మీకు తెలుసా ?

దీని పళ్ల సంఖ్య 4వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూమీద అతిపెద్ద చేప... ‘వేల్‌షార్క్’. ఇది గరిష్టంగా 62 అడుగుల పొడవు, 30 టన్నుల బరువు ఉంటుంది. దీని నోరు 5 అడుగుల వెడల్పు ఉంటుంది. తడవకు (గంటకు) 1500 గాలన్ల నీటిని మింగుతుంది. ఆ నీటితోపాటు దక్కిన ఆహారాన్ని నోటిలో ఉంచుకుని నీటిని బయటకు వదిలేస్తుంది. ఇలా వడపోత కోసం దాని నోటిలో పది వరుసల్లో ‘్ఫల్టర్ పాడ్స్’ ఉంటాయి. దీని నోటిలో 36 వరుసల్లో చిన్నచిన్న పళ్లు దాదాపు 4వేల వరకు ఉంటాయి. మగవాటికన్నా ఆడవి పెద్దగా ఉంటాయి. గుడ్లను పొట్టలోనే పొదిగి పిల్లలు వచ్చాక బయటకు విడిచిపెడతాయి. అప్పుడే పుట్టిన వేల్‌షార్క్ పిల్ల రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఇవి మిగతా షార్క్‌లకన్నా శాంతచిత్తంతో ఉంటాయి. మనుషులతో స్నేహంగా వ్యవహరిస్తాయి. అందుకే డైవర్లకు ఇవంటే చాలా ఇష్టం.

ఎస్.కె.కె.రవళి