాలను వీటి తయారీకి వినియోగిస్తారు. తీగమొక్కల్లా పెరగే ఈ గొట్టపు రోబో పెరగడానికి ఆ గొట్టాల్లోకి గాలి లేదా ద్రవాలను వినియోగిస్తారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సరికొత్త రోబోను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన ఆలోచనలు, వివరాలను గతనెలలో ప్రచురితమైన రోబోటిక్ సైన్స్ పేపర్‌లో ప్రచురించారు. ప్రకృతిలో సహజసిద్ధంగా పెరుగుతూపోయే తీగజాతి మొక్కలు, ఫంగస్, నాడీకణాల స్ఫూర్తితో పరిశోధనలు చేసి ఈ రోబో తయారీకి సిద్ధమయ్యారు. తేలికైన, మృదువైన, ఎదిగే రోబో తయారీకి ఇప్పటికే ఎన్నో పరిశోదనలు చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంలో ఈ పెరుగుతూవెళ్లే రోబోలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయో పరిశీలించారు. ఒక గొట్టంలా ఉండే ఈ రోబోలో సాక్స్ మాదిరిగా తనలో ట్యూబ్‌లాంటి మెటీరియల్‌ను ఇముడ్చుకుని ఉంటుంది. ఒకవైపు నుంచి గాలి లేదా ద్రవాలను ప్రెషరైజ్ చేస్తే రెండోవైపు పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రక్రియలో పెరిగే భాగం మినహా మిగతాది కదలదని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలియట్ హాకెస్ వివరించారు. ఓ ఇరుకైన ప్రాంతంలోకి ఈ రోబోను పంపినపుడు ఆవతలి అంచు తగిలేవరకు ఇది పెరుగుతూ వెళుతూనే ఉంటుందని వారు వివరించారు. రాళ్లు, నీళ్లు, ఫ్లైపేపర్, ఐస్‌వాల్‌పై కూడా పాకుతూ ఇవి సెన్సార్‌ల ద్వారా వివరాలను, దృశ్యాలను అందిస్తాయి. వంద కిలోల బరువున్న పైభాగాన్ని తట్టుకుని ఈ రోబో చొచ్చుకుపోయిన విధానం పరిశోధకులను విస్మయపరచింది. ఈ రోబో పెరుగుతూ కుడి, ఎడమలకు తిరిగేందుకు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎదురుగా ఉండే వస్తువులు, అడ్డంకులకు సంబంధించిన దృశ్యాన్ని ఈ పెరిగే కొనవైపున ఉన్న కెమెరా పంపిస్తుంది. దానిని చూసి డైరక్షన్ మార్చుకోవడం ఈ రోబోకు తెలుసు. వీటి కదలిక, నియంత్రణ మరికొన్ని విషయాల్లో పరిశోధనలు పూర్తికావలసి ఉంది.

- ఎస్.కె.కె. రవళి