మీకు తెలుసా ?

ఇది జెల్లీ ఫిష్ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ కనిపిస్తున్న సముద్రజీవి పేరు కాంబో జెల్లీ ఫిష్! కానీ ఇది జెల్లీ ఫిష్ జాతికి చెందినది కాదు. అసలు జెల్లీ చేపలతో ఎటువంటి సంబంధమూ లేని జాతి ఇది. పారదర్శకంగా కనిపించే కాంబో జెల్లీ చేపలు కుట్టలేవు. వీటి శరీరంలో 95 శాతం నీరే ఉంటుంది. దువ్వెనపళ్లలాంటి ఎనిమిది వరసల భాగాలతో ఇవి ఈదుతాయి. వీటిని సిలియా అని పిలుస్తారు. దువ్వెన పళ్లవరసలా ఇవి ఉంటాయి. అందుకే వీటిని కాంబో అని పిలుస్తారు. ఒక మిల్లీమీటరు నుంచి నాలుగు అడుగుల సైజు వరకు ఇవి పెరుగుతాయి. కోట్లాది కాంబో జెల్లీ చేపలు ఒక్కోసారి తరలిరావడంతో ఆయా సముద్రజలాల్లో స్థానిక జాతి చేపల మనుగడకు ప్రమాదం ఏర్పడటం మామూలే. నోరు, పొట్ట, నాడీ వ్యవస్థతో ఇది జీవిస్తుంది. చైనాలో వీటిని ఆహారంగా వినియోగిస్తారు. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే ఇవి జెల్లీఫిష్‌ల మాదిరిగానే ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి