మీకు తెలుసా ?

చిరుతలాంటి సీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు ఫలకాలు తేలే అంటార్కిటికా సముద్ర జలాల్లో జీవించే ‘లియోపార్డ్ సీల్’ అతి ప్రమాదకరమైన, భయంకరమైన జీవి. సీల్ జాతిలో ఇదే పెద్దది. దాదాపు 11 అడుగుల పొడవు, 400 కేజీల బరువుతో ఉండే వీటి శరీరంపై ఉండే నల్లని చుక్కల వల్ల చిరుతతో పోలుస్తారు. అందుకే వీటిని లియోపార్డ్ సీల్, టైగర్ సీల్, సీల్ లియోపార్డ్ అని పిలుస్తారు. రూపంలోనే కాదు వీటి జీవనశైలి కూడా చిరుతల్లా క్రూరంగానే ఉంటుంది. మిగతా సీల్స్‌కన్నా భిన్నంగా ఇది ఉంటుంది. పొడవైన మెడ, భయంగొలిపే కోరలు వీటి సొంతం. చిన్నచిన్న సీల్స్, చేపలు, స్క్విడ్స్, పెంగ్విన్, ఇతర సముద్ర పక్షులను అమాంతం పట్టుకుని కరకరా నమిలి తినేయడం వీటి అలవాటు. వేడిరక్తం ఉండే జంతువులను ఇది వేటాడుతుంది. మనుషులపట్ల కూడా ఇది దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఒక్కోసారి దాడికీ దిగుతుంది.

- ఎస్.కె.కె. రవళి