మీకు తెలుసా ?

పిస్తా అంటే చైనీయులకు ప్రీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిస్తా ఉత్పత్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉన్నా వినియోగంలో మాత్రం చైనాయే టాప్. అక్కడి వారికి పిస్తా పప్పులంటే పిచ్చి. ఆరోగ్యం కోసం వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పిస్తా పప్పుల ఉత్పత్తిలోను, వినియోగంలోను అమెరికా రెండో స్థానంలో ఉంది. ఒక పిస్తా చెట్టు రెండేళ్లకు ఓసారి 50 కిలోల పప్పులను లేదా 50వేల పప్పుగింజలను ఇస్తుంది. మొదట
పిస్తా కాయలు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ పూర్తిగా ఎదిగేసరికి కాస్త పసుపు, ఎరుపు రంగుల్లోకి మారుతుంది. కాయపై పెంకు ఒకవైపు చిట్లి లోపలి పప్పు కనిపిస్తూ ఉంటుంది. ఈ పైపెంకు పాదరసం అవశేషాలను తొలగించేందుకు తయారు చేసే పదార్థంగా ఉపయోగపడుతుంది. కాంస్యయుగంలోనే వీటి సేద్యం మొదలైంది. మధ్యప్రాచ్యంలో వీటిని మొట్టమొదటిసారిగా సేద్యం చేశారు.

- ఎస్.కె.కె. రవళి