మీకు తెలుసా ?

బుడగలాంటి కవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ‘ప్యారట్ ఫిష్’లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట శత్రువుల నుంచి రక్షణకు వీలుగా అవి ఒకరకమైన జిగట పదార్థంతో తమ శరీరం చుట్టూ ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే పారదర్శకంగా ఉండే ఓ బెలూన్ మధ్యలో అవి సురక్షితంగా ఉంటాయన్నమాట. ఒక మగ ప్యారట్ ఫిష్ కొన్ని ఆడచేపలతో కలసి జీవిస్తుంది. ఒకవేళ ఆ మగ చేప మరణిస్తే, మిగిలిన ఆడ చేపల్లో ఒకటి తన రంగులను మార్చుకుని మగచేపగా మారిపోతుంది. అదే వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి