మీకు తెలుసా ?

జీడిపప్పు ఉత్పత్తిలో నైజీరియా గొప్ప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికా దేశమైన నైజీరియా జీడిపప్పు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. నిజానికి ఆసియా దేశాలైన ఇండియా, చైనా, థాయ్‌లాండ్‌లలో జీడిపప్పును ఎక్కువగా వాడతారు. చాలా రకాల తీపి వంటకాల్లో ఇది లేకుండా చేయరు. నిజానికి జీడిపప్పులను అందించే జీడిమామిడికి బ్రెజిల్ పుట్టిల్లు. పోర్చుగీసు పర్యాటకుల పుణ్యమా అని ఇది మిగతా ప్రపంచానికి పరిచయం అయింది. తాజా పరిశోధనల ప్రకారం జీడిపప్పు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుందని తేలింది. అలాగే వీటిలో ‘బి’ గ్రూపు విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పప్పుల పైన ఉండే గట్టి పెంకుద్వారా వచ్చే అనకార్డిక్ యాసిడ్ కొందరికి పడదు. అన్నట్టు... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కొందరికి పాలు పడనట్లే జీడిపప్పులు కూడా పడవు. రసాయనిక, మద్యం పరిశ్రమల్లో జీడిమామిడిని ఉపయోగిస్తారు. దక్షిణ అమెరికా దేశాల్లో జీడిమామిడి పళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. వాటితో వంటకాలు, పళ్లరసాలు చేసుకుని తింటారు. నాటుమందుల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు.

- ఎస్.కె.కె. రవళి