మీకు తెలుసా ?

ఒతె్తైన జుత్తే వాటి ప్రత్యేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో కనిపించే ఈ కోతులను ‘వూలీ మంకీస్’ అని పిలుస్తారు. దట్టంగా, నున్నగా, మెత్తగా ఉండే ఊలు లాంటి బొచ్చు వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ప్రశ్నార్థకాన్ని పోలినట్లు ఉండే కొనతిరిగిన పొడవైన తోక వీటికి అందాన్నిస్తుంది. ధృడంగా, బలంగా ఉండే ఈ తోక ఆధారంగా అది చెట్లపై వేళ్లాడుతూ ఆహారాన్ని తలకిందులు భంగిమలో తింటుంది. ఒకచెట్టుపైనుంచి మరోచెట్టుపైకి దూకి సంచరిస్తూంటాయి. గంటకు 35 మైళ్లవేగంగా అలా చెట్లపై దూకుతూ వెళ్లగల సామర్థ్యం వీటికి ఉంది. ముదురు బూడిద, నలుపు, జేగురు రంగుల్లో ఇవి ఉండొచ్చు. బొచ్చు ఏ రంగులో ఉన్నా వీటి అరచేతులు మాత్రం ఊదారంగులో ఉంటాయి. వీటి బొచ్చు, మాంసం స్థానిక గిరిజన తెగలకు బాగా ఇష్టం. అందువల్లే వాటికి ముప్పు ఏర్పడుతోంది. కొలంబియా, వెనిజులా, బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, పెరు దేశాల్లో ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి