మీకు తెలుసా ?

ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఉండవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ‘్ఫంచ్’ పక్షులు ఒక్క ఆస్ట్రేలియాలో తప్ప ప్రపంచం అంతటా కనిపిస్తాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలం కాదు. నాలుగు ఉపజాతులు, 40 రకాల ‘్ఫంచ్’ పక్షుల్లో కామన్ ట్రూ ఫించ్ పక్షుల సంఖ్య ఎక్కువ. ఆడపక్షులు కాస్త లేత రంగుల్లో ఉంటే మగపక్షులు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. సాధారణంగా ఎర్రటి ముఖంతో ఉండే మగపక్షులంటే ఆడపక్షులకు ఎంతో ఇష్టం. మగపక్షులు తినే ఆహారాన్ని బట్టి (కరోటినాయిడ్స్) వాటికి మోము, ఛాతీపై ఎర్రటి రంగు వస్తుంది. అవి ఎంత ఎక్కువ, ఎంత బలమైన ఆహారం తింటే వాటి రంగు అంత ఎక్కువ మెరుపుతో ఉంటుంది. అందుకే తమ సంతతికి సరిపడా ఆహారాన్ని తెచ్చిపెట్టే శక్తి ఉంటుందన్న భావనతో అవి ఎర్రటి ముఖం ఉన్న మగపక్షులతో జతకడతాయి. పసుపు లేతా లేత వర్ణపు ముఖంతో ఉండే మగపక్షులు ఒత్తిడిలోను, తగినంత ఆహారం లేక బలహీనంగా ఉన్నట్లు అవి గ్రహించి వాటికి దూరంగా ఉంటాయి. ఒకవేళ వాటితో జతకడితే తమ సంతతి ఆకలితో అలమటిస్తాయన్నది వాటి భయమట. అన్నట్లు ఈ పక్షులు ఒంటరిగా జీవించలేవు. తోటి పక్షులతో కలసి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి