మీకు తెలుసా ?

ఈ పిల్లులు చేపలు పడతాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిషింగ్ క్యాట్ అని పిలిచే ఈ పిల్లుల కాళ్లు పొట్టిగాను, చిన్నగా, గుండ్రంగా ఉండే చెవులు, ముఖంతో కన్పిస్తాయి. ఈతలో ఇవి దిట్ట. నీటి ఉపరితలంపై కాళ్లతో తాకి, తేలికపాటి అలలను సృష్టించి చేపలను ఆకర్షిస్తాయి. చేపలు నీటిపైకి రాగానే పట్టుకుంటాయి. మధ్య, తూర్పు ఆసియా దేశాల్లో కన్పించే ఇవి శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. నీటి వనరులకు చేరువలో నివసిస్తాయి. నీటి ఉపరితలంపై జీవించే పక్షులనూ ఇవి వేటాడతాయి. నీటిలో ఈదేటపుడు తోకను ‘రడ్డర్’లా ఉపయోగించి దిశను మార్చుకోవడానికి, వేగాన్ని నియంత్రించుకోడానికి ఉపయోగించుకుంటుంది. వీటిముక్కు చదునుగా ఉంటుంది. తల్లిని చూసి పిల్లలు నీటిలో చేపలవేట నేర్చుకుంటాయి. పదినెలల వయసు వచ్చాక సొంతంగా బతకటం ప్రారంభిస్తాయి. వీటి ఆహారంలో మూడొంతులు జలచరాలే.

ఎస్.కె.కె.రవళి