మీకు తెలుసా ?

వీటికి మూడోకన్ను ఉంటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కరేబియ్ ద్వీపాల్లో మాత్రమే జీవించే ‘ఇగువన’ రకం బల్లిజాతి జీవులు చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కువ కాలం చెట్లపై జీవించే ఇవి దాదాపు 20 ఏళ్లపాటు మనుగడ సాగించగలవు. వీటిలో గ్రీన్ ఇగువన రకం జీవుల్లో తలపై భాగంలో మూడో కన్ను ఉండటం విశేషం. అయితే ఈ కన్ను దృశ్యాలను వీక్షించలేదు. కేవలం వేడి, వెలుతురు, చీకటి, సూర్యకాంతిలో మార్పులను మాత్రమే ఇది గుర్తిస్తుంది. 50 అడుగుల ఎతె్తై చెట్ల కొమ్మల్లో ఉండటం వీటికి ఇష్టం. దాదాపు ఆరున్నర అడుగుల పొడవున ఇవి పెరుగుతాయి. ప్రమాదం ఎదురైనప్పుడు శత్రువును తోకతో చరచి తప్పుకుంటాయి. మరీ వేగంగా తప్పించుకోవలసిన పరిస్థితి ఎదురైతే తోకను వదిలేసి పరుగుపెడతాయి. ఆ తరువాత వీటికి సాధారణ బల్లుల్లా తోకలు పెరుగుతాయి. చెట్లపై ఉండే ఇవి ఒక్కోసారి పట్టుతప్పి అమాంతం కిందపడిపోతుంటాయి. 50 అడుగుల పైనుంచి కిందపడినా వాటికేమీ కాదు.