మీకు తెలుసా ?

అంటార్కిటికాలో సరికొత్త జీవప్రపంచం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఇంతవరకూ చూడని, మనకు తెలియని కొత్త జీవజాతులతో కూడిన ప్రపంచం అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఉండి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. మొక్కలు, ఉభయచర జీవులు, జలచరాలు, జంతువులకు చెందిన వినూతన, విభిన్న జీవజాతులకు మనుగడ సాగిస్తుండవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. అత్యంత శీతల పరిస్థితులకు నెలవైన అంటార్కిటికాలో అలాంటి అవకాశం లేదని ఇంతకాలం భావిస్తున్నప్పటికీ తాజా అధ్యయనాలు ఈ భావనకు ఊపిరులూదుతున్నాయి. ఈ రహస్య జీవజాతుల ప్రపంచం గురించి కొందరు శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితాలను వివిధ జర్నల్స్‌లో ప్రచురించారు. నిజానికి అంటార్కిటికాలో మైనస్ 30కు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ జీవజాతుల మనుగడ చాలా కష్టం. అతి తక్కువ జీవజాతులే అక్కడ జీవిస్తున్నాయి. అయితే అంటార్కిటికా మంచు ఫలకాల దిగువన అగ్నిపర్వతాల వ్యవస్థ ఉందని, అవి చురుకుగా ఉన్నప్పుడు, విస్ఫోటనం చెందినప్పుడు రహస్య గుహలు ఏర్పడ్డాయని, అక్కడ కనీసం 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని, అది సరికొత్త జీవరాశి పుట్టుకకు, మనుగడకు దోహదం చేస్తుందని, అందువల్ల మనకు తెలియని జీవరాశి అక్కడ ఉండి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. ఆ అగ్నిపర్వతాల వెదజల్లే ఆవిరి, వేడి, నిప్పు జీవరాశి ఏర్పడటానికి కారణభూతమవుతాయన్నది వారి అంచనా. ఉపరితలంలో గడ్డకట్టిన మంచు ఫలకాలున్నప్పటికీ దిగువనున్న వేడి వాతావరణంలో ఫలపుష్పజాతులతో పాటు జంతువులు కూడా ఉండి ఉండవచ్చునని వారి ఊహ. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీకి శాస్తవ్రేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఈ మేరకు కొన్ని ఆధారాలు లభించాయి. న్యూజిలాండ్ పరిధిలోకి వచ్చే అంటార్కిటికాకు చెందిన రోస్ ఐలాండ్‌లోని అగ్నిపర్వతం వౌంట్ ఎరెబస్ ఇప్పటికే చాలా నిప్పులు కక్కడానికి సిద్ధంగా, చురుకుగా ఉంది. శాస్తవ్రేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న కెరిడ్విన్ ప్రేసర్ చెబుతున్నది ఆ వాదనకు బలం చేకూరుస్తోంది. అంటార్కిటికా గ్లేసియర్ దిగువ యాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతం ఎరెబస్‌లోని గుహల నుంచి సేకరించిన డిఎన్‌ఎ, ఫోరెన్సిక్ శాంపిల్స్ ఆధారంగా ఆ ప్రాంతంలో కొన్నిరకాల ఆల్గే (మొక్కల్లాంటి జీవులు), నాచు, చిన్నచిన్న జంతువులు జీవించినట్లు తేలింది. ఆల్గే, నాచు, చిన్నచిన్న సకశేరుకాలన్నింటికీ దాదాపు డిఎన్‌ఎ ఒక్కలాగే ఉన్నట్లు వారు గమనించారు. మొత్తానికి అంటార్కిటికా గర్భంలో రహస్యంగా ఉన్న గుహల వ్యవస్థలో సరికొత్త జీవజాతి ఉందని భావిస్తున్నామని, మునుముందు మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని న్యూజిలాండ్‌లోని వైకటో వర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త ఛార్లెస్ లీ అంటున్నారు. పైన చాలా మందంగా మంచుగడ్డకట్టి ఉన్నప్పటికీ అగ్నిపర్వతాలు వెలువరిస్తున్న వేడి, వెలుతురు కారణంగా, అక్కడి గుహల్లో మనం టీ-షర్ట్ ధరించి సుఖంగా ఉండగలిగే వాతారవణం ఉందని ఫ్రేసర్ అంటారు. మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. అంతర్జాతీయ పత్రిక పోలార్ బయోలజీలో ఈ మేరకు పరిశోధనల వివరాలు ప్రచురించారు. ప్రస్తుతానికి లభించిన సమాచారం మేరకు అంటార్కిటికా అట్టడుగున దాదాపు 15 అగ్నిపర్వతాలు ఉంటాయని భావిస్తున్నారు. నిజానికి అలా ఎన్ని ఉన్నాయో, ఉంటాయో చెప్పలేకపోయినప్పటికీ కొన్ని ఆధారాల మేరకు ఈ అంచనాకు వచ్చారు. నిజానికి మా పరిశోధనలవల్ల అంటార్కిటికా అడుగున ఉన్న అగ్నిపర్వతాల గుహల్లో జీవజాతి మనుగడపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మరిన్ని పరిశీలనలు చేయాల్సి ఉందని వారు తేల్చారు. అయితే ఈ వాదనలను యూనివర్శిటీ ఆఫ్ మైనేకు చెందిన శాస్తవ్రేత్త ప్రొఫెసర్ లౌరి కొనె్నల్ కొట్టిపారేస్తున్నారు.

-ఎస్.కె.ఆర్.