మీకు తెలుసా ?

చైనాలో పుట్టిన కివీ ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగు, ఆకారంలో కివీ పక్షుల్లా కన్పించే కివీ పళ్లు నిజానికి పుట్టింది చైనాలో. చైనీస్ గూస్‌బెర్రీగా వీటిని మొదట పిలిచేవారు. 1970వరకు ఇదే పేరుండేది. చైనానుంచి అమెరికాకు, అక్కడినుంచి న్యూజిలాండ్‌కు పరిచయం అయిన తరువాత వీటి పేరు మార్చారు. న్యూజిలాండ్‌లో మాత్రమే జీవించే కివీ పక్షుల్లా ఇవి ఉండటం వల్ల వాటికి కివీ పళ్లుగా పిలవడం ప్రారంభమైంది. 1974నాటికి కివీ ఫ్రూట్‌గా పేరు ఖరారై వ్యాపారానికి ఓ బ్రాండ్‌గా మారిపోయింది. చైనా జాతీయ ఫలంగా ఇప్పటికీ కివీ పండే ఉంది తెలుసా. ఈ పళ్ల ఉత్పత్తిలో చైనా ఇప్పటికీ అగ్రస్థానమే. న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కమలాఫలంలోకన్నా ఎక్కువ మోతాదులో సి విటమిన్ ఉండే ఈ ఫలం లోపలి గుజ్జు ఆకుపచ్చగా, మెత్తగా, రుచికరంగా ఉంటుంది. పండు మధ్యలో ఎర్రనిరంగులో, వృత్తాకారంలో గింజలుంటాయి. సరే ఈ పళ్లతో పానీయాలే కాదు ఐస్‌క్రీమ్‌లు, కేండీలు తయారు చేస్తారు.

ఎస్.కె.కె.రవళి