మీకు తెలుసా ?

ఒక్కరోజులోనే ఈదగలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర అమెరికాకు చెందిన ‘స్నో గూస్’కు వాటి రంగును బట్టి అలా పిలుస్తున్నారు. తెల్లటి పొడవైన రెక్కలతో అవి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి రెండు రెక్కల పొడవు గరిష్టంగా ఆరు అడుగులు ఉంటాయి. అవి రెక్కలు విప్పార్చి ఎగిరితే వింతగా ఉంటుంది. లక్షల సంఖ్యలో కలసి గుంపుగా వేలాది మైళ్ల దూరం వలస వెళ్లడం వీటి ప్రత్యేకత. ఆ సమయంలో తెల్లటి మబ్బు కదులుతున్నట్లుగా అవి కనిపిస్తాయి. గాలిని చీలుస్తు యు ఆకారంలో అవి ప్రయాణం చేస్తాయి. గాలి ఒత్తిడిని ఎదుర్కొనే చిట్కా ఇది. శీతాకాలం అంతా ఒకచోట గడిపి వసంతం వచ్చేసరికి మరోచోటికి అవి వస్తాయి. ఆర్కిటిక్ టుండ్రాలో శీతాకాలం విడిదికి వెళ్లి దాదాపు ఆరునెలలు ఉంటాయి. ఆ తరువాత సంతానోత్పత్తికి తమ సొంత ప్రాంతానికి చేరుకుంటాయి. అవి గుడ్లుపెట్టి పొదిగిన వెంటనే పిల్లలు చురుకుగా ఉంటాయి. ఒక్కరోజులోనే తల్లితో కలసి కనీసం 50 మైళ్ల దూరం నడుస్తాయి. నీటిలో ఈదగలుగుతాయి. అయినా కొన్నివారాల పాటు తల్లితోనే అవి ఉంటాయి. జతకట్టిన రెండు పక్షులు జీవితాంతం కలసి ఉండటం వీటిలో విశేషం.

- ఎస్.కె.కె. రవళి