మీకు తెలుసా ?

శ్రేష్ఠమైన చందనం మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో చందనం ఉత్పత్తిలో భారత్, చైనా, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి మొదటి వరసలో ఉన్నప్పటికీ ‘ఇండియన్ శాండల్’ అత్యంత శ్రేష్ఠమైనదిగా గుర్తించారు. మానసిక సమస్యలకు చందనం మంచి ఔషధం. యాంటీబ్యాక్టీరియాగా పనిచేస్తుంది. ఔషధాలు, కాస్మొటిక్స్, ఫర్నిచర్, విగ్రహాలు, లేపనాలు, సుగంద్రనూనెల తయారీకి చందనాన్ని వినియోగిస్తారు. కుంగుబాటు, ఆందోళనతో ఉండేవారికి చందన పరిమళం హాయిని ఇస్తుంది. ఒత్తిడినీ తగ్గిస్తుంది. చల్లదనాన్ని ఇస్తుంది. ఇవన్నీ సరే అడవుల్లో చందనపు వృక్షాన్ని నరికి పడేసిన తరువాత కొన్ని నెలలు వదిలేస్తారు. వాటి బెరడును చెదలు, క్రిమికీటకాలు తినేసి అసలు దుంగను వదిలేస్తాయి. అప్పుడు ఆ దుంగలను ఉపయోగిస్తారు. ఆధునిక విధానాల్లోనూ వృక్షాల కాండాలపై బెరడు తొలగించి ముక్కలుగా చేస్తారు. చందనం, టేకు కలప పగుళ్లు రావడం, విచ్ఛిన్నం కావడం అంటూ సాధారణంగా ఉండదు. చందనపు మొక్కల ఉత్పత్తిలో మనదే అగ్రస్థానం.

- ఎస్.కె.కె. రవళి