మీకు తెలుసా ?

బాదం...లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమాదకరం కాని కొవ్వు పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఎంత తిన్నా నష్టం లేదు. రెండేళ్లదాకా నిల్వ ఉండే ఈ పప్పులు కొలెస్టరాల్ నియంత్రణకు, హృదయానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ పాలు పడనివారికి బాదంతో చేసే పాలు ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. ప్రస్తుతం బాదంపప్పుల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. నిజానికి బాదం ‘ట్రూ నట్’ కాదు. ఇది ఒక గింజమాత్రమే. వీటిపైన ఉండే కప్పు మనకి పనికిరాదు. పచ్చిగా ఉన్నా, బాగా పండిపోయినా బాదం పప్పులు తినడానికి పనికిరావు. అన్నట్లు బాదంపిండి గోధుమపిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. మధ్యప్రాచ్యంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన బాదం మనకూ సుపరిచితమే. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బాదంలో 40శాతం నోరూరించే వివిధ రకాల చాక్‌లెట్ల తయారీకే వినియోగిస్తున్నారు.

ఎస్.కె.కె.రవళి