మీకు తెలుసా ?

మాటువేసి చంపేసే యసాసిన్ బగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటువేసి, హఠాత్తుగా దాడిచేసి ప్రత్యర్థిని చంపేసే ఈ జీవిని ‘అసాసిన్ బగ్’ అని పిలుస్తారు. ఆహారాన్ని సేకరించడం, దాడి చేసే విధానాన్నిబట్టి దానికి ఆ పేరు వచ్చింది. దాదాపు 6వేల రకాలున్న ఈ జాతిలో విభిన్నరూపాల్లో, రంగుల్లో, సైజుల్లో ఉంటాయి. ఇవి వేటకు దిగితే 99శాతం విజయం సాధించాయన్నమాటే. ఇతర కీటకాలు, జీవులపై దాడి చేసి, వాటి వెన్నువిరిచి తినేస్తాయి. అయితే నేరుగా ఆహారాన్ని తీసుకోకుండా వాటి నోటిలో ఉండే ప్రత్యేకమైన గొట్టంలాంటి భాగంతో ఒకరకమైన లాలాజలాన్ని వాటి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. కొద్దిసేపటికి అవి ద్రవంగా మారిన తరువాత పీల్చుకుని తింటాయన్నమాట. వీటిలో కొన్ని రకాలు మనుషుల బుగ్గలు, నోటివద్ద వాలి రక్తాన్ని పీలుస్తాయి. వాటిని ‘కిస్సింగ్ బగ్స్’ అని పిలుస్తారు. చచ్చిపోయిన చెదలు, కీటకాలు, కుళ్లిన ఆకులు, పూలు ఎరగావేసి బతికి ఉన్న చెదలు, చీమలు, చిన్నచిన్న కీటకాలు, తుమ్మెదలు, తేనెటీగలను ఆకర్షించి దాడిచేసి చంపేయడం వీటికి అలవాటు. వీటిలో ఆడవాటికి వేటాడేశక్తి, యుక్తి చాలా ఎక్కువ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇవి ఉంటాయి. వీటి కాటువల్ల ప్రమాదాలు, రోగాలు తప్పవు. మనుషుల్లో గుండె విఫలమయ్యే వ్యాధులకు ఇవి కారణమవుతూంటాయి.

ఎస్.కె.కె.రవళి