మీకు తెలుసా ?

వీటిని ‘డయానా’ కోతులని ఎందుకంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్ఛిమ ఆఫ్రికాలోని సియర్రాలియోన్, లైబీరియా వంటి దేశాల్లో కనిపించే ‘డయానా’ కోతులు ఓల్డ్ వరల్డ్ మంకీ జాతులకు చెందినవి. ఆకర్షణీయమైన రంగులు, పొడవైన తోక వీటికి ఉంటాయి. నుదుటి పైభాగంలో ఉండే తెల్లటి వెంట్రుకలతో కూడిన మార్కింగ్ వల్ల వీటికి ‘డయానా’ అన్న పేరు వచ్చింది. రోమన్లు వేటకు అధిదేవతగా భావించే ‘డయానా’ వాడే ధనస్సు ఆకారంలో ఈ కోతుల నుదుటి పైభాగంలో తెల్లవెంట్రుకలు అమరి ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. పెద్దసమూహాలుగా జీవించే ఈ కోతులు మిగతాజాతుల కోతులకన్నా వేగంగా ప్రమాదాన్ని పసిగట్టి వివిధ రకాల అరుపులతో సభ్యులను అప్రమత్తం చేస్తాయి. అందుకే కోతుల్లో ఇతర జాతులకు చెందినవి వీటికి సమీపంలో సంచరిస్తూ వాటి అరుపులను బట్టి సురక్షితంగా జీవించడానికి ఇష్టపడతాయి.

- ఎస్.కె.కె. రవళి