మీకు తెలుసా ?

యాపిల్స్ లాంటి పియర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైభాగం కోలగా, దిగువభాగం వెడల్పుగా ఉండే పియర్స్ పళ్లు అందరూ చూసే ఉంటారు. కానీ అన్ని రకాల పియర్స్ అలానే ఉండవు. రూపం, రంగుల్లో చాలా తేడాలున్నాయి. పియర్స్‌లో దాదాపు 3వేల రకాలున్నాయి. క్రీస్తుపూర్వం 1134లోనే చైనాలో వీటిని సాగు చేశారు. స్టోన్‌సెల్స్‌తోకూడిన తెల్లని లేదా క్రీమ్ కలర్ గుజ్జుతో ఈ పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలు కూడా తిని అరిగించుకోగలిగే స్థితిలో ఇది ఉంటుంది. పియర్స్ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. అమెరికా, అర్జెంటినీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితో పండ్లరసాలు, సలాడ్లు, కేకులు ఇతర బేకరీ పదార్థాలు తయారు చేస్తారు. వీటి కలపతో వాద్య పరికరాలు, ఫర్నిచర్, ఆభరణాలు భద్రపరిచే షోకేసులు తయారు చేస్తారు. ఈ పళ్లు ఇచ్చిపుచ్చుకుంటే సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయని చైనీయులు విశ్వసిస్తారు. అన్నట్లు పొగాకు తెలియకముందు పియర్స్ ఆకులను సిగరెట్లు, బీడీలకు ముడి పదార్థంగా వాడేవారు. యాపిల్స్‌తో తయారు చేసినట్లే వీటిరసాన్ని పులియబెట్టి ఆల్కహాల్ కలిపి ‘పియర్ సైడర్’ అనే మద్యాన్ని తయారు చేస్తారు.

ఏనుగుల చుట్టాలు ఈ డుగాంగ్స్
నోరు, తల కాస్త ఏనుగులా, తోక తిమింగలాల్లో కన్పించే ఈ భారీ జలచరం పేరు డుగాంగ్. ‘లేడీ ఆఫ్ సీ’ అని దాని అర్థం. ఈ జీవికి ఉన్నన్ని పేర్లు మరోదానికి ఉండవనే చెప్పాలి. ‘సీ కేమల్’, ‘సీ పిగ్’, ‘సీ కౌ’, డుగాంగ్ ఇలా చాలాపేర్లతో వీటిని పిలుస్తారు. షార్క్ చేపలకున్నట్లు వీపుపై ‘్ఫన్’ ఉండదు. కానీ తోక తిమింగలాలకు ఉన్నట్లు ఉంటుంది. నోటి పై పెదవి గుర్రపు నాడా ఆకారంలో ముందుకు వంకీ తిరిగినట్లుంటుంది. ఏనుగు తొండంలా ముందుకు వంగి ఉంటుంది. సముద్రం అడుగుభాగంలో పెరిగే గడ్డి వీటి ఆహారం. నోటితో గడ్డిని తీసిన తరువాత వాటికి ఉండే ఇసుక వదిలేలా తలను విదిల్చి తినడం వీటి ప్రత్యేకత. జీవశాస్తర్రీత్యా ఇవి ఏనుగులకు దగ్గరి చుట్టాలని చెప్పొచ్చు. శరీర నిష్పత్తి ప్రకారం చిన్నమెదడు, చిన్నకళ్లు ఉన్న ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, (పసిఫిక్ సముద్రం), రెడ్‌సీ, ఈస్ట్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, జపాన్ తీరాల్లో కన్పిస్తాయి. ప్రపంచం మొత్తంమీద వ్యక్తులు లేదా సంస్థల సంరక్షణలో ఉన్నవి కేవలం ఐదు మాత్రమే. నూనె, మాంసానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎక్కువగా వేటాడటంతో వాటి సంఖ్య నానానిటికీ తగ్గిపోతోంది. నిజానికి ఇవి బూడిదరంగులో ఉన్నప్పటికీ వాటి శరీరంపై పెరిగే ఒకజాతి ఆల్గేవల్ల అవి వేరే రంగుల్లో కన్పిస్తూంటాయి.

‘సీ కుకుంబర్స్’కు మెదడు ఉండదు!
దోసకాయల మాదిరిగా గొట్టంలా శరీరం ఉండటంవల్ల ఈ జలచరాలకు ‘సీ కుకుంబర్స్’ అని పేరుపెట్టారు. వీటికి మెదడు ఉండదు. అలాగే ఊపిరితిత్తులూ ఉండవు. శరీరం చివర్లో (పృష్ట్భాగం) ఉండే ‘పాయువు’ ద్వారా ఇది శ్వాస తీసుకుంటుంది. శత్రువులనుంచి ముప్పు ఏర్పడితే ఇది ఒక దుర్వాసనతో కూడిన ద్రావకాన్ని (హొలొథురిన్) నోటితో చిమ్ముతుంది. ఇంకా ప్రమాదం అనుకుంటే నోట్లోంచి తన లోపలి శరీరాభాగాల్ని బయటకు విడిచిపెట్టి శత్రువును దారిమళ్లిస్తుంది. ఒకటినుంచి ఐదువారాల్లోగా మళ్లీ ఆయా భాగాలు దానికి ఏర్పడతాయి. ఆసియాలో వీటిని నాటువైద్యంలో వాడతారు. ఇరుకైన ప్రాంతాల్లోంచికూడా ఇవి వెళ్లిపోగలిగేలా శరీర ఆకృతిని మార్చుకోగలుగుతాయి. సముద్రగర్భంలోని నేలపై మనుగడ సాగించే ఇవి అరుదుగా ఉపరితలానికి వస్తాయి. వేటికవి పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ జతకట్టడం ద్వారానే ఆ పని చేయడానికి ఇష్టపడతాయి. స్టార్‌ఫిష్, సీ ఆర్చిన్స్ వీటి దగ్గరి బంధువులు. ఈ జలచరాలు ప్రపంచం అంతటా కన్పిస్తాయి.

ఆకులతో గూళ్లు సర్దుకునే తేనెటీగలు

ఆకులను గుండ్రంగా కత్తిరించి గూళ్లలో పరుపుల్లా అమర్చుకోవడం ఈ తేనెటీగల ప్రత్యేకత. ఈ ప్రత్యేకతవల్లే వీటికి ‘లీఫ్ కట్టర్ బీ’ అన్న పేరు వచ్చింది. గులాబీ, యాపిల్, రెడ్‌బడ్, సీడ్‌లింగ్ మేపల్, యాష్ మొక్కల ఆకులంటే వీటికి ఇష్టం. ఒక్కోసారి గులాబీ పూల రేకుల్నీ అవి కట్ చేసి తీసుకువెళతాయి. గొట్టాల్లాంటి గూళ్లలో ఈ ఆకులు లేదా పూల రేకులతో లైనింగ్ వేస్తాయి. చివరికొసనుంచి ఈ ఆకులతో ఒక్కో గదిలా అమర్చుకుంటూ వస్తాయి. ఆ గదిలో ఓ గుడ్డు, కొంత తేనె, పుప్పొడితోకూడిన ఓ హనీబాల్‌ను అమర్చి ఆకుతో సీల్ చేస్తాయి. ఆ గుడ్డులోంచి డింభకం తయారవడం, ఆ ఆహారాన్ని తిని ఎదగడం మామూలే. ఇలా ఒక్కో గూడులో ఐదారు గదులను ఇవి సిద్ధం చేస్తాయి. జతకట్టిన వెంటనే మగ తేనెటీగ మరణిస్తే ఆడ తేనెటీగ ఈ గూళ్లు సిద్ధం చేశాక మరణిస్తుంది.

ఎస్.కె.కె.రవళి