మీకు తెలుసా ?

తిండిలేకుండా పదేళ్లు బతికేస్తాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకుమల్లే దీని శరీరవర్ణం ఉండటం వల్ల ‘ఒల్మ్’ చేపలను హ్యూమన్ ఫిష్ అని పిలుస్తారు. పాముల్లా, ఈల్ చేపల్లా ఉండే ఇవి స్లొవేనియా, క్రొయేషియా, ఇటలీ, బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాల్లోని సముద్ర గర్భంలో ఉండే గుహల్లో జీవిస్తాయి. వీటికి కళ్లు పూర్తిగా పనిచేయవు. నీటి నుంటి రక్షణకు పారదర్శకంగా ఉండే కనుపాపలు ఉంటాయి. వీటికి ఊపిరితిత్తులు ఉన్నా తలవెనుక ఉండే గుత్తుల్లాంటి గిల్స్‌తోనే శ్వాస తీసుకుంటాయి. ఆహారం లేకుండా అవి పదేళ్లపాటు జీవించగలవు. వాటి కాలేయంలో ఉండే గ్లైకోజిన్, లిపిడ్ పదార్థాలను ఆ సమయంలో అవి ఉపయోగించుకుంటాయి. పాముల్లా మెలి తిరుగుతూ ఈదటం వీటి అలవాటు. స్లొవేనియాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వేటి కేవ్ డ్రాగన్స్ అని కూడా పిలుస్తారు. వీటి జీవిత కాలం 60 ఏళ్ల పైమాటే. స్లొవేనియాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఓ నదీగర్భంలోని గుహలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గుహ పొడవు 24 కిలోమీటర్లు. వీటితోపాటు అనేక అరుదైన జాతుల జీవులు ఇక్కడ జీవిస్తున్నాయి. నిజానికి ఈ హ్యూమన్ ఫిష్ ఉభయచరమే అయినా నీటిలోనే ఎక్కువగా ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి