మీకు తెలుసా ?

జిరాఫీకి దగ్గరి జంతువు ఇదొక్కటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ జంతువు పేరు ‘ఒకాపి’. ఆకర్షణీయమైన రంగులో ఉన్నప్పటికీ శరీరంలో ముందు, వెనుకకాళ్లమీదుగా ఉండే చారలవల్ల అవి జీబ్రాల జాతికి చెందినవేమోనని చాలామంది భావిస్తారు. కానీ అవి జిరాఫీకి దగ్గరి జీవులు. నిజానికి జిరాఫీకి అతి సామీప్యం ఉన్న జీవరాశి ఇదొక్కటే. 6.5 అడుగుల ఎత్తు, 8.5 అడుగుల పొడవు పెరిగే వీటికి జిరాఫీ మాదిరిగా పొడవైన మెడ ఉంటుంది. 18 అంగుళాల ఊదారంగు నాలికి వీటికి ఉంటుంది. ముఖాన్ని, కళ్లను, చివరకు చెవులను కూడా ఇవి నాలుకతో శుభ్రం చేసుకోగలవు. దట్టమైన అడవుల్లో ఎవరికీ కనిపించకుండా బతకడం వీటికి ఇష్టం. అందువల్లే 1900 సంవత్సరం వరకూ బాహ్య ప్రపంచానికి వీటి గురించి తెలీదు. పుట్టినప్పుడు బలహీనంగా ఉండే వీటి దూడలు మొదటి ఎనిమిది వారాలు మలవిసర్జన చేయవు. శత్రువులకు వాటి జాడ తెలియకుండా ఉండేందుకే అవి అలా చేస్తాయన్నది జంతుశాస్త్ర నిపుణుల భావన.

- ఎస్.కె.కె. రవళి