అవీ .. ఇవీ..

ఒక గూడు ఒక్కసారే వాడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొరిల్లాలు మనిషికి అతి దగ్గరి జీవులు. మన డిఎన్‌ఎకు వాటి డిఎన్‌ఎలకు తేడా కేవలం రెండు శాతమే. సౌంజ్ఞలు, సంకేతాలను బాగా అర్థం చేసుకోగల గొరిల్లాలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు చెట్లపై నివాసాలను ఆకులు, కొమ్మలతో అల్లుకుంటాయి. వయసు పెరిగే కొద్దీ నేలపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఏ గొరిల్లా అయినా ఒకసారి వాడిని గూడును మరోసారి వాడదు. భద్రత కోసమే అవి అలా చేస్తాయి. అన్నట్లు మనుషుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వేలిముద్రలు ఉన్నట్లే గొరిల్లాలకు వేటికి వాటికి నాసికాముద్రలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆఫ్రికా దేశాలైన ఉగాండా, రువాండా, కాంగో, నైజిరియా, ఈక్వెటేరియన్ గినియా, అంగోలా, కామరూన్, గబన్ దేశాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. జాలి, దయ, కరుణ, కోపం, విసుగు, ప్రేమ ఇలా దాదాపు ఎనిమది రకాల భావాలను ముఖంలో ప్రదర్శించగల నేర్పు వీటికి ఉంది. భాషలను అర్థం చేసుకోవడం, పరికరాలను వాడటం వీటికి తెలుసు.